NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

అలోక్ వర్మపై కేంద్రం గురి?

ఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) డైరెక్టర్ అలోక్ వర్మపై శాఖాపరమైన విచారణ జరిగే అవకాశం ఉంది. సిబిఐ డైరక్టర్‌ పదవి నుంచి ఆయనను హైపవర్ కమిటీ తొలగించిన తర్వాత ప్రభుత్వం వర్మను అగ్నిమాపక శాఖ డిజిగా బదిలీ చేసింది. ఆయిన అక్కడ బాధ్యతలు చేపట్టకుండా తనను రిటైర్ అయినట్లు పరిగణించాల్సిందిగా కోరారు. జనవరి 31వ తేదీన ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా పదవ తేదీన తన సర్వీసుకు రాజీనామా చేశారు.

సిబిఐ డైరక్టర్ పదవిలో ఉన్నపుడు మాత్రమే తనకు సర్వీసు జనవరి 31 వరకూ ఉంటుందనీ, లేని పక్షంలో తాను ఎప్పుడో రిటైర్ అయిఉండేవాడినన్నది వర్మ వాదన. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆయన రాజీనామాను ఆమోదించలేదు. చివరి రోజైన జనవరి 31వ తేదీన అగ్నిమాపక శాఖలో  బాధ్యతలు చేపట్టి పదవీ విరమణ చేయాలని సూచించింది. ఉన్నతాధికారుల ఉత్తర్వులను ధిక్కరించినందుకు గాను ఆయన పదవీ విరమణ ప్రయోజనాలను నిలుపుదల చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాల మధ్య వివాదం నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఇద్దరు అధికారులను బలవంతపు సెలవులపై పంపింది. తాత్కాలిక డైరెక్టర్‌‌గా ఎం నాగేశ్వరరావును నియమించింది.

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులతో అలోక్ వర్మ జనవరి ఎనిమిదవ తేదీ తిరిగి సిబిఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

అలోక్ వర్మ తిరిగి బాధ్యతలు స్వీకరించిన 24గంటల వ్యవధిలోనే ప్రధాని నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమావేశం అయి ఆయనపై పలు అభియోగాలు ఉన్నాయని పేర్కొంటూ సిబిఐ డైరెక్టర్ పదవి నుండి తప్పించారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.

నాడు అలోక్ వర్మను డైరెక్టర్ పదవి నుండి తొలగించే అంశంపై కమిటీలో సభ్యుడైన ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆనాటి సమావేశానికి సిజెఐ బదులు  సభ్యుడుగా హజరైన సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎ.కె. సిక్రి ప్రధాని మోది నిర్ణయాన్ని సమర్థించడంతో 2:1 మెజార్టీతో నిర్ణయాన్ని తీసుకున్నారు.

అగ్నిమాపక శాఖకు బదిలీ అయిన అలోక్ వర్మ ‌అక్కడ బాధ్యతలు చేపట్టకుండా రాజీనామా చేయడంపై కేంద్రం ఆయనపై శాఖపరమైన చర్యలకు ఉపక్రమిస్తోంది.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Leave a Comment