NewsOrbit
న్యూస్

ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్..! అప్లై చేస్తారా..?

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ సీహెచ్‌ఎస్‌ఎల్ (CHSL) 2020 ప్రకటన విడుదల చేశారు.ఇంటర్‌ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో సుస్థిరమైన కెరియర్‌ నిర్మించుకోవచ్చు. ఎస్‌ఎస్‌సీ ప్రతిసంవత్సరం నిర్వహించే పరీక్షల్లో సీహెచ్‌ఎస్‌ఎల్‌ ఒకటి. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర సంస్థల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించడానికి అవసరమైన నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.మూడు దశల్లో నిర్వహించే ఈ పరీక్షలో ప్రతిభ చూపిస్తే ఎల్‌డీసీ, పోస్టల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ హోదాలతో ఉద్యోగ విధులు నిర్వర్తించవచ్చు.

 

 

పరీక్షా ఇలా :
ఈ పరీక్షను దశల్లో నిర్వహిస్తారు. టైర్-1, టైర్-2, టైర్-3. మొదటగా టైర్-1 లో అర్హత సాధించిన వారికే మిగతా రెండు దశలకు పరీక్షా రాయడానికి అర్హులు. ముందుగా టైర్‌-1 పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ పేపర్, టైర్‌-3 స్కిల్‌ టెస్టు/ టైపింగ్‌ టెస్టు. తుది నియామకాలు మాత్రం టైర్‌ 1, 2ల్లో చూపిన ప్రతిభ ఆధారంగా తీసుకుంటారు.టైర్‌ 2 అర్హత కోసం 33 శాతం మార్కులు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. టైర్‌ 3లో అర్హత సాధిస్తే సరిపోతుంది.
టైర్-1 :
ఇందులో వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి.ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.200 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి ఒక గంట.ఈ పరీక్షలో 4 భాగాలూ ఉంటాయి. జనరల్‌ అవేర్‌నెస్‌ 25, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 25,
జనరల్‌ ఇంగ్లీష్ 25, జనరల్‌ ఇంటలిజెన్స్‌ 25 లో ప్రశ్నలు ఇస్తారు. ఒక్క ఇంగ్లీష్ తప్ప మిగతా వన్నీ ఇంగ్లీష్, హిందీ మాధ్యమాలలో ఇస్తారు.
టైర్-2 :
ఇది డిస్క్రిప్టివ్ పరీక్షా. 100మార్కులకు నిర్వహిస్తారు. 2ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో అర్హతకు కనీసం 33 శాతం మార్కులు ఖచ్చితంగా రావాలి. ఇచ్చిన అంశంలో వ్యాసాన్ని 200-250 పదాల్లో రాయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉత్తరం లేదా దరఖాస్తును 150-200 పదాల్లో పూర్తిచేయాలి.
టైర్-3 :
అభ్యర్థి ఎంచుకున్న పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ / టైప్ టెస్ట్ నిర్వహిస్తారు.
లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు స్కిల్‌ టెస్టు నిర్వహిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు టైపింగ్‌ టెస్టు ఉంటుంది. ఈ పరీక్షల్లో అర్హత సాధిస్తే సరిపోతుంది. డేటా ఎంట్రీ పోస్టులకు టైపింగ్‌లో భాగంగా కంప్యూటర్‌పై 15 నిమిషాలకు 2000 నుంచి 2200 కీ డిప్రెషన్స్‌ ఇవ్వాలి. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ విభాగంలోని పోస్టులకైతే 15 నిమిషాలకు 3700-4000 కీ డిప్రెషన్స్‌ తప్పనిసరి.
ఆంగ్లం అయితే నిమిషానికి 35, హిందీ 30 పదాల చొప్పున టైప్‌ చేయాలి. పది నిమిషాల వ్యవధితో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆంగ్లంలో అయితే 1750, హిందీలో 1500 కీ డిప్రెషన్స్‌ ఇవ్వగలగాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు వీటిని చెన్నైలో నిర్వహిస్తారు.
వయస్సు :
జనవరి 1, 2021 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయసులో గరిష్ఠ సడలింపులు వర్తిస్తాయి.
అర్హతలు :
ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.
పే స్కేల్ :
  • లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జేఎస్‌ఏ) పోస్టుల్లో చేరినవారికి లెవెల్‌ 2 ప్రకారం రూ.19,900 మూలవేతనం ఇస్తారు.
  • పోస్టల్‌ అసిస్టెంట్‌ / సార్టింగ్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలకు ఎంపికైనవారికి లెవెల్‌ 4 ప్రకారం రూ.25,500 మూలవేతనం చెల్లిస్తారు.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు మాత్రం లెవెల్‌ 5 మూలవేతనం రూ.29,200 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
వెబ్ సైట్: https://ssc.nic.in/
చివరి తేదీ:డిసెంబరు 15, 2020.

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju