ప్రస్తుత కాలంలో చాలామంది నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగిస్తున్నారు. ఇక వేలకు వేలు పోసి నాన్‌స్టిక్ పాత్రలను తీసుకుంటున్నారు. ఇందులో అయితే తమ కి వంట చేయడం సులువు అవుతుందని భావించి ప్రతి ఒక్కరు దీనిని కొనుగోలు చేస్తున్నారు. కానీ ఈ నాన్ స్టిక్ పాత్రలు ఎక్కువ కాలం పని చేయడం లేదు.
కొన్ని టిప్స్ పాటిస్తే నాన్ స్టిక్ పాత్రలు ఎక్కువ కాలం మందుతాయి. నాన్ స్టిక్ పాత్రలను సన్నటి మంట మీద మాత్రమే ఉంచాలి. లేదంటే టెప్లాన్ కోటింగ్ పోతుంది. నాన్ స్టిక్ పాత్రలను స్టవ్ మీద పెట్టిన వెంటనే ఆయిల్ పోయాలి. పాత్రకు అంటుకునే వంటలను మాత్రమే నాన్ స్టిక్ పాత్రల మీద చేయాలి. నాన్ స్టిక్ పాత్రలలో వంట చేస్తున్నప్పుడు ప్లాస్టిక్, చెక్క చెంచాలను మాత్రమే ఉపయోగించాలి.
నాన్ స్టిక్ పాత్రలను గట్టి పీచుతో తోమరాదు. అలా చేయడం వల్ల ఆ పాత్ర పూర్తిగా పోతుంది. ఎంత డబ్బు పోసి కొన్నప్పటికీ సరైన విధంగా వాటిని చూసుకోకపోతే తొందరగా పోతాయి. అందువల్ల నాన్ స్టిక్ పెనాలను పైన చెప్పిన విధంగానే ఉపయోగించండి. లేదంటే మీరు కొన్న నాన్ స్టిక్ పాత్రలు ఒక వారంలోనే అటకెక్కుతాయి. ప్రతిరోజు పైన చెప్పిన విధంగా మీ పాత్రలను క్లీన్ చేస్తూ ఉండండి. తద్వారా ఎన్ని రోజులు అయినా మీ నాన్ స్టిక్ పాత్రలు పోవు.