NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆరోపణలపై వినాయకుడి సన్నిధిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల సత్యప్రమాణాలు

 

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాళ్లు, ప్రతి సవాళ్లుతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఇద్దరు నేతలు చేసుకున్న ఆరోపణలపై బిక్కవోలులోని శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో సత్య ప్రమాణాలకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.  ఆలయంలో తొలుత ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు, ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు సత్య ప్రమాణాలు చేశారు. రామకృష్ణారెడ్డి ప్రమాణం చేస్తున్న సందర్భంలో ఆరోపణలు చేయడం కాదు ప్రమాణం చేయాలంటూ సూర్యనారాయణరెడ్డి పట్టుబట్టారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తే పరిస్థితి ఏర్పడటంతో పోలీసు అధికారులు రంగప్రవేశం చేసి సత్య ప్రమాణాల కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగా చూశారు.

నేతల సవాళ్ల నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బిక్కవోలు, అనపర్తి మండలాల్లో 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ చట్టాన్ని అమలు చేస్తున్నారు. కార్యకర్తలు గుడిగూడి ఉండకూండా పోలీసులు చర్యలు చేపట్టారు.

ఎమ్మెల్య సత్తి సూర్యనారాయణరెడ్డి పై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మైనింగ్ సహా పలు అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన సూర్యనారాయణరెడ్డి గణపతి ఆలయంలో ప్రమాణానికి సిద్దమంటూ రామకృష్ణారెడ్డికి సవాల్ విసిరారు. ఈ సవాల్ ‌ను రామకృష్ణారెడ్డి స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు సతీసమేతంగా ఆలయానికి వచ్చి ప్రమాణాలు చేశారు.

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఏమని ప్రమాణం చేసారో తెలుసుకునేందుకు ఈ కింది వీడియోను క్లిక్ చేయండి..    

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju