NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ ఊరట నిచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు ఇవేళ మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం జూన్ 1 వరకూ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.

Arvind Kejriwal

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిద సార్లు సమన్లు జారీ చేసింది. వాటికి కేజ్రీవాల్ స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్ లో జ్యూడిషియల్ కస్టడీలో ఉంటున్నారు.

ఇదిలా ఉండగా, తన అరెస్టు ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ పై విచారణ సందర్భంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ మంజూరు చేయవద్దంటూ ఈడీ వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. మద్యంతర బెయిల్ పై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోవాలని కేజ్రీవాల్ ను సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది.

అయితే లిక్కర్ స్కామ్ కేసు గురించి ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ మాట్లాడొద్దని ఈడీ తరపు న్యాయవాది కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం .. మీరు కూడా అంత కంటే గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సూచించింది. 21 రోజులు కేజ్రీవాల్ జైల్ లో ఉన్నా బయట ఉన్నా పెద్ద తేడా ఉండదని పేర్కొన్నారు. కాగా, కేజ్రీవాల్ కు జూన్ 4వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరగా.. ఆ అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోవాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

Related posts

YS Jagan: పార్టీ శ్రేణులకు సీఎం జగన్ సందేశం

sharma somaraju

Chandrababu: కౌంటింగ్ లో కూటమి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

sharma somaraju

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పై పిఠాపురం టీడీపీ నేత వర్మ సంచలన కామెంట్స్ .. తారక్ ఫ్యాన్స్ ఫైర్

sharma somaraju

అయిదు గంటల్లో ఆ రెండు నియోజకవర్గాల ఫలితాలు: సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Hema: రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు

sharma somaraju

BJP: నడ్డా నివాసంలో బీజేపీ కీలక భేటీ

sharma somaraju

సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ రికార్డు సాధించిన భారత్ ..64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్న ఈసీ

sharma somaraju

Naga Chaitanya: మ‌హేష్ బాబు వ‌ల్లే నాగ చైత‌న్య స్టార్ అయ్యాడా.. అక్కినేని హీరోకు ఆయ‌న‌ చేసిన హెల్ప్ ఏంటి?

kavya N

Krithi Shetty: ఆ హీరోతో ఒక్క‌సారైనా ఆ ప‌ని చేయాలి.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టేసిన బేబ‌మ్మ‌!

kavya N

Jagapathi Babu: సౌంద‌ర్య చ‌నిపోయింద‌న్న బాధ క‌న్నా ఆ విష‌య‌లే ఎక్కువ క‌ల‌వ‌ర పెట్టాయి.. జ‌గ‌ప‌తి బాబు షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Tollywood Actor Son: చిరంజీవి, బాల‌య్య మ‌ధ్య‌లో ఉన్న ఈ బుడ్డోడు ఓ స్టార్ హీరో కొడుకు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

పోస్టల్ బ్యాలెట్ అంశంపై సుప్రీం కోర్టులోనూ వైసీపీకి ఎదురుదెబ్బ

sharma somaraju

MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీం కోర్టులో షాక్ .. కీలక ఆదేశాలు

sharma somaraju

Klin Kaara – Kalki: రామ్ చ‌ర‌ణ్ కూతురు క్లిన్ కారాకు `క‌ల్కి` టీమ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. వైర‌ల్‌గా మారిన ఉపాస‌న పోస్ట్‌!

kavya N

Portugal: గాల్లో విన్యాసాలు చేస్తున్న రెండు విమానాలు ఢీ .. పైలట్ మృతి .. వీడియో వైరల్

sharma somaraju