NewsOrbit
న్యూస్

Karthika Deepam : కార్తీకదీపం కొత్త తరం మొదలు! బతికిన హిమ..కానీ హిమపై పగతో రగిలిపోతున్న సౌర్య..!!

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ అందరిని విశేషంగా అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో కార్తీక్, దీప ఇద్దరు చనిపోవడంతో అభిమానులు అందరు సోకశంద్రంలో మునిగిపోతారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఎలాంటి కీలక మలుపులు చోటు చేసుకున్నాయో చూద్దామా. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే కార్తీక్, దీప, హిమలు చనిపోయారనే బాధలో అందరు కూడా ఏడుస్తూ ఉంటారు.

Karthika Deepam : కార్తీక్ ఎప్పటికి నాతోనే ఉంటాడు అంటున్న మోనిత :

ఈ క్రమంలోనే మోనిత కూడా తెల్లచీర కట్టుకుని కార్తీక్ ఫోటో దగ్గరకు వచ్చి నేను చచ్చేంత వరకు కార్తీక్ ప్రేమ నాతోనే ఉంటుంది అని ఏడ్చుకుంటూ చెబుతుంది. అలాగే సౌందర్య ఇంటినుండి వెళ్లేముందు కార్తీక్ నాతో ఉంటే గుండెల్లో ఉండేవాడు దీపతో ఉన్నాడు కాబట్టి ఈ ఫోటో లో ఉన్నాడు అని మోనిత చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ తర్వాత సీరియల్లో కి ఇంద్రుడు, చంద్రమ్మలు అనే ఇద్దరు కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇస్తారు. వాళ్ళు మెడిసిన్ కొనడానికి డబ్బులు లేక ఒక వ్యక్తి దగ్గర డబ్బులు కొట్టేయడం చూపిస్తారు. వాళ్ళు మరెవరో కాదు హిమ లోయలో పడిపోతే కాపాడిన వాళ్లే.

హిమ మీద పగను పెంచుకున్న సౌర్య:

మరోవైపు సౌర్యకు సృహ వస్తుంది లేవడంతోనే హిమ మీద బాగా ఫైర్ అవుతుంది. దానికి సంబంధించిన వస్తువులు అన్ని నేలపై విసిరేస్తూ హిమనే అమ్మ నాన్నలను చంపేసింది అంటూ ఏడ్చుకుంటూ చెబుతుంది. వద్దు వద్దు అంటున్నా హిమ కారు నడపడం వలనే ఈరోజు నేను అమ్మ నాన్న లేని అనాధను అయ్యాను అంటూ గట్టిగా ఏడ్చేస్తుంది సౌర్య. ఇక సౌందర్య సౌర్య ను అది కాదు రౌడీ అని పిలవగా నన్ను అలా పిలవద్దు అమ్మానాన్నల తోనే ఆ సౌర్య చచ్చిపోయింది అంటూ గట్టిగా ఏడ్చేస్తుంది. అమ్మానాన్నల చావుకు కారణమైన అది ఎక్కడో ఒకచోట బతికే ఉంటుంది. దాన్ని నేను వదలను అని గట్టిగా అరుస్తుంది.

Karthika Deepam : హిమ చనిపోలేదు… బతికే ఉంది..ఎవరు కాపాడారంటే..?

ఇక ఇంద్రుడు,చంద్రమ్మ వాళ్ల ఇంట్లో ఉన్న హిమ సృహలోకి వచ్చి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతుంది. దాంతో ఇంద్రుడు నువ్వు ఒక లోయలో చెట్టుకు చిక్కుకొని కనిపించావ్ అమ్మ అని చెబుతాడు. ఆ తర్వాత హిమ జరిగినది అంతా గుర్తుతెచ్చుకొని ఏడుస్తుంటే చంద్రమ్మ దగ్గరకు తీసుకొని ఓదార్చు తుంది. మరోవైపు సౌర్య హిమ ఫోటోను బయట విసిరేసి ఆ రాక్షసి గుర్తులు ఏవి ఈ ఇంట్లో ఉండకూడదు అని అంటుంది. దానిని నేను వదిలిపెట్టను నానమ్మ అని సౌర్య అంటుంది.హిమ ఫోటో బయటకు విసిరేస్తున్న సమయంలోనే హిమ ఇంటి బయట ఉంటుంది.

సౌర్య మాటలు విని ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో హిమ:

సౌర్య అన్న మాటలు విని బయటే ఆగిపోతుంది. ఇక సౌర్య.. హిమ అమ్మా నాన్నలను మింగేసిన రాక్షసి అని అంటుంది ఆ మాటలు విని హిమ లోపలికి రాకుండా అక్కడినుంచి బాధతో వెళ్ళిపోతుంది.అయితే దీప వాళ్ళ నాన్న అప్పుడే సౌందర్య ఇంటికి వస్తు ఉంటాడు. వెనుక వైపు నుంచి చూసి అచ్చం హిమలాగా ఉందే అని అనుకుని హిమ అని పిలిచినా వినపడనట్లు వెళ్ళిపోతుంది. ఇక ఇదే విషయాన్నీ సౌందర్య, ఆనందరావులకు చెప్పగా వాళ్ళు షాక్ అవుతారు.

హిమ బతికే ఉందని సౌందర్య,ఆనందరవులకు తెలుస్తుందా..?

ఇంట్లో ఉన్న సిసి టీవీ ఫుటేజ్ చూద్దామని గదిలోకి వెళ్తారు. ఎక్కడ సౌర్య చూస్తుందేమో అన్నా భయంతో డోర్ లాక్ చేసుకుంటారు.సిసి టీవీలో హిమను చూసి షాక్ అవుతారు. కార్తీక్ కు హిమ అంటే ఎంతో ఇష్టం. ఈరోజు వాడు ఇక్కడ లేకపోయినా వాడు ఎంతగానో ప్రేమించే హిమ ఇలా ఎవరు లేని అనాధల ఎక్కడో ఉండడం ఏంటి అని ఏడుస్తుంది. ఎలాగయినా హిమను పట్టుకోవాలి అని అనుకుంటారు సౌందర్య, ఆనందరావులు.. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.!

Related posts

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju