NewsOrbit
న్యూస్

Pogaru review : ‘పొగరు’ మూవీ రివ్యూ

Pogaru review :  ఈ శుక్రవారం అనేక సినిమాలతో పాటు కన్నడ నుండి డబ్బింగ్ చిత్రంపొగరుకూడా విడుదలైంది. ధ్రువ సర్జా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రానికి నందకిషోర్ దర్శకత్వం వహించాడు. చందన్ శెట్టి సంగీతం ఇచ్చిన ఈ చిత్రం లోని హీరో ధ్రువ సర్జాయాక్షన్ కింగ్అర్జున్ కి మేనల్లుడు. ఇక ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం….

 

Pogaru review rashmika mandanna
Pogaru review rashmika mandanna

Pogaru review – కథ

శివ (ధ్రువ సర్జా) తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవలసి వస్తుంది. అయితే శివ చాలా చిన్న వాడు కావడం వల్ల అతనికి తెలియకుండా తల్లి (పవిత్ర లోకేష్) రెండో పెళ్లి చేసుకుంటుంది. పెద్దయిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న శివ దానిని మైండ్లో పెట్టుకుని పూర్తి మొరటుగా మారిపోతాడు. అటువంటి శివ కు అదే కాలనీలో ఉండే టీచర్ (రష్మిక మందన) పై ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత ఆమెపై అతనికి ఏర్పడిన ప్రేమ వల్ల జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయితన సవతి చెల్లి శివ జీవితంలో ఎలాంటి పాత్ర పోషించిందిచివరికి శివ అతని తల్లికి, ఆ కుటుంబానికి దగ్గరయాడా? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ లు

యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ధ్రువ లుక్స్, నటన ఫ్రెష్ గా అనిపిస్తాయి. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ప్రేక్షకులను బాగానే అలరించాడు.

ధ్రువ. రష్మిక మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు, కెమిస్ట్రీ బాగుంది. దర్శకుడు కథను ట్రీట్ చేసే విధానం నీట్ గా ఉంటుంది. కొన్ని ఎలివేషన్ సీన్స్ కూడా బాగా ఉన్నాయి.

అక్కడక్కడ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. ఎంటర్టైన్మెంట్ పర్వాలేదనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు కథ కాస్త వేగంగా సాగి సెకండాఫ్ మీద ఆసక్తి పెంచుతుంది.

మైనస్ లు

ఈ చిత్రంలో లో కథ పెద్దగా లేదు. రెగ్యులర్ మాస్ మసాలా సన్నివేశాల కూడికలా ఉంటుంది. పైగా ఇందులో చర్చించిన అంశాలు ఈరోజుటి సమాజంలో ఎంతవరకు కు సెట్ అవుతాయి అనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేరు.

ఎంత కమర్షియల్ మాస్ మసాలా సినిమా అయినా కూడా ఈ సినిమాలోని కొన్ని పరిస్థితులు అత్యంత దారుణంగా ఉంటాయి. రియాలిటీకి చాలా దూరంగా ఉండే కథ ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తుంది.

ఇక రెండవ అర్ధ భాగంలో ఉండే సాగతీత అయితే ప్రేక్షకుల ఓపికకు పరీక్ష. సినిమాలో చాలా భాగం ఎడిటింగ్ లో తీసేయవచ్చు. అలాగే హీరో చేసే పనులన్నీ చాలా ఓవర్ సినిమాటిక్ గా అనిపిస్తాయి.

Pogaru review : విశ్లేషణ

ఒక పక్కా మాస్ యాక్షన్ డ్రామా ని అత్యంత ఘోరమైన కథ తో తీసిన ఈ సినిమా రొటీన్ కమర్షియల్ లాగా ముగుస్తుంది. హీరో యాక్షన్, అక్కడక్కడా కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ మినహాయించి చిత్రంలో చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు. క్లైమాక్స్లో ఎమోషన్ కొద్దిగా పడింది. ఇక రెండవ అర్ధ భాగంలో సన్నివేశాలను సాగతీయడం అనేది ప్రేక్షకులు పూర్తిగా చిరాకు తెప్పిస్తుంది. రియాలిటీ కి దూరంగా ఉండటం మధ్యమధ్యలో అర్థంపర్థంలేని ఎపిసోడ్లు పెట్టడం వంటివి భరించడం కష్టమే. అన్నీ సినిమాలు చూడడం అయిపోతే టైంపాస్ కి తప్పించి ఈ చిత్రం థియేటర్లో భరించడం కూడా కష్టమే.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju