NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Perni Nani: విమర్శలకు చెక్ పెట్టిన సీఎం జగన్.. మోహన్ బాబుతో మంత్రి పేర్ని నాని భేటీ..

Perni Nani: సినీ రంగ సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ పెద్దలు నిన్న ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ తో జరిగిన సమావేశంలో చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, పోసాని కృష్ణమురళి, ఆలీ, ఆర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. చిరు నాయకత్వంలో వీరంతా సీఎం జగన్ తో సమావేశమై సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంతో సినీ పరిశ్రమ, ఏపి ప్రభుత్వం మధ్య సినీమా టికెట్ల వ్యవహారంపై నడుస్తున్న వివాదానికి శుభం కార్డు పడినట్లు అయ్యింది. ఈ క్రమంలోనే తెలుగు సినీ పరిశ్రమకు సీఎం జగన్ రెడ్ కార్పెట్ పరిచారు. విశాఖ వచ్చేయండి అన్నీ చూసుకుంటా, షూటింగ్ లు ఏపీలో పెట్టుకోండి. విశాఖలో ఇళ్ల స్థలాలు ఇస్తా, స్టూడియోలకు భూములు ఇస్తా, మరో జూబ్లీహిల్స్ లా మార్చేద్దాం అంటూ హామీలు ఇచ్చేశారు వైఎస్ జగన్.

Perni Nani meet manchu mohan babu
Perni Nani meet manchu mohan babu

Perni Nani: జగన్ కుటుంబానికి బంధువైన

అయితే ఈ సమావేశానికి సినీ పరిశ్రమలో పెద్ద దిక్కుగా ఉన్న మంచు మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అహ్వానం లేకపోవడం, వారు రాకపోవడంతో సినీ, రాజకీయ వర్గాల్లో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మోహన్ బాబు, జగన్ కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉంది. గత ఎన్నికల ముందు మోహన్ బాబు వైసీపీలో చేరారు. వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహనరెడ్డి సీఎం అయిన తరువాత మంచు విష్ణు కలిశారు గానీ మోహన్ బాబు కలవలేదు. ఒక పర్యాయం విజయవాడ వరకూ వచ్చి కూడా సీఎం జగన్ అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో వెనక్కు వెళ్లిపోయారన్న ప్రచారం కూడా జరిగింది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె కార్యక్రమంలో మోహన్ బాబు జగన్ ను ఉద్దేశించిన మాట్లాడిన మాటల వల్లనే ఆయన హర్ట్ అయ్యారని కూడా అంటున్నారు. ఈ ప్రచారంలో నిజం ఉందో లేదో కానీ నిన్న జరిగిన సమావేశంలో మోహన్ బాబుకు ప్రాధాన్యత లేకపోవడంతో జగన్ పక్కన పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఇది సినీ వర్గాల్లోనూ రచ్చకు దారి తీస్తోంది.

వివాహ వేడుకకు హైదరాబాద్ వెళ్లి  పనిలో పనిగా

ఈ తరుణంలో ఏపి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని శుక్రవారం మోహన్ బాబు నివాసానికి వెళ్లి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బొత్సా సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుకకు హైదరాబాద్ వెళ్లిన మంత్రి పేర్ని నాని పనిలో పనిగా మోహన్ బాబును కలిసినట్లు చెబుతున్నారు. సినీ పరిశ్రమలో ముఖ్య భూమికను పోషిస్తున్న మోహన్ బాబును కలవాలని సీఎం జగన్ సూచించినందు వల్లనే మంత్రి పేర్ని నాని ఆయనను కలిసినట్లు తెలిసింది. నిన్న జరిగిన చర్చల వివరాలను మంత్రి నాని మోహన్ బాబుకు వివరించారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju