NewsOrbit
న్యూస్

జ్ఞానోదయం అయ్యిందా… కాంగ్రెస్ మళ్లీ ఆ తప్పు చేయడం లేదు!

భారతదేశం గర్వించదగ్గ ప్రధానుల్లో.. తనమార్కు పాలనను అందించిన ప్రధానుల్లో.. విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ప్రధానుల్లో పీవీ నరసింహరావు ఒకరు! కాంగ్రెస్ పార్టీకి తనమార్కు వైభవాన్ని యాడ్ చేసిన పనితనం ఆయన సొంతం. కానీ…కాంగ్రెస్ పార్టీలో ఉండే ఉపయోగంలేని కొన్ని ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల మరణానంతరం అయినా పీవీని ఆ పార్టీ ఓన్ చేసుకోవడంలో పరిపూర్ణంగా విఫలమయ్యిందనే అనుకోవాలి! అయితే ఆ తప్పు వైఎస్సార్ విషయంలో జరగకుండా చూసుకుంటుంది నేడు!

నిజంగా పీవీ నరసింహరావుని సొంతం చేసుకోవడంలో.. మా పార్టీ నేత అని చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా విఫలమవడంతో… తెరాస ఆ పని పూర్తిచేసుకుంది. మాజీ ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని నాటి కాంగ్రెస్ వదిలేసుకున్నా… తెలంగాణ సెంటిమెంట్ పేరుచెప్పో, ఓటు బ్యాంకు రాజకీయంలో భాగంగానో కానీ… కేసీఆర్ ఆ పని చక్కగా పూర్తిచేస్తున్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించడం.. భారతరత్న డిమాండ్ చేయడం వంటివి ఇందులో భాగాలు. దాంతో పీవీ నరసింహారావు.. తెలంగాణ మనిషి అయిపోయారు తప్ప కాంగ్రెస్ పార్టీ మనిషి కాలేకపోయారు. అది పూర్తిగా కాంగ్రెస్ స్వయంకృతాపరాధం!

తగిలిన దెబ్బలు, తగులుతున్న దెబ్బలు నేర్పిన పాఠాల్లో లేక అవసరాలు సృష్టించిన అవకాశాలో తెలియదు కానీ తాజాగా వైఎస్సార్ ను పూర్తిగా ఓన్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా తాజాగా… వైఎస్ జయంతి సందర్భంగా పంజాగుట్టలో ఆయన విగ్రహానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య తదితరులు నివాళులర్పించారు. అనంతరం… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మోస్ట్ పాపులర్ లీడర్ వైఎస్సార్ అని కొనియాడారు. వైస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాలు భారతదేశ వ్యాప్తంగా పాలకులందరూ పాటిస్తున్నారని.. వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని.. రైతులకు, యువతకు, విద్యార్థులకు, మహిళలకు, వైఎస్ రాజశేఖరెడ్డి ఒక ల్యాండ్ మార్క్‌ ని క్రియేట్ చేశారని కొనియాడారు.

దీంతో… ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందేమో కాంగ్రెస్ నేతలు అని కామెంట్లు పడుతున్నాయి. ఎందుకంటే… ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనిషి. కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు. అలాంటి వ్యక్తిని సొంతం చేసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు ప్రదర్శించి ఉండాల్సింది. ఢిల్లీ స్థాయిలో కూడా సోనియా, రాజీవ్ లాంటి వారు సైతం ఆయను ఇవ్వాల్సిన స్థాయిలో నివాళులు అర్పించి ఉంటే.. మరింత బాగుండేది! ఏమోలే… ప్రస్తుతానికి రాష్ట్రస్థాయి నేతలు కళ్లు తెరిచారు.. మరి ఢిల్లీ పెద్దలు ఎప్పుడు తెరుస్తారో! ఎంత తెరిచినా ఏపీలో ఛాన్స్ లేదు కానీ… తెలంగాణకి ఏమైనా ఉపయోగపడుతుందేమో చూసుకోవాలనే కామెంట్లు ఈ సందర్భంగా బలంగా వినిపిస్తున్నాయి!

Related posts

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?