Krishna Mukunda Murari జులై 10 ఎపిసోడ్: కృష్ణకి మురారి తన మనసులో ఉన్న ప్రేమను చెప్పాలని అనుకుంటాడు. నిన్ను చూస్తూ నా మనసులో మాట చెప్పలేకపోతున్నాను కృష్ణ అని మురారి అనగానే అయితే నేను కళ్ళు మూసుకుంటాను మీ మనసులో ఉన్న మాట ఏంటో చెప్పండి ఏసీబీ సార్ అని కృష్ణ కళ్ళు మూసుకుంటుంది కానీ ఎంతసేపటికి మురారి తన మనసులో మాట చెప్పడం ఏసిపి సర్ నా కళ్ళు నొప్పి పుడుతున్నాయి. మీరు చెప్పాలనుకున్నది ఏంటో చెప్పేసేయండి నేనేం మిమ్మల్ని కొట్టను తిట్టను అంటుంది. అంతలో అలేఖ్య వచ్చి మురారి బావ మిమ్మల్ని పెద్ద అత్తయ్య పిలుస్తున్నారు అని అనగానే.. ఇద్దరినీనా ఒక్కరినేనా అని అంటే మిమ్మల్ని ఒక్కడినే అనగానే మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కృష్ణ గీతిక ఏమైనా ముకుందతో తన ప్రేమ విషయం చెప్పిందేమోనని ఆ విషయం కనుక్కోవడం కోసం ముకుంద దగ్గరకు వెళుతుంది.
ముకుంద మురారి ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని చూస్తూ నీ ప్రేమను సొంతం చేసుకోవడానికి నేను ఎంతవరకైనా తెగిస్తాను మురారి అని తన మనసులో కృష్ణ ఉందని నాకు తెలిసిన తర్వాత నేను ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. మీ ఇద్దరిదీ అగ్రిమెంట్ మ్యారేజ్ అన్న విషయం పెద్ద అత్తయ్య కి చెప్పేసేయాలి. అప్పుడు నా చేతులకి మట్టి అంటకుండా నా పని అయిపోతుంది అంటూ వాళ్ళిద్దరూ ఉన్న ఫోటోని చూస్తూ మనసులో అనుకుంటుంది. అంతలో కృష్ణ వచ్చి తలుపు కొడుతుంది. ఆ ఫోటో తన చేతిలో నుంచి జారీ కింద పడిపోతుంది. ముకుందా ఆ ఫోటో తీయకుండా కృష్ణ చూస్తే చూడని ఈ ముసుగులో గుద్దులాటలన్నీ లేకుండా అసలు విషయం కృష్ణకి అర్థం అవుతుంది అని అనుకుంటుంది.
ఏంటి కృష్ణ ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నావని ముకుందా అడుగుతుంది. అరె ముకుందా నీకు కూడా ఫేస్ రీడింగ్ వచ్చు అని కృష్ణ అంటుంది. ఏంటి ఏదో ఫోటో చూస్తున్నావు ఆదర్శ్ తో పెళ్లి అయిన ఫోటోనా.. లేదంటే పెళ్లి కాక ముందు ఫోటోనా అంటూ ఆ ఫోటో కృష్ణ తీస్తుంది. కానీ తను చూడకుండా ముకుంద కి ఆ ఫోటో చూపిస్తూ తన చేతికి ఇస్తుంది. ఏంటి కృష్ణ వచ్చావు అని ముకుందా అడగగానే గీతిక ఏమైనా నీకు ఫోన్ చేసిందా అని కృష్ణ అడుగుతుంది. లేదే నాకేం ఫోన్ చేయలేదు అని ముకుందా అంటుంది పోనీ నిన్ను కలిసిందా అంటే లేదు కలవలేదు అని అంటుంది. ఎందుకు అడుగుతున్నావు అంటే తను వేసుకున్న డ్రెస్ బాగుంది. సో ఆ కలెక్షన్ కోసమని ఇటు వచ్చినప్పుడు రమ్మని చెప్పాను. అందుకే అడిగాను అని కృష్ణ ఏదో మాట అడ్డువేసి అక్కడ నుంచి పక్కకి వచ్చేస్తుంది. ముకుందా మాత్రం మనసులో ఈ క్రాకర్స్ ఇప్పుడప్పుడే పేల్చకూడదు కృష్ణ దీపావళి రోజున పేలిస్తేనే వాటికి అందం ఈ విషయాన్ని ఎప్పుడు ఎక్కడ చెప్పాలో ఎలా బ్లాస్ట్ చేయాలో నాకు తెలుసు అని ముకుందా మనసులో అనుకుంటుంది.
