Janaki Kalaganaledu ఆగస్టు 12 ఎపిసోడ్ 656: అన్నయ్య త్వరగా కానీ అని అఖిల్ అనడం తో జానకి కలగనలేది ఈరోజు ఎపిసోడ్ మొదలవుతుంది…కానిస్తున్నాను రా చూస్తూనే ఉన్నావుగా, అని వాళ్ళ అన్నయ్య అంటాడు. అబ్బబ్బ…ఏం చేస్తున్నారురా, చేయండి చేయండి, అని వాళ్ళ నాన్నగారు అక్కడికి వచ్చి అంటాడు. అలా చూస్తూ ఉండకపోతే నువ్వు కూడా వొచ్చి సహాయం చేయొచ్చుగా నాన్న అని వాళ్ళ నాన్నగారిని అడుగుతాడు అఖిల్. మగ పెళ్లి వారు వచ్చే టైం అయింది చానా పనులు ఉన్నాయి కానివ్వండి అని అక్కడనుండి వెళ్లిపోతాడు వాళ్ళ నాన్న. వెన్నెలమ్మకు పెళ్లి అవగానే నాకు కూడా చేసేయండి బాబు గారు అని మలయాళం అంటాడు, అలాగే లేరా చేద్దాంలే నీ పెళ్లి కూడా, అని రామా అంటాడు.

ఒరేయ్ కానివ్వండిరా మొగ పెళ్లి వారు వచ్చే టైం కి పంతులుగారు రాకపోతే మీ అమ్మ మంత్రాలు అందుకుంటుంది అని వాళ్ళ నాన్న గోవిందరాజు అంటాడు. ఏంటండీ నా గురించి ఏదో చెబుతున్నారు అని జ్ఞానాంబ అంటుంది. నువ్వు వస్తే పంతులుగారు ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది అంతే నీ వల్ల ఆయన అంటాడు. ఒరేయ్ ఆయన అలాగే మాట్లాడుతూ ఉంటాడు కానీ మీరు కానివ్వండి అని జ్ఞానంబ అంటుంది.

కట్ చేస్తే అందరూ కలిసి వెన్నెల్ని రెడీ చేస్తూ ఉంటారు అవును పెద్ద వదిన కిషోర్ వాళ్ళు బయలుదేరారు అంటావా అని వెన్నెల అంటుంది చూసావా అక్క వాళ్ళ అత్తగారి గురించి ఎలా పట్టించుకుంటుందో అని జెస్సి అంటుంది పో వదిన నువ్వు ఎప్పుడు అలాగే అంటావు అని వెన్నెల అంటుంది. ఇంతలో పంతులుగారు వచ్చేస్తాడు మా ఆవిడ మగ పెళ్లి వారు రాలేదని కంగారు పడడం మానేసి మీరు ఇంకా రాలేదని కంగారు పడుతుంది అని జ్ఞానాంబ వాళ్ళ ఆయన అంటాడు. ట్రాఫిక్ లో ఇరికి పోయానండి నన్నేం చేయమంటారు అని పంతులుగారు అంటాడు. ఎప్పుడు చెప్పే సాకేనా ఇంకా ఏదైనా చెప్పొచ్చుగా అని జ్ఞానంబ వాళ్ళ ఆయన అంటాడు. అబ్బ మీతో తట్టుకోవడం కష్టమండి జ్ఞానాంబ గారు ఎలా తట్టుకుంటున్నారో అని పూజారి గారు అంటారు.

పంతులుగారు మీరైనా గమనించారు అని జ్ఞానాంబ అంటుంది.కట్ చేస్తే పెళ్లి వారు వస్తారు రండి రండి మీకోసం ఎదురు చూస్తున్నాం అని రామ అంటాడు. పెళ్లి వారు వచ్చి ఇంట్లో కూర్చుంటారు పెళ్లికూతురు ఎక్కడ అని వాళ్ళ అత్తయ్య అడుగుతుంది. రెడీ అవుతుంది లోపల వస్తుందిలే అని జ్ఞానంబ అంటుంది. మీరందరూ ఇక్కడ ఉంటే వెన్నెల మాత్రం ఒక్కతి అక్కడ ఏం చేస్తుంది తీసుకురండి అని కిషోర్ అంటాడు. జెస్సి వెళ్లి తీసుకురా అని జానకి అంటుంది. వెన్నెల కాఫీ తీసుకొచ్చి అందరికీ ఇస్తుంది కాఫీ తీసుకుంటుండగా పెళ్లి కొడుకు మీద కాఫీ పడుతుంది. అయ్యో చూసుకోలేదండి సారీ అని వెన్నెల అంటుంది.

పర్వాలేదు నేను వెళ్లి కడుక్కొని వస్తాను అని కిషోర్ వెళ్ళిపోతాడు. ఇంతలో జానకికి ఫోన్ వస్తుంది మీరు తొందరగా ఆఫీస్ కి రండి మేడం అని ఫోన్ చేస్తారు ఇప్పుడు ఎలా రాను మా ఆడపడుచు పెళ్లి చూపులు అని జానకి అంటుంది. జానకి నువ్వు ఇప్పుడు ఆఫీస్ కి వెళ్లడానికి వీల్లేదు పెళ్లిచూపులు అయ్యేంతవరకు ఇక్కడే ఉండాలి అని జ్ఞానంబ అంటుంది. ఒక్క నిమిషం నేను ఫోన్ మాట్లాడి వచ్చేస్తాను అని జానకి పక్కకి వెళ్ళిపోతుంది. ఏంటి నేను రాకుండా నిశ్చితార్థం అయిపోయిందా అని లీలావతి అంటుంది.

ఇంకెక్కడ పెద్దమ్మ అవలేదు ఇలా రా అని మల్లిక పిలుస్తుంది. రామ కిషోర్ ని పక్కకు తీసుకువచ్చి కడుక్కోండి బావగారు మా చెల్లెలు తరఫున నేను సారీ చెప్తున్నాను ఏమి అనుకోకండి అని రామా అంటాడు. ఇంత చిన్న విషయానికి క్షమాపణలు ఎందుకు అయినా తప్పు నాది కప్పు సరిగా పట్టుకోలేదు అని కిషోర్ అంటాడు. అయినా కాఫీ పడ్డ చొక్కని వేసుకోవాలా ఇంకో షర్టు వేసుకోవచ్చుగా అని రామా అంటారు. అది కాదు ఇది వెన్నెల కొనిచ్చిన షర్టు అందుకనే వేసుకున్నాను అని కిషోర్ అంటాడు. అయితే సరే వేసుకోండి అని రామ అంటాడు. పక్కనే జానకి ఫోన్ మాట్లాడుతుంది ఆ టెర్రరిస్ట్ కి భుజం మీద ఒక టాటూ ఉంటుంది అని ఫోన్ లో అంటుంది.

కిషోర్ షర్టు వేసుకొని వెళ్ళిపోతుండగా జానకి కనిపించింది ఏంటి సిస్టర్ టెన్షన్ గా ఉన్నారు అని కిషోర్ అడుగుతాడు. ఏమీ లేదు అని జానకి అంటుంది. ఏం లేదు బావ గారు ఎవరో టెర్రరిస్ట్ తప్పించుకుని ఈ ఊర్లోనే తిరుగుతున్నాడంట అని రామ అంటాడు. జాగ్రత్త చెల్లెమ్మ హంతకుడు ఎంతకైనా తెగిస్తాడు అని కిషోర్ అంటాడు. ఐపీఎస్ చదువుకున్నది దొంగలకి భయపడి పారిపోవడానికి కాదు అని జానకి అంటుంది.వాళ్లు లొంగరు చెల్లెమ్మ ఎందుకంటే వాళ్ళ లక్షలు వాళ్లకు ఉంటాయి అని కిషోర్ అంటాడు. లొంగకపోతే నే కదా ఇద్దరు టెర్రరిస్టులు నా చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు అని జానకి అంటుంది. ఏదో ఒకసారి మనం కొన్న లాటరీ టికెట్ కు డబ్బులు వచ్చాయి కదా అని ప్రతిసారి అలా జరగదు కదా చెల్లెమ్మ అని కిషోర్ అంటాడు.

ఎందుకు మీరు టెర్రరిస్ట్ వైపు మాట్లాడుతున్నారు అని జానకి అంటుంది. అయ్యో నేను మాట్లాడింది నీకోసమే చెల్లె అయినా టెర్రరిస్టులు ఎక్కడో దొరికిపోవడం లేదు వాళ్లను పట్టుకోవడం చాలెంజ్ అని కిషోర్ అంటారు. వాళ్ళని పట్టుకుని తీరుతాను అని జానకి అంటుంది. ఆల్ ద బెస్ట్ చెల్లెమ్మ అని కిషోర్ అంటాడు. ఇక పదండి ముహూర్తానికి టైం అవుతుంది అని రామ వాళ్ళిద్దరినీ తీసుకువెళ్తాడు. కట్ చేస్తే అందరూ ఎంగేజ్మెంట్ దగ్గర కూర్చుంటారు అయ్యా పూజా కార్యక్రమం ఇంతటితో అయిపోయింది మీరు ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి అని పంతులుగారు చెప్పారు తాంబూలాలు మార్చుకున్న తర్వాత బాబు మీరిద్దరూ ఉంగరాలు మార్చుకోండి అని పంతులుగారు అంటాడు. ఉంగరాలు మార్చుకున్న తర్వాత అందరూ అక్షింతలు వేస్తారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా చెల్లెలు కళ్ళల్లో సంతోషం కనిపిస్తుంది కానీ మీ కళ్ళలో ఏంటండీ టెన్షన్ కనిపిస్తుంది అని రామా అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ మూసింది మల్లి రేపు ఏం జరుగుతుందో చూద్దాం