NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ..! తెలంగాణలో కొత్త పార్టీ షురూ..!!

 

తెలంగాణ ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నారుట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపిలో మంచి వాగ్దాటి ఉన్న నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి రాష్ట్ర విభజన తరువాత ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లడం, అనంతరం పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

revanth reddy

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన సొంత నియోజకవర్గంలో కొడంగల్లు నియోజకవర్గంలో పరాజయం పాలైనా తదుపరి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటీ చేసి విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కెసిఆర్ పై దూకుడుగా వెళుతున్న రేవంత్ రెడ్డికి ప్రస్తుతం కాంగ్రెస్ పాార్టీలోనే సహాయ సహకారాలు కొరవడ్డాయి అంటున్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి గౌరవించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి దక్కితే పార్టీలో కొనసాగాలనీ లేకపోతే ప్రాంతీయ పార్టీ పెట్టి ముందుకు సాగాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ముందు నుండి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలైన వి హనుమంతరావు, జగ్గారెడ్డి వంటి నాయకులు బహిరంగంగానే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మరో పక్క పిసిసి అధ్యక్ష పదవి రేసులో రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొమటిరెడ్డి రాజగోపాలరెడ్డి లు ఉన్నారు.

వారి ప్రయత్నాల్లో వారూ ఉన్నారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి దక్కకుండా ఉండటానికి ఈ నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వారి అనుకూల వర్గం కూడా ఉంది. అయితే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన అనుచరులకూ సరైన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో భాాగంగా ప్రాంతీయ పార్టీ పెడితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నదానిపై ఆయన కసరత్తు చేస్తున్నారనీ, మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయనకు మద్దతుగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుకునేందుకు ఇప్పటికే రేవంత్ రెడ్డి 15 మంది బృందంతో ఇటీవల సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో సర్వే జరగకపోయినా సర్వే చేసిన మేరకు దక్షిణ తెలంగాణ నుండి రేవంత్ రెడ్డికి సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఉత్తర తెలంగాణ నుండి పెద్దగా మద్దతు లభించలేదని తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నల్లగొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాలలో రేవంత్ రెడ్డికి అనుకూల వాతావరణం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో సారి విస్తృత స్థాయి నిర్వహించాలనీ, పిసిసి పదవి ఇస్తే కొనసాగడం లేకపోతే ప్రాంతీయ పార్టీ ద్వారా ముందుకు సాగాలని యోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంపై రేవంత్ రెడ్డి బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఏమి జరగనుందో వేచి చూడాలి.

Related posts

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

sharma somaraju

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!