NewsOrbit
న్యూస్ సినిమా

Amala Paul: అమలా పాల్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అందుకే సక్సెస్ కాలేదా..?

Amala Paul: కొంతమంది హీరోయిన్స్ సినిమా అవకాశాలైతే వరుసగా అందుకుంటారు గానీ సక్సెస్‌లు మాత్రం ఖాతాలలో చేరవు. దాంతో ఎన్నో ఆశలు పెట్టుకొని స్టార్ హీరోయిన్ అవుదామనుకున్న వారు కనుమరుగవక తప్పడం లేదు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే హీరో, దర్శకులు, హీరోయిన్స్..ఇలా చాలామంది విషయాలలో నిరూపణ అయింది. ఎంత స్టార్ అయినా ఓ రెండు ఫ్లాపులు గనక బ్యాక్ టు బ్యాక్ పడితే కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోతుంది.

is amala-paul-has not become successful heroine in tollywood
is amala-paul-has not become successful heroine in tollywood

అలా మారిన హీరోయిన్స్‌లో అమలా పాల్ కూడా ఒకరు. ఆమెకి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ఈమె తర్వాత వచ్చిన పూజా హెగ్డే, రష్మిక మందన్న, సాయి పల్లవి, కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్స్ అటు తెలుగు, ఇటు తమిళ, హిందీ చిత్రాలలో క్రేజీ ఆఫర్ అందుకొని ఓ రేంజ్ స్టార్ డం దక్కించుకొని క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేకపోయినా కూడా దర్శక, నిర్మాతలు వీరి డేట్స్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. హీరోలు కూడా మాకు వీరే హీరోయిన్‌గా కావాలనే రేంజ్‌లో ఉన్నారు.

Amala Paul: అవసరమైతే రెమ్యునరేషన్ పెంచుతామన్నా కూడా డేట్స్ దొరకని పరిస్థితి.

అవసరమైతే రెమ్యునరేషన్ పెంచుతామన్నా కూడా డేట్స్ దొరకని పరిస్థితి. కానీ అమలా పాల్ మాత్రం అవకాశాల కోసం ఎదురు చూస్తోందని చెప్పుకుంటున్నారు. మలయాళం, తమిళం, తెలుగు సినిమాలలో నటించిన అమలాకి కొన్ని సినిమాలలో మంచి పేరే దక్కింది. నాయక్ లాంటి సినిమాలతో హిట్స్ కూడా అందుకుంది. లవ్ ఫెల్యూర్ లాంటి మంచి సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ రూపొందించిన ఇద్దరమ్మాయిలు సినిమా కూడా అమలా పాల్‌కి మంచి పేరు తెచ్చి పెట్టింది.

అయినా తెలుగులో అమలా పాల్ ఆశించిన అవకాశాలు అందుకోలేక రేస్‌లో పూర్తిగా వెనకబడిపోయింది. ఆ మధ్య అమలా పాల్ ఆమె అనే ప్రయోగాత్మక చిత్రంలో కూడా నటించింది. ఈ పాత్ర ఆమెకి చాలా మంచి పేరు తీసుకువచ్చింది. కథకి అవసరం అని దర్శకుడు చెప్పగానే నగ్నంగా నటించడానికి కూడా వెనకాడలేదు. ఈ పాత్ర అమలా పాల్‌కి మైల్ స్టోన్ మూవీలా నిలిచింది కూడా. అంతేకాదు ముందు కొంత కాంట్రవర్సీ అయినా, మూవీ రిలీజయ్యాక అటు తమిళం, ఇటు తెలుగులో చాలా మంచి పేరు వచ్చింది.

Amala Paul: రెండు భాషలలో ‘ఆమె’ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

రెండు భాషలలో ఆమె చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయినా అమలాకి దక్కాల్సిన క్రేజీ మూవీస్ దక్కడం లేదు. ఇప్పుడు దాదాపు స్టార్ హీరోయిన్స్ అందరూ పాన్ ఇండియన్ సినిమాలలో నటించే అవకాశం అందుకుంటున్నారు. వారిలో అమలా లేకపోవడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ఆమె సినిమాతోనే అమలా ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకైనా రెడీ అని చెప్పింది. ఇక స్టార్ హీరోయిన్స్ అందరూ వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తున్నారు. కానీ అమలాకి ఆ అవకాశాలు కూడా అంతగా రావడం లేదనేది టాక్. పిట్ట కథలు అనే వెబ్ సిరీస్ చేసినా కూడా అది అమలాకి అంతగా కలిసిరాలేదు.

అయితే కొన్ని సినిమాలలో ఆమె పాత్రలు ప్రేక్షకులను అంతగా మెప్పించకపోవడమే ఇందుకు ఓ ప్రధాన కారణమని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ప్రేక్షకులు కూడా ఆమె నటించిన కొన్ని సినిమాలను అంతగా ఆదరించలేదు. అందుకు ఉదాహరణ రాం చరణ్ హీరోగా వచ్చిన నాయక్ సినిమానే. ఇందులో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో అనే సాంగ్ రీమేక్‌లో నటించింది. కానీ ఈ పాటలో ఆమె డాన్స్ ఏమాత్రం బాగాలేదనే విమర్శలు వచ్చాయి. అలాగే కొన్ని సీన్స్ కూడా అమలా బాగా చేయలేదని జనాలు చెప్పుకున్నారు. ఇలాంటి కొన్ని కారణాల వల్లనే అమలా పాల్ సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారలేకపోయిందనేది విశ్లేషకుల మాట.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu