NewsOrbit
రాజ‌కీయాలు

సంచలన రాజకీయం..! ఎంఐఎం- బీజేపీ అసలు రంగు బయటపడిందా..!?

shocking news on bjp and aimim alliance

‘తాడిని తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు’ అనేది ఓ సామెత. ఈ సామెత ఇక్కడ పనిచేస్తుందో లేదో గానీ ఈ కథనం చదివితే కాస్త నిజం అనిపిస్తుంది. బీజేపీ-ఎంఐఎం దోస్తీపై వస్తున్న ఊహాగానాలపై ఉన్న ఒకొక్క పొర వీడుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఈ రెండు పార్టీల ప్రచారశైలిని గమనించిన వారికి.. వీరిద్దరి మధ్య ఏదన్నా లోపాయకారి ఒప్పందం ఉందా అనే అనుమానాలు వచ్చాయి. ఏ తెరచాటు రాజకీయంతో బీహార్లో మ్యాజిక్ చేశారో ఇక్కడా అదే చేయాలని తలచి దొరికిపోయారు. బీజేపీకి లాభించేలా ఎంఐఎం మైండ్ గేమ్ ఆడుతోందని విస్తృతంగా వచ్చిన వార్తలు నిజమేనని బెంగాల్ లో మారిన రాజకీయ సమీకరణాలు నిరూపిస్తున్నాయి.

shocking news on bjp and aimim alliance
shocking news on bjp and aimim alliance

 బెంగాల్లో ఎంఐఎం పరిస్థితి..!

బెంగాల్ ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు ఆ పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ లో చేరటం తీవ్ర చర్చనీయాంశమైంది. బెంగాల్లో కూడా చక్రం తిప్పాలనుకున్న బీజేపీ-ఎంఐఎంకు ఆ రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు అన్వర్ హుస్సేన్ పాషా రాజీనామా ఈ రెండు పార్టీలకు శరాఘాతంలా తగిలింది. వెళ్తూ.. వెళ్తూ ఆయన చేసిన ఆరోపణ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ‘హిందువుల ఓట్లన్నీ బీజేపీకి పడేలా ఎంఐఎం రాజకీయాలు చేస్తోంది. బీహార్లో జరిగింది ఇదే. బెంగాల్లో ఎంఐఎంకు ఆ అవకాశం ఇవ్వం. ఇక్కడకు రావడానికి ఓవైసీ రాకూడదు. రాజకీయాలను మతం కోసం వాడుకునే కొందరికి బెంగాల్లో చోటు లేదు. అది కాషాయమైనా.. ఆకుపచ్చ అయినా ఒకటే’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజలతో రాజకీయ పార్టీలు ఆడుకునే ఆటలను బహిర్గతం చేశాయి.

ప్రజల నమ్మకాన్ని గెలవగలరా..?

ఇన్నాళ్లూ బీజేపీ-ఎంఐఎం అంటే మతతత్వ పార్టీలనే ముద్ర ప్రజల్లో ఉండేది. ఇద్దరి మధ్య ఉప్పు నిప్పు వ్యవహారమనే అనుకున్నారు. మొన్నటి మహారాష్ట్ర, నిన్నటి బీహార్, ఇప్పటి జీహెచ్ఎంసీ ప్రచారంలో కూడా  నువ్వెంత.. అంటే నువ్వెంత అనుకున్నట్టే వ్యవహరించారు.. వ్యవహరిస్తున్నారు. కానీ.. అసలు లోగుట్టు ఇదనీ.. రేపు బెంగాల్లో జరగబోయేదీ ఇదేనని హుస్సేన్ నిరూపించారు. మతం రంగుతో ప్రజలను రాజకీయాలను వాడుకోవాలని నేతలు ఆలోచిస్తే.. వారి సమీకరణాలను పసిగట్టలేని ప్రజలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు లేకపోలేదు. పైన చెప్పిన సామెత ఇందుకే. ఆయా పార్టీలను అభిమానించే ప్రజలకు ఇది నిజంగానే షాక్ ఇచ్చేదే. మరి.. ఇరు పార్టీల నేతలు ఎలా సమర్ధించుకుంటారో.. చూడాల్సిందే.

 

 

 

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju