NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: విక్కీని నిలదీసిన పద్మావతికి నిజం తెలిసిందా.? విక్కి చెంప పగలగొట్టిన అరవింద..

Nuvvu Nenu Prema జులై 10 ఎపిసోడ్ 358: పద్మావతి ఇన్నాళ్లు నిన్ను పెంచినందుకు మాకు తగ్గ శిక్ష వేశావు అంటూ వాళ్ళ అమ్మానాన్నలు పద్మావతికి చివాట్లు పెడతారు. విక్కి నువ్వు కూడా ఎంట్రా ఇలా చేసావు అంటూ అరవింద నిలదీస్తుంది. ఏంటి అక్క మీరే కదా పెళ్లి చేసుకోమని ప్రతి రోజూ విసిగిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు పెళ్లి చేసుకొని వస్తే మీరే నన్ను తిడుతున్నారు అంటూ విక్కి తన అక్కను నిలదీస్తాడు. ఇలా చేసినందుకు మీకేం తప్పుగా అనిపించడం లేదా అని అరవింద ప్రశ్నించగా లేదు. అని విక్కీ సూటిగా సమాధానం చెబుతాడు. కనీసం అమ్మలా చూసుకునే నాకైనా ఈ విషయం నాకు చెప్పాలనిపించలేదా అని అడగగానే.. నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఈ పని చేశాను అక్క అని విక్కీ మనసులో అనుకుంటాడు. విక్కి నిన్నే నాక్కూడా చెప్పాలనిపించలేదా అని అరవింద కోపంగా ప్రశ్నించగానే.. లేదు అక్క అని విక్కీ అంటాడు. ఆ మాటకి కోపం వచ్చిన అరవింద విక్కీ చంప పగలగొడుతుంది. అమ్మ కనుక బ్రతికి ఉంటే నువ్వు చేసిన పనికి ఇంకా కొట్టి ఉండేది అని అరవింద పెద్దగా అరుస్తుంది.

Nuvvu Neenu Prema 10 July 2023 Today Episode 358 Highlights
Nuvvu Neenu Prema 10 July 2023 Today Episode 358 Highlights

రోజు వీక్కికి గోరుముద్దలు తినిపించే అరవింద చేత ఈరోజు విక్కిని కొట్టేలా చేశారు. అందుకే ముందు నుంచి నేను ఈ సంబంధం వద్దు వద్దు అంటున్నాను. ఒక్కరైనా నా మాట విన్నారా అంటూ కుచల ఇంకొంచెం ఆజ్యం పోస్తుంది. ఇప్పుడు చూడండి ఈ గతి లేని వాళ్ళ వల్ల మనకి మనమే దూరం అవ్వాల్సి వస్తుంది. కుచల కొంచెం నోరు మూసుకొని ఉంటావా.. అసలే ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే నువ్వు అగ్నికి ఆద్యం పోస్తున్నావా అంటూ తన భర్త తనకి చివాట్లు పెడతాడు. నలుగురిలో మా అందరి పరువు నిలబెట్టాలి అనుకునే నువ్వు ఈరోజు ఎందుకు విక్కి ఇలా చేసావు అని వాళ్ళ బాబాయ్ విక్కిని ప్రశ్నిస్తాడు. ఆర్య పెళ్లి తో పాటు నా పెళ్లి కూడా మీరందరూ చూడాలనుకున్నారు. అందుకే ఇలా చేశాను చాలా అంటూ విక్కి కోపంగా సమాధానం చెబుతాడు.

Nuvvu Neenu Prema 10 July 2023 Today Episode 358 Highlights
Nuvvu Neenu Prema 10 July 2023 Today Episode 358 Highlights

రేయ్ నువ్వు ఏం చేసినా అందులో ఒక కారణం ఉంటుంది ఇప్పుడు పద్మావతిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి.. అదైనా చెప్పు విక్కి అని అరవింద విక్కిని నిలదీస్తుంది. ఈ ఇంట్లో నీ మాటకు ఎవరూ ఎదురు చెప్పరని నువ్వు ఇలా చేసావా అంటూ వాళ్ళ పెద్దమ్మ కూడా విక్కీని నిలదీస్తుంది. లేదు విక్కి నువ్వు ఎందుకు ఇలా చేసావో మా అందరికీ చెప్పి తీరాలి అని సూటిగా తనని ప్రశ్నిస్తుంది. అనవసరమైన విషయాలు నేను ఎక్కువగా మాట్లాడను అంటూ తన చేతిలో ఉన్న దండ విసిరేసి ముందుకు వెళ్తాడు. ఇక తన బావ కనిపించగానే కోపంగా తన వైపు చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. విక్కీ ఆగు అంటూ వాళ్ళ అక్క పెద్దమ్మ పిలుస్తారు కానీ ఆగకుండా విక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

విక్కీ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అరవింద తన గదికి వెళ్లి ఏం జరిగిందో చెప్పమని విక్కిని అడుగుతుంది. నాకు కూడా ఎందుకు చెప్పడం లేదు అంటూ విక్కీని అడుగుతుంది. ఇక ఆర్య అరవింద్ ని కంట్రోల్ చేసి పక్కకు తీసుకు వస్తాడు.

Nuvvu Neenu Prema 10 July 2023 Today Episode 358 Highlights
Nuvvu Neenu Prema 10 July 2023 Today Episode 358 Highlights

మరోవైపు మండపంలో ఉన్న పద్మావతిని ప్రతి ఒక్కరూ అసలు ఈ పెళ్లి ఎందుకు జరిగిందో చెప్పమని నిలదీస్తారు. కావాలనే పద్మావతి వాళ్లు ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని ఆస్తి కోసమే ఇదంతా చేశారంటూ కుచ్చుల వాళ్ళని నిందిస్తుంది. ముందు పద్మావతి మన ఇంట్లో వాళ్ళందరికీ దగ్గరయి ఆ తర్వాత రంగంలోకి అనుని దింపింది. అలా అనుకున్నట్టు ఆర్య అనుల పెళ్లి అవ్వగానే వెంటనే పద్మావతి వికీపీని పెళ్లి చేసుకుని వచ్చింది అంటూ కుచల చెబుతుంది. అసలు మీకు మా కాంపౌండ్ లో అడుగుపెట్టే అర్హత కూడా లేదంటూ కుచల అంటుంది. అలాంటి మాటలు మాట్లాడొద్దు అంటూ పద్మావతి వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. నేను నీకు ముందు నుంచి చెబుతున్నానా విక్కికి దూరంగా ఉండమని చెప్పనా లేదా అంటూ కుచల పద్మావతిని నిలదీస్తుంది. చెప్పారు అని పద్మావతి అంటుంది. విన్నారా.. అంతా విన్నారా అయినా ఈ తప్పు జరిగిందంటే దీనికి బాధ్యులు ఎవరు..

Nuvvu Neenu Prema 10 July 2023 Today Episode 358 Highlights and Written Update
Nuvvu Neenu Prema 10 July 2023 Today Episode 358 Highlights and Written Update

నేనా, మా విక్కినా , మా ఇంట్లో వాళ్ళ ఎవ్వరూ కాదు ముమ్మాటికీ మీరే అని అంటుంది. నీ ప్రమేయం లేకుండా గొప్పదైన మా విక్కిని పద్మావతి ఎలా పెళ్లి చేసుకుంటుంది అని పద్మావతి వాళ్ళ పేరెంట్స్ ని కూడా తప్పు పడుతుంది. మా వాడి కాలి గోటికి కూడా సరిపోరు. మనం మంచి వాళ్ళం కాబట్టి వీళ్ళు మంచిగా మాట్లాడిన మాటలన్నీ నమ్ము ఇప్పుడు మనల్ని కరిగించడానికి కన్నీటితో ఆడుతున్న డ్రామా ఇది అంటూ.. కుచల తన భర్త అడ్డు చెబుతున్నా కానీ తన మనసులో ఉన్న వేదనను మొత్తం బయటకి వెళ్లగక్కుతుంది.

Nuvvu Neenu Prema 10 July 2023 Today Episode 358 Highlights
Nuvvu Neenu Prema 10 July 2023 Today Episode 358 Highlights

పద్మావతి వాళ్ల పేరెంట్స్ అను నీ అత్తారింటికి పంపించి మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతారు. అను వాళ్ళ నాన్న ఆర్య దగ్గరకు వెళ్లి నా కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇక నుంచి తన బాధ్యత మీదే అని ఆర్య కు అనును అప్పగిస్తాడు వాళ్ళ నాన్న..ఇక రేపటి ఎపిసోడ్ లో పద్మావతి విక్కి దగ్గరకు వెళ్లి అసలు నన్ను బెదిరించి ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నారు అసలు ఏం జరిగిందో నాకైనా చెప్పమని పద్మావతి విక్కిని నిలదీస్తుంది. చెప్పాలా అంటూ.. విక్కి పద్మావతి నీ గోడ దగ్గర నిలబెట్టి అసలు ఏం జరిగిందో చెప్తాడా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం.

Check Nuvvu Nenu Prema Previous Episode Here

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri