NewsOrbit
దైవం

కార్తీక ఏకాదశి.. ఉత్థాన ఏకాదశి !

కార్తీకంలో ప్రతీరోజుకు ఒక్క ప్రత్యేకత. ముఖ్యంగా కార్తీకదామోదర మాసంగా పేరుగాంచిన ఈ మాసంలో వచ్చే ఏకాదశి మరింత విశిష్టత కలిగి ఉంది. దీని విశేషాలు తెలుసుకుందాం…

తోలి ఏకాదశిగా పేరుగాంచిన ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుండి మేల్కొనే రోజు అందుకే ఇది ఉత్థాన ఏకాదశిగా పేరుపొందింది. దీనినే హరిబోధిని ఏకాదశి, దేవప్రబోధిని అని కూడా పిలుస్తారు. చాతుర్మాస వ్రతం ప్రారంబించిన తొలి ఏకాదశి, కార్తీకశుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. భీష్మపితామహుడు మహాభారత యుద్ధంలో ఈ ఏకాదశి రోజునే అస్త్రసన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈ రోజునే జన్మించాడు. కార్తీకశుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు. యోగులు, సిద్ధులు మొదలైన వారు విష్ణులోకం చేరుకొని కీర్తనలతో, భజనలతో, కర్పూరహారతులతో శ్రీమహావిష్ణువును మేల్కొలుపుతారు. విష్ణువుకి హారతి ఇవ్వడం వల్ల అకాలమృత్యు దోషం తోలిగిపోతుంది. విష్ణుమూర్తికి హారతి ఇవ్వడం కుదరని పక్షంలో దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ఇచ్చే హారతిని చూడండి, స్వామికి హారతి కర్పూరం సమర్పించండి. బ్రహ్మదేవుడికి, నారద మహర్షికి మధ్య జరిగిన ఏకాదశి మహత్యాన్ని గురించిన విశేషాలు స్కాందపురాణంలో వివరించబడింది.

ఏకాదశి ఫలితాలు ఇవే !

ఈ ఏకాదశి సర్వపాపాలను హరిస్తుంది. వెయ్యి అశ్వమేథ యాగాలు, వంద రాజసూయ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జీవుడు వేలజన్మాలలో చేసిన పాపాలను కాల్చేస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం చేసి, ఒక చిన్న మంచిపని చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఇస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు సర్వపాపపరిహారం కలుగుతుంది, పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞాలు, యాగాలు, వేదం చదవడం వలన కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం లభిస్తుంది’ అని బ్రహ్మదేవుడు నారదమహర్షికి తెలిపాడు. ఏకాదశి వ్రతం చేసినవారు ఒకరికి అన్నదానం చేయడం వలన సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానదీ తీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది. వస్త్రం, పళ్ళు, దక్షిణ తాంబూలాన్ని పండితులను దానం చేయడం వల్ల ఈ లోకంలోనే కాకుండా మరణం తరువాత కూడా స్వర్గసుఖాలు పొందుతారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శ్రీమహావిష్ణువుని పూజించి, రాత్రి జాగరణ చేసి, ద్వాదశి ఘడియలు ఉండగానే శ్రీమహావిష్ణుపూజ చేసి, భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి.

 

Related posts

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju