Krishnamma Kalipindi Iddarini ఆగస్టు 12 ఎపిసోడ్ 83: కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఈ రోజు ఎపిసోడ్ ఇలా మొదలవుతుంది…మీరు ముడుపు కడుతూ ఉండండి నేను తులాభారం సంగతి చూస్తాను అని అఖిల వాళ్ళ అత్తయ్య అంటుంది. అత్తయ్య నాకు ఒక చిన్న డౌటు ఉంది అంటే కాపురాలు బాగుండాలని కోరుకునే కట్టాలా ఇంకేదైనా అనుకోని కట్టవచ్చా అని అఖిల అడిగింది. ఎందుకు అలా అడుగుతున్నావ్ అని వాళ్ళ అత్తయ్య అంటుంది. ఊరికే అడుగుతున్నాను ఎవరైనా తెలవని వాళ్ళు అడిగితే చెబుదామని అని అఖిల అంటుంది.

ఏ కోరికైనా నెరవేరుతుంది కానీ ఆ కోరికలో స్వార్థం అనేది ఉండకూడదు మీరు తొందరగా ముడుపులు కట్టేసి రండి నేను అక్కడ ఏర్పాట్లు చేస్తాను అని వాళ్ళ అత్తయ్య వెళ్ళిపోతుంది. సరే ఏమండీ మీరు రండి మనం ముడుపులు కడదాం అని అఖిల ఆదిత్యని తీసుకొని వెళ్ళిపోతుంది కానీ గౌరీ ఈశ్వర్ మాత్రం అక్కడే నిలబడిపోతారు. ఆదిత్య అమ్మ నా కారణంగా మా అన్నయ్య కళ్ళు పోయాయి కానీ మా గౌరీ వదిన వల్ల మా అన్నయ్య జీవితంలో సంతోషంగా ఉంటాడు అందుకని వాళ్ళిద్దరినీ చల్లగా చూడు అని ఆదిత్య రాస్తాడు ముడుపు కడతాడు.

దేవుడా ఓ మంచి దేవుడా కుదిరితే గౌరీ కాపురం ముక్కలైపోవాలి 33 ముక్కలు అయిపోవాలి ఆ ఇంటి పెత్తనం అంత నా చేతికి వచ్చి నేను మహారాణిని అయిపోవాలి అని రాస్తుంది అఖిల. ఆదిత్య అఖిల ఇద్దరూ కలిసి ముడుపులు చెట్టుకు కడతారు. అమ్మ కనకదుర్గమ్మ తల్లి నేను ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించాను అనడానికి నువ్వే సాక్ష్యం ఆయనకు నిజం చెప్పకుండా దాచాల్సిన పరిస్థితి వచ్చినందుకు నాలో నేను ఎంతగా కుమిలిపోయానో అది నీకే తెలుసు మనల్ని ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు ద్వేషిస్తుంటే ప్రాణం పోయినట్టు ఉంటుంది ఇప్పుడు నేను అలాంటి బాధని అనుభవిస్తున్నాను ఆయన బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను నేను నా ప్రేమ నిజమని నా భర్తకు తెలిసేలా చేయమ్మా కృష్ణమ్మ సాక్షిగా మమల్ని ఇద్దరినీ కలిపిన నువ్వు నీ సాక్షిగా మమ్మల్ని కలపమ్మ అని గౌరీ రాసి ముడుపు కడుతుంది.

ఏవండీ మీరు ఏమనుకుంటున్నారో చెబితే నేను రాస్తాను అని గౌరీ అంటుంది. మనం ఇద్దరం ఒకటేనని అనుకున్నాను ఇలా వేరువేరుగా రాయాల్సి వస్తుందనే నేనెప్పుడూ అలా అనుకోలేదు భార్యాభర్తల్ని పార్వతీ పరమేశ్వరులతో పోలుస్తారు ఎందుకంటే పార్వతీదేవి పరమేశ్వరుని యజ్ఞానికి ఆహ్వానించలేదన్న కోపంతో అగ్నికి ఆహుతి అయిపోయింది బంధానికి అర్థం కానీ నువ్వు కూడా అలాగే ఉంటావు అనుకున్నాను కానీ ఆ నమ్మకాన్ని నువ్వే పోగొట్టావు అని ఈశ్వర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈశ్వర్ అలా అనగానే గౌరీ అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటుంది.

కట్ చేస్తే తులాభారానికి అన్ని సిద్ధమైపోతాయి. బాబు ఈశ్వర్ గ్లాస్ కి దండం పెట్టుకొని కూర్చో నాయన అని పూజారి గారు అంటారు ఈశ్వర్ రాశికి దండం పెట్టుకొని కూర్చో అని వాళ్ళ అమ్మ అంటుంది. ఎందుకమ్మా ఇవన్నీ అని ఈశ్వర్ అంటాడు. ఎందుకంటావ్ ఏంట్రా ఈ తులాభారం నీకోసమనే ప్రత్యేకంగా మొక్కుకున్న నాన్న అమ్మ గౌరీ ఈశ్వరుని త్రాసులో కూర్చోబెట్టు అని అంటుంది వాళ్ళ అత్తయ్య. ఏవండీ కూర్చోండి అని గౌరీ అంటుంది. ఈశ్వర్ కూర్చోబోతుండగా అఖిల ఆగండి అని అంటుంది. అఖిల ఎందుకలా మాట్లాడుతున్నావ్ ఏమైంది నీకు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. తులాభారం వేస్తానని బావగారికి ఒక్కరికి ఎందుకు మొక్కుకున్నారు మా ఆయనకు ఎందుకు మొక్కుకోలేదు అని అఖిల అడిగింది. అఖిల ఏంటి అత్తయ్య గారిని ఎదురు ప్రశ్నిస్తున్నావు అని గౌరీ అంటుంది.

నువ్వు ఉండమ్మా నేను మాట్లాడుతాను అఖిల నీ భర్త మీద నువ్వు చూపిస్తున్న ప్రేమకి చాలా ముచ్చటేస్తుంది ఎందుకంటే ఈశ్వర్ కోసమే ముక్కుకోవడానికి కారణం ఒకటి ఉంది చెబుతాను విను ఈశ్వర్ కోసం చాలా పెళ్లి సంబంధాలు చూశాను చూపు లేదని కొంతమంది పెళ్లి చేసుకోవడానికి ముందుకి రాలేదు మరి కొంతమంది చూపులేనితనాన్ని అవకాశం తీసుకొని డబ్బు కొట్టేయాలని చూశారు వాడిని వాడిలా అర్థం చేసుకునే అమ్మాయి దేవత లాంటి అమ్మాయి వాడి జీవితంలోకి రావాలని నేను తులాభారం వేస్తానని మొక్కుకున్నాను మీ అక్క గౌరీ రూపంలో ఈశ్వరికి దేవత లాంటి భార్య వచ్చింది ఈ తులాభారాన్ని ఈశ్వర్ కోసమే ఎందుకు వేయించాను ఇప్పటికైనా అర్థమైంది కదా మీ ఆయనకు చేయలేదని నువ్వేం ఫీల్ అవ్వకు అనివాళ్ళ అత్తయ్య అఖిలతో అంటుంది.

గౌరీ ఈశ్వరుని త్రాసులో కూర్చోబెడుతుంది. అమ్మ ఆ స్వామికి నమస్కరించి ఆ బంగారాన్ని త్రాసులు వేయండి అని పూజారి గారు చెబుతారు. సరేనని గౌరీ బంగారం త్రాసులో వేస్తుండగా ఆగమ్మా అని పూజారి గారు అంటారు. ఎందుకు పంతులుగారు ఆగమన్నారు అని వాళ్ళ అత్తయ్య అడిగింది. మీ అబ్బాయికి మంచి భార్య రావాలి అని మీరు కోరుకొని ముక్కు తీరుస్తున్నారు మీ కోడలు మనసులో ఎలాంటి స్వార్థం లేకపోతే మీ అబ్బాయిని నిజంగానే ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఈ తులాభారం తూగుతుంది అతని మనసులో సంతోషం లేకపోయినా నీ కోడలు మనసులో నిజాయితీ లేకపోయినా ఈతుల భారం తూగదు త్రాసులో బంగారం వేసే వాళ్ళు మనసులో దురుద్దేశం ఉంటే ఈ త్రాసు తూగదమ్మా అని పూజారిగారు అంటారు.
పూజారి గారు నా కోడలికి నా కొడుకు అంటే ఎంత ఇష్టమో మీకు తెలియదు తనకి ప్రాణం ఈశ్వర్ అంటే తను నిజాయితీగా ఉంటుంది ఈ తులాభారం కచ్చితంగా తూగుతుంది చూడండి అని వాళ్ళ అత్తయ్య అంటుంది. అమ్మ తను నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది తను నా మీద నిజాయితీగా ప్రేమతో లేదు తనతో నేను జీవితాంతం ఎలా సంతోషంగా ఉంటానమ్మా నువ్వు పడ్డ కష్టమంతా వృధా అయిపోయింది అని ఈశ్వర్ మనసులో అనుకుంటాడు.గౌరీ అమ్మ కనకదుర్గమ్మ నేను ఆయనతో వందేళ్ళ జీవితాన్ని గడపడానికి ఈ పరీక్ష ఈ పరీక్షలో నేను నెగ్గాలి నా ప్రేమని ఆయనకు అర్థమయ్యేలా చేస్తావని అనుకుంటున్నాను అని గౌరీ మనసులో అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. వాళ్ళ అత్తయ్య గౌరీ బంగారం త్రాసులో వేయమ్మా అని అంటుంది. సరే అత్తయ్య అని గౌరీ బంగారం తీసి త్రాసులో వేస్తుంది బంగారం అంతా త్రాసులు వేసిన గాని త్రాసు లేవదు దానితో గౌరీకి ఆశ్చర్యం వేస్తుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది రేపు ఏం జరుగుతుందో చూద్దాం.