NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చిన సీబీఐ..! వ్యక్తిగత హజరు మినహాయింపుపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..!!

YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ కు సీబీఐ సహకరిస్తోందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ శాఖ అధికారులు జగన్ కు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సమయంలో అఫిడవిట్ దాఖలు చేయడానికి వాయిదాల మీద వాయిదాలు అడిగి చివరకు అఫిడవిట్ దాఖలు చేయడంలేదనీ, బెయిర్ రద్దు విషయంలో కోర్టు నిర్ణయానికే వదిలివేశారు. జగన్ బెయిల్ రద్దును సీబీఐ అపోజ్ చేయకపోవడంతో అటు జగన్, రఘురామ న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు రఘురామ పిటిషన్ ను కొట్టేసింది. అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో.. అక్రమాస్తుల కేసులో జగన్ వ్యక్తిగత హజరు మినహాయింపు పిటిషన్ పై జరిగిన విచారణలో సీబీఐ గత వైఖరికి భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశమవుతోంది.

Telangana high court YS Jagan case
Telangana high court YS Jagan case

 

YS Jagan: తీర్పుపై సర్వత్రా ఆసక్తి

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ప్రస్తుతం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కొనసాగుతోంది. ఈ విచారణ నుండి సీఎంగా ఉన్న తనకు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే సీబీఐ కోర్టు జగన్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ చేసిన విజ్ఞప్తి పై హైకోర్టుకు సీబీఐ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జగన్ కు వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇవ్వవద్దని హైకోర్టుకు తెలిపింది. జగన్ సాక్షులు తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. జగన్ హోదా పెరిగినందున సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొంది. పదేళ్లు అయినా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ ల దశలోనే ఉన్నాయని సీబీఐ పేర్కొంది. వ్యక్తిగత హజరు నుండి మినహాయింపు ఇస్తే విచారణ మరింత ఆలస్యం అవుతుందని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju