Janaki Kalaganaledu: జానకి జానకి అని జ్ఞానాంబ పిలుస్తుంది. వస్తున్నాము అత్తయ్య గారు అంటుంది. వెన్నెల వచ్చి కూర్చుంటుంది. అబ్బాయి ఎందుకు మాట్లాడట్లేదు అని మల్లిక అడుగుతుంది. వాడంతేనమ్మ మొహమాటం ఎక్కువ అని కిషోర్ వాళ్ళ నాన్న అంటాడు. మా వెన్నెలకి ఏమాత్రం మొహమాటం ఉండదు అని మల్లిక అంటుంది. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానీ బుద్ధిమంతురాలు ఇల్లు కాలేజ్ తప్ప వేరే ఏమీ తెలీదు ఇంటి పనులన్నీ వచ్చు అని జ్ఞానంబ అంటుంది. వంటలు ఏమి రాకపోయినా పర్లేదు నేను నేర్పిస్తానమ్మ. మా అబ్బాయి నీకు నచ్చాడా అమ్మ అని అడుగుతుంది. నచ్చాడు అని చెప్తుంది వెన్నెల. పెళ్ళికొడుకుతో ఏమైనా మాట్లాడాలనుకుంటే పక్కకెళ్ళి మాట్లాడండి అని జానకి అంటుంది. మా పెద్దబ్బాయి వస్తున్నాడు వాడు వచ్చాక మాట్లాడుకుందాం అంటాడు జ్ఞానాంబ వాళ్ల భర్త. ఇంతలో రామ వస్తాడు.

ఇంతలో కిషోర్ ఇంకా వెన్నెల వస్తారు. ఒకరోజు ఒక పెద్దాయనను గుద్ది పారిపోయాడని చెప్పాను చూడండి అతను ఇతనే అంటాడు రామ. ఇప్పుడు ఆ విషయాలు ఏమి ఎత్తోద్దు అంటుంది జానకి. మానవత్వం లేని మనిషి ఈ ఇంటికి అల్లుడు కాకూడదు. వీళ్ళ మధ్యన ఏదో ఘర్షణ జరుగుతుంది అని మల్లిక తన మనసులో అనుకుంటుంది. ముందు నేను వీడితో మాట్లాడాలి అని రామా అంటాడు. వీడు అంటావ్ ఏంట్రా ఆ అబ్బాయి ఈ ఇంటికి కాబోయే అల్లుడు. ