NewsOrbit
రాజ‌కీయాలు

‘ఫణి ముప్పు తప్పిందనుకున్నాను కానీ!’

అమరావతి: ‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వనికే అధికారులు రిపోర్టు చేయాలి. మా ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలున్నాయి. ఎన్నికలు మినహా..మిగతా వ్యవహారాలన్నీ మేమే రివ్యూ చేస్తాం. అధికారులు నాకే రిపోర్టు చేయాలి. వచ్చే వారం కేబినెట్ సమావేశం కూడా పెడతాం. సమీక్షలు, సమావేశాలకు అధికారులు రామంటే కుదరదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై బిజెపి నేతగా మారిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ వేదికగా చలోక్తి విసిరారు.

‘నిన్న ఉదయం ఫణి తుఫాను నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అధికారులకు ముప్పు తప్పిపోయిందని సంతోషపడ్డాను. కానీ ఈ తుఫాను సాయంత్రానికల్లా మంత్రివర్గ సమావేశం రూపంలో అధికారులను వెంటాడుతుందని ఊహించలేకపోయాను’. అంటూ ఐవైఆర్ కృష్ణారావు తన దైన శైలిలో ట్వీట్ చేశారు.

ఐవైఆర్ కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తరువాత బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ బాధ్యతలను నిర్వహించారు. ఆ పదవి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించిన తరువాత ఐవైఆర్ బిజెపిలో చేరారు.

అప్పటి నుండి మీడియాలో వచ్చిన కథనాలు, వార్తలపై ప్రధాన ప్రతిపక్షంకు ధీటుగా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వంపై, చంద్రబాబుపై ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Leave a Comment