NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబును మాయ చేసి జ‌న‌సేన సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్‌… ఏం ట్రిక్ రా బాబు..!

టీడీపీలో ఈక్వేష‌న్ మారిపోయింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టికెట్‌పై సందేహంతో కునుకు కూడా ప‌ట్ట‌ని ఆ పార్టీ కురువృద్ధుడు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రికి తాజాగా పార్టీ అధిష్టానం నుంచి తీపి క‌బురు అందినట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గోరంట్ల‌కు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ క‌ష్టాలు ప‌ట్టుకున్నాయ‌ని కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక్క‌డి టికెట్‌ను జ‌న‌సేన కోరుతోంద‌ని కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

The TDP leader who defeated Chandrababu and won the Janasena
The TDP leader who defeated Chandrababu and won the Janasena

దీంతో గోరంట్ల ఒకింత అల‌క‌పాన్పు ఎక్కారు. విష‌యం గ్ర‌హించిన‌.. పార్టీ అధినేత చంద్ర‌బాబు.. తాజాగా బుచ్చ‌య్య‌కే టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు పార్టీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని స్థానాల‌కు దాదాపు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. వీరిలో చాలా మంది పాత‌కాపు లే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే గోరంట్ల‌కు ఛాన్స్ ఇస్తూ.. నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌, ఈ టికెట్‌ను జ‌న‌సేన ఆశిస్తోంద‌ని ప్ర‌చారంలోకివ‌చ్చింది.

కానీ, బుచ్చ‌య్య‌కు లాస్ట్ చాన్స్ ఇవ్వాల‌ని నిర్ణయించుకున్న ద‌రిమిలా.. ఆయ‌న అభ్య‌ర్థిత్వం ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో బుచ్చయ్య చౌద‌రి.. పార్టీ అధిష్టానానికి లేఖ‌లు సంధించారు. త‌న‌కు ఇదే ఆఖ‌రి సార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌ప్పుకొంటాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. దీనికితోడు.. పార్టీ సిట్టింగ్ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను మార్చేది లేద‌ని.. చంద్ర‌బాబు గ‌తంలోనే ఇచ్చిన హామీ మేర‌కు బుచ్చ‌య్య వైపే పార్టీ మొగ్గు చూపిన‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, జ‌న‌సేన ప‌రంగా చూస్తే.. కందుల దుర్గేష్ .. రాజ‌మండ్రి రూర‌ల్ సీటు కోరుతున్నా.. ఆయ‌న‌ను వేరే నియోజ‌క‌వ‌ర్గానికి త‌ర‌లించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దుర్గేష్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన‌కు బ‌ల‌మైన నేత‌. జ‌న‌సేన‌లో నాదెండ్ల త‌ర్వాత ప్లేస్లో ఆయ‌న ఉన్నారు. పైగా బ‌ల‌మైన కాపు సామాజిక వ‌ర్గ నేత‌. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి పోటీ చేసి 40 + వేల పై చిలుకు ఓట్లు తెచ్చుకున్నారు. అక్క‌డ దుర్గేష్ అంత భారీగా ఓట్లు చీల్చ‌డంతోనే బుచ్చ‌య్య చౌద‌రి 11 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

The TDP leader who defeated Chandrababu and won the Janasena
The TDP leader who defeated Chandrababu and won the Janasena

ఇప్పుడు బుచ్చ‌య్య‌కు రాజ‌మండ్రి రూర‌ల్ ఇచ్చేసి దుర్గేష్‌కు కాకినాడ రూర‌ల్ సీటు ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, దీనిని దుర్గేష్ ఓకే చెబుతారా? లేదా? అనేది తేలాల్సి ఉంటుంది. దుర్గేష్ రాజ‌మండ్రి రూర‌ల్‌ నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే ప్ర‌తి ఇంటికీ తిరుగుతున్నారు. దాదాపు టికెట్ నాదే అన్న‌త‌ర‌హాలో కందుల ప్ర‌చారం ఉంది. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా తెర‌మీదికి వ‌చ్చిన మార్పు.. ఎలాంటి పొలిటిక‌ల్ సీన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related posts

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?