NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

YS Sharmila షర్మిల పార్టీ ముహూర్తం ఖరారు..! ఇద్దరు సీఎంల మద్దతుతో సూపర్ ప్లాన్ తో సిద్ధం..!!

YS Sharmila Political Steps Tomorrow..?

జగన్ YS Jagan సోదరి YS Sharmila షర్మిల కొత్త రాజకీయ పార్టీపై ఊహాగానాలు ఎప్పటి నుండో ఉన్నాయి. వైఎస్ YS Rajasekhar Reddy అడుగు జాడల్లో.. వైఎస్ స్మరణలో సొంతంగా రాజకీయ ప్రవేశం చేయాలని షర్మిల ఎప్పటి నుండో అనుకుంటున్నారు. అయితే రెండు రోజుల కిందట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ABN Andhrajyothi రాసినట్టు జగన్ YS Jagan పై కోపంతో కాదు..! ఒక పద్ధతి ప్రకారం.., ఒక ప్లాన్ ప్రకారం.., తెరవెనుక ఇద్దరు సీఎంల పక్కా ప్రణాళిక ప్రకారం Telangana State Politics కొత్త రాజకీయ పార్టీ ద్వారా అడుగు పెట్టబోతున్నారు..! అదేమిటో చూద్దాం..!!

అంతగా దూరం పెరగలేదు..!!

జగన్ కీ షర్మిల కి దూరం పెరిగితే పెరిగి ఉండొచ్చు. జగన్ వైఖరి పట్ల షర్మిల అలిగితే అలిగి ఉండొచ్చు. కానీ ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఊహించుకున్నంతగా షర్మిల పార్టీ పెట్టేసి జగన్ ని తిట్టిపోసి.., అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేసేంతగా కాదు..! వారిద్దరి మధ్య అంత దూరం పెరగలేదు. కూర్చుని మాట్లాడుకుంటే.., చెల్లి అలకని అన్నగా జగన్ తీరిస్తే సరిపోతుంది. ఆమె కోరిన పదవి ఇవ్వడం జగన్ కి చిన్న పని. అది షర్మిలకి కూడా తెలుసు. కానీ టీడీపీ కళ్ళు చల్లబడడం కోసం.., తన అంతరానందం కోసం ఏబీఎన్ ఆర్కే అలా సారి ఉండొచ్చు..! ఇక విషయానికి వచ్చేస్తే షర్మిల కొత్త పార్టీకి తెరవెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటూ ఏపీ సీఎం జగన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరి ఉమ్మడి రాజకీయ ప్రణాళికలో భాగంగా షర్మిలని తెలంగాణాలో పార్టీ పెట్టించి, వచ్చే ఎన్నికల్లో పోటీకి దించనున్నట్టు ప్రచారం జరుగుతుంది..!! దీని వలన కేసీఆర్ కి ఏంటి లాభం..? అనేది చూద్దాం..!

బీహార్ లో బీజేపీ ఏం చేసింది..!?

బీహార్ లో ముస్లిం ఓట్లు కచ్చితంగా బీజేపీకి పడవు. అయోధ్య రామమందిర నిర్మాణం.., సీఏఏ బిల్లు.., ఢిల్లీలో ముస్లింలపై దాడులు.., ఇవన్నీ చూసుకున్న బీజేపీకి ముస్లిం ఓట్లు పడడం కల్లా..! అందుకే బీజేపీ తెలివిగా తనకు పడని ఓట్లు .. తన రాజకీయ ప్రత్యర్థికి కూడా పడకూడదు అనే ప్లాన్ వేసింది. అందుకే సింపుల్ స్ట్రాటజీతో ముస్లిం సెంటిమెంట్ రగిలేలా ఎంఐఎం పార్టీని రంగంలోకి దించింది. ఎన్నికలకు ముందు నాలుగు నెలల వరకు బీహార్ లో అసలు కార్యకర్తల బలమే లేని ఎంఐఎం.. ఎన్నికల్లో ఊహించని బలంతో అయిదు స్థానాలు గెలిచేసింది. మరో 25 నియోజకవర్గాల్లో ఆర్జెడీకి పడాల్సిన ముస్లిం ఓట్లు చీల్చేసింది. ఈ ఫలితంగా అక్కడ బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. 2015 లో 53 స్థానాలు తెచ్చుకున్న బీజేపీ.., 2020 నాటికి 75 స్థానాలు గెలుచుకుని కింగ్ గా అవతరించింది. అంటే “తనకు పడని ఓట్లు తన ప్రధాన ప్రత్యర్థికి పడకూడదు. మరో చిన్న పార్టీకి పోవాలి” అనే సూత్రాన్ని ప్రవేశ పెట్టి విజయం సాధించింది..! ఇప్పుడు ఇదే పాయింట్ తో తెలంగాణ రాజకీయం చూద్దాం..!!

KCR-YS-Jagan

రెడ్డి సామాజికవర్గం కోసం గాలం..!!

ఏపీలో కమ్మ , రెడ్డి రాజకీయ డామినేషన్ ఉన్నట్టే.. తెలంగాణాలో కూడా వెలమ , రెడ్డి డామినేషన్ రాజకీయం ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత వరుసగా రెండు సార్లు టీఆరెస్ గెలిచింది. వెలమ దొర సీఎంగా కుర్చీ ఎక్కారు. కానీ రెడ్డిల పెత్తనం తగ్గిపోయింది. తెలంగాణ గడ్డపై చక్రం తిప్పిన జానారెడ్డి.., కోమటిరెడ్డి.. మర్రి చెన్నారెడ్డి.., లాంటి వారు రాజకీయ చరిత్రలో చీకటి రోజులు దాపురించాయి. రేవంత్ రెడ్డి ఫైర్ ఉన్నప్పటికీ సరైన రాజకీయ వేదిక ఉండడం లేదు. అందుకే రెడ్డి సామాజికవర్గానికి ఒక రాజకీయ వేదిక కనిపించడం లేదు. కేసీఆర్ కి వ్యతిరేకంగా రెడ్డిలు అందరూ ఏకమై వచ్చే ఎన్నికల నాటికి గెలవాలని చూస్తున్నారు. రెడ్డిలు ఈ సారి కసిగా, కలిసికట్టుగా పని చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. కాంగ్రెస్ లేదా బీజేపీ గొడుగులోకి దూరి అందరూ కలిసే ఉండాలనేది వారి నిర్ణయం..!!

షర్మిల తో కొంత గ్యాప్ కవర్ చేసేలా..!

రెడ్డి సామాజికవర్గానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే హీరో. వారి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ఏపీలో రాజకీయ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టె అవకాశం, సమయం లేదు. అందుకే షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్తే బాగానే ఉంటుంది అనేది ఆలోచన. తండ్రి అభిమానులు, జగన్ అభిమానులు, రెడ్డి సామాజివర్గ పెద్దలు కలిసి వస్తే షర్మిల అక్కడ రాజకీయంగా నిలదొక్కుకోవచ్చు. అందుకే కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్న రెడ్డి ఓట్లు చీల్చి.., కాంగ్రెస్, బీజేపీ ఎదగకుండా… షర్మిల ద్వారా వారికి చెక్ పెట్టాలి అనేది కేసీఆర్ వ్యూహం. ఆ ప్లాన్ తోనే షర్మిల రాజకీయ అడుగుల్లో కేసీఆర్ – జగన్ కలిసి నడిపిస్తారనేది ఒక కొత్త స్ట్రాటజిగా కనిపిస్తుంది. అయితే దీనిలో జగన్ ఎంత వరకు ముందు ఉంటారు.. సహకరిస్తారు అనేది ప్రస్తుతానికి అనుమానం అయినప్పటికీ… షర్మిల పార్టీ ఏర్పాటు విషయంలో మాత్రం ఏమి అడ్డు చెప్పే అవకాశం లేదు.

 

 

 

 

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju