సాధారణంగా మనలో అధిక శాతం మందికి ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తుంటాయి. కొందరికి బస్సుల్లో ప్రయాణం చేస్తే వాంతులు అవుతాయి. కొందరు కార్లలో ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అయితే నిజానికి ఇది అత్యంత సహజమైన విషయమే. ఇందుకు గాభరా పడాల్సిన అవసరం లేదు. కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే.. ప్రయాణాల్లో అయ్యే వాంతులను నివారించవచ్చు. వాంతులు కాకుండా చూసుకోవచ్చు.
* ప్రయాణానికి ముందే చిన్న అల్లం ముక్కను నోట్లో వేసి చప్పరిస్తుండాలి. ప్రయాణం అయ్యే వరకు దాన్ని అలాగే నోట్లో ఉంచాలి. దీంతో వాంతికి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
* ప్రయాణంలో ఉన్నప్పుడు సోంపు లేదా వక్కపొడి వేసుకోవడం వల్ల కూడా వాంతులు కాకుండా చూసుకోవచ్చు.
* నిమ్మకాయను కట్ చేసి దాన్ని ముక్కు వద్ద పెట్టుకుని వాసన చూస్తుంటే వాంతికి రాకుండా ఉంటుంది. వికారం తగ్గుతుంది.
* ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని చప్పరించాలి. ప్రయాణం ఆసాంతం అలా చేయాలి. దీంతో వాంతులు కాకుండా ఉంటాయి.
* వాహనాల్లో వీలైనంత వరకు ముందు సీట్లలో కూర్చోవాలి. అలాగే పక్కన ఉండే కిటికీల్లోంచి బయటకు చూడకూడదు. నేరుగా చూడాలి. దీని వల్ల కూడా వాంతులు రాకుండా ఉంటాయి.