NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ సినిమా

Jagan Chiranjeevi: జగన్ – చిరు భేటీ లీక్ వీడియోతో తమ్మారెడ్డి సహా హర్ట్ అయిన మెగా ఫ్యాన్స్..

Jagan Chiranjeevi: సినీ పరిశ్రమ సమస్యలపై ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సహా మహేష్ బాబు, ప్రభాస్ తదితర సినీ పెద్దలు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం అనంతరం లోపల చర్చించిన అంశాలపై చిరుతో సహా ఇతర సినీ పెద్దలు, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. ఇంత వరకూ బాగానే ఉంది. సీఎం జగన్ క్యాంప్ ఆఫీసులో జరిగిన సమావేశాలకు సంబంధించి వీడియోలు గతంలో బయటకు లీక్ అయ్యేవి కావు. ఫోటోలు, ఒకటి రెండు వీడియో క్లిప్పింగ్స్ మాత్రమే మీడియాకు అందేవి. అయితే ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి తన స్థాయిని తగ్గించుకుని సీఎం జగన్ ను అభ్యర్ధిస్తున్నట్లుగా మాట్లాడటం, ఆ మొత్తం వీడియో బయటకు రావడం మెగా అభిమానులను బాధ కల్గించింది. దీనిపై ముందుగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. సూపర్, మెగా, బాహుబలి లెవల్ బెగ్గింగ్ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

Jagan Chiranjeevi: అంతగా అభ్యర్ధించాల్సిన అవసరం లేదు

తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా స్పందించారు. చిరంజీవి తన స్థాయిని మరిచి అంతగా అభ్యర్ధించాల్సిన అవసరం లేదని అన్నారు తమ్మారెడ్డి. సీఎంతో భేటీ తర్వాత అంతా బాగా జరిగిందని సినీ ప్రముఖులు చెప్పడం సంతోషకరమని  తమ్మారెడ్డి అన్నారు. ఏపి ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసినందుకు చిరంజీవికి ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఇండస్ట్రీకి పెద్దగా తాము భావిస్తున్నామనీ, ఆయనకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని అన్నారు. స్వతహాగా చిరంజీవే చాలా పెద్ద మనిషని, ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్దగా కూడా సీఎం వద్దకు వెళ్లారని తెలిపారు. అయితే సీఎంతో చిరంజీవి మాట్లాడుతున్న వీడియో చూసినప్పుడు తనకు చాల భాధ కల్గించిందన్నారు తమ్మారెడ్డి. ఆత్మగౌరవం పక్కన పెట్టి యాచించినట్లుగా ఉందని అన్నారు. ఆయన అలా అడగడం చూసి మనం ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నామా అని బాధేసిందని అన్నారు. ఈ భేటీలో కేవలం సినిమా టికెట్ ధరల గురించే తప్ప ఇతర సమస్యల గురించి ప్రస్తావన వచ్చినట్లు అనిపించడం లేదని అన్నారు.

Jagan Chiranjeevi: కరోనా కారణంగానే సినిమాలు విడుదల కాలేదు

విశాఖలో స్థలాలు ఇస్తామని, ఇండస్ట్రీని అక్కడ అభివృద్ధి చేయాలని సీఎం చెప్పారనీ, ఆయన ఇతర సమస్యలపైనా స్పందించి ఉంటే అందరం సంతోషించే వాళ్లమని అన్నారు తమ్మారెడ్డి. సినిమాలు విడుదల కాకపోవడానికి కరోనానే కారణమని పేర్కొన్నారు తమ్మారెడ్డి, టికెట్ ధరల వల్ల సినిమాలు విడుదల కాలేదని చిరంజీవి చెప్పడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతోనే అఖండ, పుష్ప మువీలు మంచి కలెక్షన్లను సాధించాయని చెప్పారు. మరో రూ.20 నుండి 25 కోట్ల అధిక వసూళ్ల కోసం ఇండస్ట్రీ దిగ్గజాలు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి వంటి వారు అంతగా ప్రాధేయపడాల్సిన అవసరం లేదని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. చిరంజీవి వంటి అత్యున్నత స్థాయిలో ఉన్ వ్యక్తి ఇలా అడగడం బాధగా ఉందని అన్నారు తమ్మారెడ్డి, మనం శాసించే వాళ్లం కాకపోయినా, ట్యాక్సులు కడుతున్న వారమని అన్నారు మన గౌరవాన్ని కాపాడుకుంటూనే మనం మాట్లాడాలని అన్నారు. ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత తనకు చాలా బాధగా అనిపించిందన్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri