అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్ధం సినిమా ప్రస్తుతం రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమా ప్రకటించాలనుకుంటున్న అనుష్క కి అలా నెలలు గడిచిపోతున్నాయి. ఎట్టకేలకి ఈ సినిమా త్వరలో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ ఈ సినిమాని నిర్మించాడు. మాధవన్, అంజలి, శాలిని పాండే ముఖ్య పాత్రలు పోషించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు.
అనుష్క పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంటరైన సంగతి తెలిసిందే. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇక కెరీర్ లో ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. నాగార్జున, రవితేజ, మహేష్ బాబు, ప్రభాస్, గోపి చంద్, అల్లు అర్జున్, జగపతి బాబు, బాల కృష్ణ ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల తో పాటు, మంచు విష్ణు, సుమంత్ చిన్న హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అనుష్క.
తెలుగుతో పాటు తమిళంలో కూడా రజినీకాంత్, సూర్య, అజిత్, కార్తీ, ఆర్య వంటి స్టార్స్ తో సూపర్ హిట్ సినిమాలలో నటించి కోలీవుడ్ లోను స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ని సాధించింది. ఇక అరుంధతి సినిమాతో కొత్త ఇమేజ్ ని దక్కించుకొని లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. సినీ పరిశ్రమలో అందరిచేత గౌరవించబడే అనుష్కకు కూడా కెరీర్ బిగినింగ్ లో వేధింపులు తప్పలేదని గతంలో వార్తలు వచ్చాయి. కాగా అనుష్క క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇండస్ట్రీకొచ్చి ఇన్నేళ్ళు అయినా నాకు ఇప్పటి వరకు అలాంటి అనుభవాలు ఎదరవలేదని .. నేను ముక్కుసూటిగా ఉంటాను కాబట్టే నన్ను ఆ విషయంలో ఎవరూ ఇబ్బంది పెట్టలేదని తెలిపింది. ఇక పరిశ్రమలోనే కాదు క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడైనా ఉందన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. అమాయకంగా ఉన్న కొందరు దీనికి బలైపోతున్నారని అనుష్క అన్నారు. ఎక్కడికెళ్ళిన మన జాగ్రత్తలో మనం ఉండాలి. తప్పు అనేది ఒకవైపు నుంచే జరగదని తెలిపింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!