NewsOrbit
న్యూస్ హెల్త్

విటమిన్ డి కోసం అన్నీ తినేస్తున్నారా? అది ఎక్కువైనా ప్రమాదమే.. సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే..!

side effects of too much vitamin D in body

విటమిన్ డి.. కరోనా కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అవును.. కరోనా సోకకుండా ఉండాలంటే మనిషి శరీరంలో తగినంత విటమిన్ డి ఉండాలి. విటమిన్ డి సరిపోయేంత ఉంటే.. రోగ నిరోదక శక్తి పెరిగి కరోనా వైరస్ దరిచేరకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.

side effects of too much vitamin D in body
side effects of too much vitamin D in body

ఏ విటమిన్ కూడా మనకు ఉచితంగా దొరకదు కానీ.. ఒక్క డి విటమిన్ మాత్రం ఉచితంగా దొరుకుతుంది. ఉదయం పూట కాసేపు ఎండలో నిలబడితే చాలు.. ఆరోజుకు కావాల్సినంత విటమిన్ డి శరీరానికి అందుతుంది.

అంతే కాదు.. పలు రకాల ఆహార పదార్థాల్లోనూ విటమిన్ డి ఉంటుంది. చేపలు, గుడ్లు, మాంసం, పాలు, పుట్టగొడుగులు లాంటి వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

అయితే… ఈ విటమిన్ డి శరీరానికి ఎంత కావాలో అంతే ఉండాలి. అంతకంటే ఎక్కువైందనుకోండి లేనిపోని రోగాలను మనమే కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది.

విటమిన్ డి తక్కువున్నా ప్రమాదమే.. ఎక్కువ అయినా ప్రమాదమే. ఒకవేళ విటమిన్ డి ఎక్కువైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం రండి..

కిడ్నీ సమస్యలు

విటమిన్ డి మోతాదు మించితే కిడ్నీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. కిడ్నీల్లో వచ్చే పలు వ్యాధులు విటమిన్ డి ఎక్కువవడం వల్లనే. ఒకవేళ కిడ్నీ సమస్యలు ముందే ఉంటే.. డాక్టర్ సలహాతోనే విటమిన్ డి సప్లిమెంట్స్ ను వాడాలి.

జీర్ణ సంబంధ సమస్యలు

మానవ శరీరంలో విటమిన్ డి ఎక్కువయిందంటే.. కడుపునొప్పి వస్తుంది. దానితో పాటు మలబద్ధకం సమస్య వస్తుంది. వీటి వల్ల జీర్ణ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణమవకపోవడం లాంటి సమస్యలు వస్తాయి.

హైపర్ కాల్సేమియా

నిజానికి విటమిన్ డి ఎక్కువైతే శరీరంలో కాల్షియం లేవల్స్ కూడా పెరుగుతాయి. దాన్నే హైపర్ కాల్సేమియా అంటారు. కాల్షియం ఎక్కువ అవడం వల్ల ఆకలి తగ్గి మలబద్ధకం సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీని వల్ల అధిక రక్తపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

వాంతులు

విటమిన్ డి ఎక్కువైతే కాల్షియం ఎక్కువవుతుందని తెలుసుకున్నాం కదా. శరీరంలో ఉండే అధిక కాల్షియం వల్ల వాంతులు, వికారంగా అనిపించడం, ఆకలి మందగించడం లాంటి సమస్యలు వస్తాయి. ఎప్పుడూ వాంతి చేసుకున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది.

ఎముకలు వీక్ అవడం

మన శరీరంలో ఎముకల పాత్ర ఎంతో ముఖ్యమైనది. అవి దృఢంగా ఉంటేనే మనిషి దృఢంగా ఉంటాడు. అయితే విటమిన్ డి సరిపోయేంత ఉంటేనే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఒకవేళ విటమిన్ డి ఎక్కువైతే కూడా ఎముకలు బలహీనపడతాయి. అందుకే ఎముకలు గట్టిగా, ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సినంత విటమిన్ డిని మాత్రమే తీసుకోవాలి.

Related posts

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju