NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ టీడీపీలో చేరికకు మూహూర్తం ఫిక్స్ ..? రేపు ఆత్మీయ సమ్మేళనం

కృష్ణాజిల్లా గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీ వీడి టీడీపీ గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న యార్లగడ్డ రాబోయే ఎన్నికల్లో గన్నవరం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో తనపై గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలో చేరడంతో యార్లగడ్డ కు నియోజకవర్గంలో ప్రాధాన్యత తగ్గింది. ఓటమి తర్వాత ఆయనకు కేడీసీసీ చైర్మన్ పదవి లభించినప్పటికీ నియోజకవర్గంలో వైసీపీ నుండి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు కేవలం 990 ఓట్ల తేడాతోనే అప్పటి టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీపై పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత వల్లభనేని టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరడంతో నియోజకవర్గంలో పరిస్థితి యార్లగడ్డ వర్సెస్ వల్లభనేనిగా మారింది.

 

కేడీసీసీ చైర్మన్ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన కొంత కాలం సైలెంట్ గా ఉన్నారు. ఇటీవల సీఎం జగన్ తో యార్లగడ్డ భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. ఈ క్రమంలో పలు మార్లు తన వర్గీయులతో సమావేశాలు నిర్వహించారు యార్లగడ్డ. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలంటే టీడీపీలో చేరడమే మేలన్న అభిప్రాయాన్ని ఆయన సన్నిహితులు సూచించారుట. గన్నవరం టీడీపీ ఇన్ చార్జి గా బాధ్యతలు నిర్వహించిన బచ్చుల అర్జునుడు మృతి తర్వాత ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. దీనికి తోడు టీడీపీ సరైన అభ్యర్ధి కోసం ఎదురుచూస్తొంది. మరో పది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యార్లగడ్డ యాక్టివ్ అవుతున్నారు. గన్నవరం టీడీపీ క్యాడర్ కూడా యార్లగడ్డ చేరికను వ్యతిరేకించడం లేదుట.

 

పార్టీలో చేరితే అభ్యర్ధిత్వం ఖరారు చేసినట్లేనని భావిస్తున్నారు. అందుకే రేపు యార్లగడ్డ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారుట. ఈ సమావేశానికి వైసీపీలోని తన అనుచర వర్గంతో పాటు టీడీపీ నేతలను ఆహ్వానించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 19వ తేదీన నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో లోకేష్ సమక్షంలో పార్టీ లో చేరికకు మూహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇటీవల యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తాను ఓడిపోతే అమెరికా వెళ్లిపోతానని ప్రచారం చేశారనీ, కానీ తన వ్యాపారాల దృష్ట్యా రెండు మూడు సార్లు వెళ్లి వచ్చాననీ, ఇక్కడే ఉంటున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గన్నవరం నుండే పోటీ చేస్తానని తెలిపారు. ఈ తరుణంలో యార్లగడ్డ వెంకట్రావు పార్టీ వీడకుండా వైసీపీ అధిష్టానం ఏమైనా చర్యలు చేపడుతుందా లేక లైట్ తీసుకుంటుందా అనేది వేచి చూడాలి.

Tirumala: తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడి .. నెల్లూరు జిల్లా బాలిక మృతి

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N