మురారి నేను ఇంట్లోకి రాగానే నీకు బ్లెస్సింగ్స్ ఇవ్వలేదని బాధపడ్డావా, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఒక బాధ్యత అప్ప చెప్తాను గుర్తుందా. ముకుందా వాళ్ళ నాన్న మాటలు నన్ను బాధించాయి. అందుకే వస్తూ వస్తూ ముకుంద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి మాట్లాడి వస్తున్నాను. ఆయన అన్న మాటలు నన్ను ఇప్పటికీ భాదిస్తున్నాయి. ఆదర్శ్ తప్పిపోతే ఇప్పటివరకు దొరకడా, తప్పిపోయిన వాడు దొరకాలని అనుకుంటే ఎప్పటికైనా దొరుకుతాడు. కానీ దొరకకూడదు అని అనుకుంటున్నాడేమో అని ఆయన అన్న మాటలు నన్ను ఆలోచింపచేసాయి. నిజంగానే అదేదో సామెత ప్రకారం కావాలనే ఆదర్శ్ మన కంట పడకుండా ఉంటున్నాడేమో అని భవాని మురారితో అంటుంది.
ఆదర్శ్ పెళ్లికాకముందు ఎవరినైనా ప్రేమించాడా అని మురారిని భవాని ప్రశ్నిస్తుంది. లేదు పెద్దమ్మ అలాంటిది ఏమీ లేదు అని మురారి చెబుతాడు. ఆదర్శ్ ప్రేమించలేదంటే ఒక ఎవరినైనా ముకుందా ప్రేమించి ఉండొచ్చు కదా.. ఆ విషయం ఆదర్శ్ కి తెలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఆదర్శ్ కి తనకు నచ్చిన వాళ్ళు తప్పు చేసినా కూడా తనని తాను శిక్షించుకుంటాడే తప్ప ఎదుటివారిని ఒక్క మాట కూడా అనడు. బహుశా ఇప్పుడు అదే జరిగిందేమో.. ముకుందా గతంలో ఎవరినైనా ప్రేమించిందో లేదో తెలుసుకొని చెప్పే బాధ్యత నీది. అలా చేస్తానని నాకు మాట ఇవ్వు అని మురారి దగ్గర నుంచి భవాని మాట తీసుకుంటుంది. గతంలో కూడా నాకు ఒకసారి మాట ఇచ్చి తప్పవు. కానీ ఇప్పుడు మాట తప్పితే మాత్రం జీవితంలో నేను నీతో మాట్లాడను మురారి అని భవాని గట్టిగా మురారిని హెచ్చరిస్తుంది.
మురారి వాళ్ళ పెద్దమ్మ అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కృష్ణ వచ్చి ఇందాక నాతో ఏదో చెప్పాలి అన్నారుగా అదేంటో చెప్పమని అడుగుతుంది. నువ్వు ఏదో చెప్తా అన్నావ్ గా అది ఏంటో చెప్పు అని అడుగుతాడు. నిజాలు తెలుసుకుందాము ఏసిపి సార్.. మా హాస్పిటల్ లో నా పేషంట్ సూసైడ్ చేసుకున్నాడు. తను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కొన్ని అనివార్య కారణాలవల్ల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరు వైపు ఉంటాడు. పెళ్లి చేసుకున్నా భార్యాతోనా లేదంటే ప్రేమించిన అమ్మాయి వైపున అని కృష్ణ అడుగుతుంది. మురారి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సైలెంట్ గా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు.
ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ నా మనసులో ఉన్న మాటని ఫామ్ హౌస్ లో నీకు చెప్పాలని అనుకున్నాను. కానీ అక్కడ కుదరలేదు. ఈ లైటింగ్ డెకరేషన్ చూసిన తర్వాత నా మనసులో ఉన్న మాట ఏంటో నీకు అర్థం అవుతుంది అంటూ.. లైటింగ్ తో లవ్ సింబల్ వేసి అందులో ఐ లవ్ యు అని రాసి కృష్ణ పేరు అంటించి ఉంటుంది. మురారి అలా డెకరేషన్ చేయడం ముకుందా చూస్తుంది. ఇక కృష్ణ ఆ డెకరేషన్ చూసి ఎలా ఫీల్ అవుతుంది.. ముకుందా మురారి మధ్య ఈ విషయంపై ఎలాంటి గొడవలు జరుగుతాయో తరువాయి భాగంలో చూద్దాం.