NewsOrbit
న్యూస్ హెల్త్

Summer Drink : ఈ పానీయం కనుక మీరు తాగితే మీ ఒంట్లో ఉన్న వేడి ఇట్టే మాయం అవుతుంది..!

Summer Drink : వేసవి కాలంలో ఎండలు ఎలా వేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా ఎండాకాలం పూర్తిగా మొదలు అవ్వకముందే ఎండలు మండిపోతున్నాయి.కాలు తీసి బయట పెట్టాలంటే చాలు ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాగే ఈ ఎండాకాలంలో శరీరంలో వేడి కూడా పెరిగిపోతుంది.ఆ వేడిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల కూల్ డ్రింక్స్ ను తాగుతూ ఉంటాము.నిజానికి అవి తాగడం వలన కాస్త ఉపశమనం లభించినాగాని అవి ఆరోగ్యానికి మాత్రం అంత మంచివి కావు .

Summer Drink : వేసవి తాపాన్ని తగ్గించే పానీయం

అందుకే వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి మీ ఇంట్లోనే ఒక అద్భుతమైన పానీయం దాగి ఉంది.అదేంటంటే సబ్జా గింజల పానీయం అన్నమాట. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు శరీరంలో బాగా వేడి ఉన్నప్పుడు సబ్జా గింజలను నానబెట్టుకుని, వాటిలో చక్కెర వేసుకుని తాగమని మనకు సలహా ఇచ్చేవారు. అలా తాగితే క్షణాల్లో ఒంట్లో ఉన్న వేడి ఇట్టే మటుమాయం అయిపొతుంది. కానీ ఇప్పుడు అందరు సబ్జా గింజల పానీయాన్ని మర్చిపోయారు. కూల్ డ్రింక్స్ మీద ఆసక్తి ఎక్కువగా కనబరుస్తున్నారు. నిజానికి మన ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా గింజలు ది బెస్ట్ అని చెప్పాలి.మరి సబ్జా గింజల వలన కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దామా.

సబ్జా గింజలతో బరువు తగ్గడం ఎలా అంటే..?

సబ్జా గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం సమస్య అనేది రాదు. అలాగే జీర్ణ క్రియ ప్రక్రియ కూడా సాఫిగా జరుగుతుంది. రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలో పేరుకు పోయి ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి.అధిక బరువుతో ఇబ్బంది పడే వారు సబ్జా గింజల పానీయం తాగితే ఉత్తమ ఫలితాలు పొందుతారు.ఈ సబ్జా గింజల పానీయం తాగడం వలన కడుపు నిండిన భావన కలుగుతుంది కావున తక్కువ ఆహారం తీసుకోగలుగుతారు.అలాగే సబ్జా గింజలలో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

షుగర్ వ్యాధి కంట్రోల్:

సబ్జా గింజలలో చక్కెర వేయకుండా తాగితే మధుమేహం వ్యాధి అదుపులోకి వస్తుంది. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కూడా తగ్గుతాయి.మధుమేహంతో బాధపడేవారు నానబెట్టిన సబ్జా గింజలను ఒక గ్లాసు పచ్చిపాలలో వేసుకొని తాగితే టైప్2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది.కావాలంటే కొద్దిగా బెల్లం కూడా కలుపుకోవచ్చు.ఎండాకాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది కావున సబ్జా గింజల పానీయం తాగితే మంచిది.చిన్న పిల్లలకు సైతం సబ్జా గింజల పానియాన్ని తాగిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలాంటి ఇన్ఫెక్షన్లు పిల్లలకు రాకుండా ఉంటాయి.సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి.

సబ్జా గింజల పానీయం తయారీ ఎలా అంటే..?

ఓ వాటర్ బాటిల్ లో నీళ్లు తీసుకుని అందులో కొంచెం సబ్జా గింజలు వేసి ఒక అరగంట లేదంటే ఒక గంట పాటు నానపెట్టాలి.ఆ తరువాత అవి ఉబ్బి,జెల్లీల మాదిరిగా కనిపిస్తాయి.ఇప్పుడు ఈ సబ్జా గింజలను నిమ్మకాయ, పంచదార వేసుకుని తాగవచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో సబ్జా గింజలను ఫలూదా, ఐస్ క్రీమ్, మిల్క్ షేక్, మజ్జిగ, పలు రకాల స్వీట్లలో ఉపయోగిస్తున్నారు. వీటి వలన వాటికి మంచి రుచి, టెక్చర్ వస్తుంది. సబ్జా గింజలు వేసిన ఈ పదార్థాలు చూడడానికి నోరూరిస్తూ ఉంటాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju