NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

ఏపి ప్రభుత్వానికి మరో షాక్..పంచాయతీ పోల్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) దాఖలు చేసిన అప్పీల్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు ధర్మాసనం రెండు రోజుల పాటు వాదనలు ముగియగా నిన్న తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు నేడు కీలక తీర్పును ప్రకటించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

ఏపి ప్రభుత్వానికి మరో షాక్..పంచాయతీ పోల్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ap high court verdict on panchayat elections

ఇటీవల ఎస్ఈసీ ఎన్నికల షెడ్యుల్ ను ప్రకటించగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నందున ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ప్రభుత్వ వాదనలకు ఏకీభవిస్తూ పంచాయతీ ఎన్నికల షెడ్యుల్ ను రద్దు చేసింది.

దీనిపై ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ ను హైకోర్టు అనుమతించింది. వ్యాక్సినేషన్ కు ఎన్నికలు అడ్డుకాదని ఎస్ఈసీ తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. వ్యాక్సినేషన్, ఎన్నికల నిర్వహణ ఏకకాలంలో సాధ్యం కాదంటూ అడ్వొకేట్ జనరల్ శ్రీరాం కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని హైకోర్టు పేర్కొంటూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?