NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాంబే హై కోర్టు ఇచ్చిన తీర్పుతో షాక్ లో దేశం…!

ఈరోజు బాంబే హైకోర్టు…. 12 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తికి లైంగిక దాడి కి పాల్పడ్డ కేసులో ఇచ్చిన తీర్పు సంచలనం రేపింది. అసలు ఆ వ్యక్తి పై ఉన్న అభియోగం ఏమిటంటే…. అతను బాధితురాలి వక్షోజాలని నొక్కాడట..! అయితే కోర్టు వారు మాత్రం నేరుగా ఒంటికి (స్కిన్ టు స్కిన్) వక్షోజాన్ని తాగితేనే లైంగిక దాడికి పాల్పడినట్లు అవుతుందని అలా ఒంటి పైన దుస్తులు లేదా టాప్ ఉన్నప్పుడు వక్షోజాలకు తాకడంలైంగిక దాది కిందికి రాదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

 

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు. అయితే కానీ.. నిందితుడి చ‌ర్య‌లో త‌ప్పు లేద‌న్న‌ట్లుగా, లైంగిక దాడి విష‌యంలో కోర్టు ఇచ్చిన నిర్వ‌చ‌నం ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఇక మహిళా వాదులు అయితే కోర్టు తీర్పుని భారీగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు లైంగిక దాడికి సంబంధించి కోర్టు వారు ఇచ్చిన నిర్వచనం దురుద్దేశం కలిగి వున్న పురుషులకు ఆయుధంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇక నటి తాప్సీ, గాయని చిన్మయి ఈ తీర్పుని తీవ్రంగా తప్పు పట్టారు. అయితే అంతకు ముందే సదరు నిందితుడికి లైంగిక దాడి కేసు విషయమై శిక్ష వేశారు. అతను మళ్లీ పిటిషన్ వేసుకున్నప్పుడు కోర్టు నుండి ఈ తీర్పు వెలువడింది. మహిళలపై అత్యాచారాలకు సంబంధించి జరిగే అనేక చర్చలు…. మారుతున్న చట్టాలు ఉన్నా రోజు దారుణాలు జరుగుతూనే ఉన్నాయని…. ఇలాంటి సమయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ఏమాత్రం సరికాదని కొందరు వాదిస్తున్నారు. మన దేశంలో మహిళలకు అన్యాయం జరుగుతుందని ఈ దేశం లైంగిక దాడి చేసే వాళ్ళ కోసమే ఉందని చినమయి వ్యాఖ్యానించింది.

ఇక తాప్సీ అయితే దీనిపై తను ఎలా స్పందించాలో కూడా తెలియట్లేదు మాటలు రావట్లేదు అని ట్వీట్ చేసింది. చాలా మంది మహిళలు ఈ విషయంపై కోర్టు ధిక్కారానికి కూడా పట్టించుకోకుండా తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు బయటకు వచ్చే వరకూ అత్యుత్సాహానికి పోయి ఇటువంటి కామెంట్లు చేయడం ఏమాత్రం సబబు కాదు అని కొందరు అంటున్నారు. మరికొందరు అయితే అతనికి ముందు తప్పుగా శిక్ష వేసి ఉంటారని…. లేకపోతే కోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వదని…. పూర్తి వివరాలు చూస్తే అర్థం అవుతుంది అని చెబుతున్నారు.

ఈ కేసులో నిందితుడిగా పరిగణించబడుతున్న వ్యక్తి ఏదైనా ఆకస్మికంగా లేదా యాదృచ్చికంగా బాధితురాలికి అసౌకర్యం కలిగించే అవకాశం కూడా ఉందని…. లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వదని వారి వాదన. ఎంతైనా కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం దేశంలో చాలా పెద్ద చిచ్చు రేపింది అని చెప్పాలి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju