NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఆ దుకాణంలో చాయ్ ఖరీదు తెలిస్తే బెదిరిపోతారు… ఎందుకో తెలుసా?

చాయ్ (టీ) ఈ పేరు విన‌ని వారు ప్ర‌ప‌పంచంలో లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఎందుకంటే టీ కి ఉన్న ప్రత్యేక‌త అలాంటిది మ‌రి. మ‌రీ ముఖ్యంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌మ‌నిస్తే.. చాలా ర‌కాల చాయ్ (టీ)లు అందుబాటులో ఉన్నాయ‌నే సంగ‌తి మాములే. ఒక‌ దేశంలో.. వేరు ప్రాంతాల్లో వేరు వేరు టీలు కూడా ఉండొచ్చు. కానీ ఓ షాప్‌లో మాత్రం వంద‌కు పైగా ర‌కాల చాయ్‌లు అందుబాటులో ఉన్నాయంటే.. టీ తాగే వారికి పండ‌గే అని చెప్పుకొవ‌చ్చు. ఎందుకంటే అక్క‌డ త‌మ‌కు ఎలాంటి టీ కావాలో దొరుకుతుంది కాబ‌ట్టి.

అలాంటి అనేక ర‌కాల టీల‌ను త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తూ.. ప్ర‌త్యేకంగా నిలుస్తున్న ఆ షాప్ కోల్‌క‌తాలో ఉంది. అదే నీర్జాస్ టీ దుకాణం. అందులో వంద‌కు పైగా ర‌క‌ర‌కాల చాయ్‌లు అందుబాటులో ఉంటాయి. ఇది మాములు విష‌యంగా అనిపించినా ప్ర‌త్యేక‌మైన, ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఇంకొక్క‌టి ఉంది. అదేంటంటే.. సాధార‌ణంగా చాయ్ (టీ) ఖ‌రీదు రూ.5, రూ, 10, 20 వుంటుంది. మ‌రీ స్పెషల్ టీ అయితే రూ.100 వ‌ర‌కూ ఉండొచ్చు. కానీ కోల్‌క‌తాలోని నిర్జాస్ టీ దుకాణంలో చాయ్ ఖ‌రీదు గురించి తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.

ఆ టీ దుకాణంలో చాయ్ ఖ‌రీదు ఒక వేయి రూపాయ‌లు. నిజ‌మే మీరు చ‌దివింది. ఆ చాయ్ ధ‌ర రూ.1000. అంత స్పెష‌ల్ ఏముటుంది? అనే ప్ర‌శ్న మీకు వ‌చ్చే ఉంటుంది. దాని ప్ర‌త్యేక‌త అలాంటిది మ‌రి ! ఆ టీయే “మ‌స్క‌టెల్ చాయ్‌”. దీనిని వినియోగ‌దారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్ర‌త్యేకంగా త‌యారు చేస్తామ‌ని ఆ టీ దుకాణం య‌జ‌మాని పార్థ గుంగూలీ చెప్పాడు. దీని త‌యారీలో ఖ‌రీదైన‌, మేలైన టీ పొడిని ఉప‌యోగిస్తామ‌ని తెలిపారు. ఈ టీ తాగ‌డానికి దేశంలోని అన్ని ప్రాంతాల వారు ప్ర‌త్యేకంగా వ‌స్తారంటే దానికి ఉన్న క్రేజ్ గురించి ఇంకా చెప్పాల్సిన ప‌నిలేద‌నుకుంటా..!

అయితే, ఈ నీర్జాస్ టీ దుకాణం పెట్ట‌క‌ముందు తాను ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేశాన‌ని పార్థ గంగులీ చెప్పారు. ఉద్యోగం త‌నకు త‌గిన ఆనందాన్ని అందించ‌క‌పోవ‌డంతోనే ఏదైన బిజినెస్ చేయాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో.. త‌న మిత్రులు స‌హకారం అందించ‌డంతో టీ దుకాణం ప్రారంభించాన‌ని తెలిపారు. 2014లో దీని ప్రారంభం నుంచి క‌స్ట‌మ‌ర్ల‌కు ఇష్ట‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన టీల‌ను అందించ‌డంతో తాము ప్ర‌త్యేకంగా నిలిచామ‌న్నారు. అందుకే త‌మ చాయ్ దుకాణం దేశ‌వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకోవ‌డంతో పాటు క‌స్ట‌మ‌ర్ల‌ను సైతం ఆక‌ర్షిస్తున్న‌ద‌ని తెలిపారు. ఒక వేయి రూపాయ‌ల‌తో పాటు త‌మ దుకార‌ణంలో రూ.15 మొద‌లుకుని టీ ధ‌ర‌లు ప్రారంభ‌మ‌వుతాయ‌ని తెలిపారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju