నాగబాబు గారాలపట్టి నిహారిక, చైతన్య ల వివాహం ఉదయపూర్ లో అంగరంగ వైభవంగా జరిగింది..! ఈ వివాహ వేడుకలో మెగా ఫ్యామిలీ లో అందరూ పాల్గొన్నారు.. అటు వరుడు చైతన్య కుటుంబ సభ్యులు, సన్నిహితులు పెళ్లి లో పాల్గొని సందడి చేశారు.. తెలుగు సంప్రదాయం ప్రకారం ఘనంగా ఆమె వివాహం జరిగింది.. తాజాగా జొన్నలగడ్డ కోడలు గరిటె తిప్పుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
పెళ్లి తర్వాత నిహారిక అత్తారింట్లో అడుగుపెట్టింది.ఈ సందర్భంగా మెట్టినింట్లో నవవధువు నిహారిక గరిట తిప్పింది..ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండే నిహారిక అదే స్మైల్ తో తన భర్త, మావయ్య తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది..
నిహారిక అంటే మెగా హీరోలందరికీ చాలా ఇష్టమట. అందుకే, తనకు ఖరీదైన బహుమతులు అందజేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి..!చిరంజీవి తన కుమార్తెకు ఏకంగా రూ.2 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ కూడా నిహారిక కు కు జీవితాంతం గుర్తుండిపోయేలా అందజేసిన బహుమతులు విలువ రూ.5 కోట్ల పైమాటే నని సినీ వర్గాలంటున్నాయి..