NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: తన పర్యటనలో ఆంక్షలు పెడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం

Pawan Kalyan: రాష్ట్రంలో నేరగాళ్లపై ఆంక్షలు లేవు కానీ తన పర్యటనపై ఆంక్షలు విధిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో విడత వారాహి యాత్ర లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తున్నారు. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ పెద్ద సంఖ్యలో అభిమానులు రోడ్ల మీదకు వచ్చి అడుగడుగునా పవన్ కు స్వాగతం పలికారు. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ లో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన కోటగిరి వరలక్ష్మి కుటుంబాన్ని శనివారం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓ వృద్ధురాలిని బంగారు ఆభరణాల కోసం వాలంటీర్ హత్య చేసి పది రోజులు కావొస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం తరపున ఒక్కరూ ఆమె కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. పాలకుల ఆలోచనా విధానం ఏమిటో ఈ విషయంలోనే అర్ధమవుతోందన్నారు.

 

వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ వ్యవస్థలోని కొంత మంది నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. పాస్ పోర్టు కావాలన్నా, చిన్న పాటి ఉద్యోగానికైనా పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. కానీ వాలంటీర్ అనే ఈ సమాంతర వ్యవస్థలో ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఎందుకు పోలీస్ వెరిఫికేషన్ చేయడం లేదని పవన్ ప్రశ్నించారు. వైసీపీ తన కోసం వినియోగించుకునే వ్యవస్థను నిబంధనలు గాలికి వదిలి తయారు చేస్తొందని విమర్శించారు. ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్న వాలంటీర్లు అసలు ఎలాంటి వారో కూడా చూడకుండానే వారిని నియమించడం ఎంత వరకు సబబు అని పవన్ ప్రశ్నించారు.

 

వాలంటీర్ల ముసుగులో కొందరు చేస్తున్న దురాగతాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయని తెలిపారు. వీరిపై పర్యవేక్షణ లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో వారు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలను సక్రమంగా పని చేయిస్తే నేరాలు జరగవన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తగా విఫలం అయ్యాయని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30వేల మంది మహిళలు అదృశ్యమైయ్యారని తాను మాట్లాడితే అధికార పార్టీ నేతలు తనపై విరుచుకుపడ్డారనీ, పార్లమెంట్ సాక్షిగా తాను చెప్పింది నిజమని తేలిందన్నారు. అసలు చిన్నారుల అక్రమ రవాణాకు మూలం ఏమిటో..? మాయమైన చిన్నారులు ఏమవుతున్నారో ..? కుడా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు.

 

రాష్ట్రంలో వ్యవస్థలు సక్రమంగా పని చేయనిస్తే ఇలాంటి నేరాలే జరగవని అన్నారు. వ్యవస్థలను బలోపేతం చేసి శాంతి భద్రతలను కాపాడటమే జనసేన లక్ష్యమని అన్నారు. కాగా సింహాచలం, వేపగుంట, సుజాతనగర్ కూడళ్లలో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. మార్గ మధ్యలో పలువురు పవన్ కళ్యాణ్ కు సమస్యలపై వినతి పత్రాలను సమర్పించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. రాష్ట్రంలో గ్రీన్ టాక్స్ పేరిట జరుగుతున్న దోపిడీని ట్రక్ డ్రైవర్ అప్పలరాజు పవన్ కళ్యాణ్ కు వివరించారు.

 గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ టీడీపీలో చేరికకు మూహూర్తం ఫిక్స్ ..? రేపు ఆత్మీయ సమ్మేళనం

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N