NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

భారతీయులను అక్రమంగా అమెరికాలోకి తరలించిన నేరానికి ఓ భారత సంతతి వ్యక్తికి జైలు శిక్ష

ఉబర్ క్యాబ్ సేవల ద్వారా దాదాపు 800 మందికిపైగా భారతీయులను అక్రమంగా అమెరికాలోకి తరలించినందుకు 49 ఏళ్ళ భారత సంతతికి చెందిన వ్యక్తికి అక్కడి కోర్టు మూడేళల్ జైలు శిక్ష విధించింది. కాలిఫోర్నియాలో నివసించే రాజిందర్ పాల్ సింగ్ అలియాస్ జస్ఫాల్ గిల్, మరి కొందరితో కలిసి 800 మందికిపైగా భారతీయులను అక్రమంగా అమెరికాలోకి తరలించాడు. దీని కోసం ఉబర్ సంస్థ క్యాబ్ సేవలను వినియోగించాడు. 2018 జూలై 2022 మే వరకూ రాజిందర్ పాల్ సింగ్ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. కెనడా నుండి ఉత్తర సరిహద్దు మీదుగా సీటెల్ తో పాటు వాషింగ్టన్ స్టేట్ లోని పలు ప్రాంతాలకు ఉబర్ క్యాబ్ ల ద్వారా భారతీయులను అక్రమంగా తరలించాడు.

 

ఈ నేరాలకు సంబంధించి 17 ఉబర్ ఖాతాలను అమెరికా పోలీసులు గుర్తించారు. భారతీయుల అక్రమ తరలింపునకు గానూ ఈ ఖాతాలలో 80వేల కుపైగా అమెరికా డాలర్లను చార్జీలుగా వసూలు చేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. మరో పక్క రాజిందర్ పాల్ సింగ్ నివాసంలో 45వేల అమెరికా డాలర్ల నగదుతో పాటు పలు ఫోర్జరీ పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాషింగ్టన్ కు భద్రాతాపరమైన ముప్పు కలిగించినట్లు కోర్టు ఆరోపించింది.

అలానే ఆమెరికాలోకి అక్రమంగా స్మగ్లింగ్ చేసిన భారతీయులను కూడా అతడు ముప్పులోకి పడేసినట్లు పేర్కొంది. మనీలాండరింగ్ అభియోగాలకు కూడా పాల్పడినట్లు ఆరోపించింది. తన నేరాన్ని ఒప్పుకున్న రాజిందర్ పాల్ సింగ్ కు కోర్టు 45 నెలల జైలు శిక్ష విధించింది. రాజిందర్ పాల్ సింగ్ కాలిఫోర్నియాలో చట్టబద్దంగా నివసించడం లేదని పోలీసుల దర్యాప్తు లో తేలినందున జైలు శిక్ష ముగిసిన తర్వాత అతన్ని అమెరికా నుండి బహిష్కరించే అవకాశాలు ఉన్నట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు.

Related posts

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju