NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: ఇతర రాష్ట్ర ప్రజల ప్రాణాలను కూడా కాపాడుతున్న జగన్ ప్రభుత్వం…!!

Ys Jagan: దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు లక్షలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యే పరిస్థితి ఉండటంతో పాటు రోజూ కొన్ని వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితి తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా వైరస్ దేశం లోకి వచ్చిన ప్రారంభంలో కేంద్రం… అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే కేంద్రం ఇచ్చిన ఆదేశాలను చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం మాత్రం.. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం భారీగా ఏర్పాటు అయ్యేలా … నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

Jagan government is also saving the lives of people of other states ..!!
Jagan government is also saving the lives of people of other states ..!!

దీంతో రాష్ట్రంలో వివిధ కేంద్రాల్లో దాదాపు 200 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ప్రజెంట్ ఏపీలో ఉంది. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత భారీగా ఉంది. కరోనా రోగులకు చికిత్స అందించే విషయంలో ఆక్సిజన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పరిణామంతో కరోనా వైరస్ కేసులు అధికంగా బయటపడుతున్న రాష్ట్రాలు ఆక్సిజన్ కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆక్సిజన్ కొరత ఉన్న రాష్ట్రాలలో అధికంగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఏపీలో మహమ్మారి కరోనా తీవ్రత బట్టి 50 నుండి 60 టన్నుల ఆక్సిజన్ మాత్రమే అవసరమవుతుంది.

ఆక్సిజన్ కొరత ఉన్న రాష్ట్రాలకు..ఆపన్న హస్తం: –

ఈ నేపథ్యంలో దేశంలో మిగతా రాష్ట్రాలలో ఎక్కడైతే ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉందో..అక్కడికి జగన్ ప్రభుత్వం.. టన్నులకొద్దీ ఆక్సిజన్… సరఫరా చేస్తూ ఉంది. దాదాపు ఏడు వందల టన్నుల ఆక్సిజన్ వివిధ రాష్ట్రాలకు ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం సరఫరా చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి 150 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తీసుకెళ్లడానికి ఆక్సిజన్ ట్రైన్ పంపించడం జరిగింది. ఈ విధంగా దేశంలో ఇతర రాష్ట్రాల ప్రజల ప్రాణాలను కాపాడటం లో… జగన్ ముందు చూపు నిర్ణయం దేశానికి ఆయువుపట్టుగా మారింది.

రాష్ట్రంలో కరోనా రోగుల పట్ల జగన్ జాగ్రత్తలు: –

ఇదే టైం లో రాష్ట్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు కీలక సూచనలు జగన్ సూచించారు. రాష్ట్రంలో దాదాపు 115 సెంటర్లలో 49,810 బెడ్లు ఏర్పాటు చేయాలని, గతంలో మాదిరిగానే భోజన ఏర్పాట్లు మరియు వసతులు ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత లేకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా సోమవారం నుండి ప్రభుత్వ హాస్పిటల్స్ కు రోజుకు 10000 రెమ్డెసివిర్ ఇంజక్షన్లు అనుమతి ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు రోజుకు ఏడు వేల ఇంజక్షన్లు అందుబాటులో ఉండేలా జగన్ సూచించారు. అంతేకాకుండా 300 మంది డాక్టర్లు మరియు 120 లైన్లతో 104 కాల్ సెంటర్ అందుబాటులో ఉండాలని.. రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ సమస్యతో ఫోన్ చేసిన వైద్యులు సలహాలు సూచనలు ఇచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని వైద్య ఆరోగ్యశాఖ కి జగన్ ఆదేశాలు ఇవ్వడం జరిగిందట. ఏది ఏమైనా ఒకపక్క ఇతర రాష్ట్రాలకు మరోపక్క సొంత రాష్ట్రంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో జగన్ నిర్ణయాలు అదరహో అన్నట్టు ఉన్నాయి అంటూ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju