NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

శ్రీచైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు ఇక లేరు

శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు (75) కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఇవేళ అస్వస్థతకు గురి అవ్వడంతో హుటాహుటిన ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చికిత్స అందించినా ఫలితం లేకుండా అయిపోయింది. మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని అంతిమ సంస్కారాల కోసం విజయవాడలోని తాడిగడపకు తరలించారు. డాక్టర్ బీఎస్ రావు కుమార్తె మ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. ఆమె తిరిగి రాగానే బీఎస్ రావు అంత్యక్రియల కార్యక్రమం నిర్వహిస్తారు.

Dr.BS Rao Passed Away

 

డాక్టర్ బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణ రావు కాగా బీఎస్ రావుగా పాపులర్ అయ్యారు. గుంటూరు మెడికల్ కళాశాలలో మెడిసిన్ పూర్తి చేసిన బీఎస్ రావు  ఆ తర్వాత లండన్ లో ఎంఆర్ఎస్‌హెచ్ చదివారు. అక్కడే ప్రాక్టీసు ప్రారంభించిన డాక్టర్ బీఎస్ రావు ఆ తర్వాత ఇరాక్ లో వైద్య సేవలు అందించారు. ఆయన సతీమణి ఝాన్సీ లక్ష్మీబాయి కూడా వైద్యురాలే. దంపతులు ఇద్దరూ విదేశాల్లో మెడికల్ ప్రాక్టీసు అనంతరం 1986 లో స్వదేశానికి తిరిగి వచ్చారు. 1986లో విజయవాడ పోరంకి బాలికల జూనియర్ కళాశాలతో ఆయన శ్రీ చైతన్య పేరుతో విద్యా సంస్థల ప్రస్థానాన్ని ప్రారంబించారు. ఇక్కడి విద్యా సంస్థ అంచెలంచెలుగా ఎదిగి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్ కు కేరాఫ్ అడ్రస్ గా శ్రీ చైతన్య ను మార్చారు.

Dr.BS Rao Passed Away

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఛండీఘర్, రాంచీ, బొకారో, ఇండోర్ లలో బ్రాంచ్ లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శ్రీచైతన్యకు 321 జూనియర్ కళాశాలలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్సీ స్కూళ్లు ఉన్నాయి. శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఎనిమిది లక్షలకు పైగా విద్యార్ధినీ విద్యార్ధులు చదువుతున్నారు. డాక్టర్ బీఆర్ రావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు సీమ, సుష్మ లు ఉండడగా వారికి విద్యాసంస్థల బాధ్యతలను అప్పగించారు. శ్రీ చైతన్య టెక్నో స్కూళ్లకు అకాడమిక్ డైరెక్టర్ గా పెద్ద కుమార్తె సీమ ఉండగా, సంస్థ సీఇఓ గా, అకడమిక్ డైరెక్టర్ గా రెండో కుమార్తె సుష్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా విద్యారంగంలో బీఎస్ రావు చేసిన కృషికి గుర్తింపుగా అనేక అవార్డులు అందుకున్నారు.

NIA Court: హైదరాబాద్ సహా దేశ వ్యాప్త బాంబు పేలుళ్ల కేసులో నలుగురు ఉగ్రవాదులకు పదేళ్ల జైలు శిక్ష

Related posts

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N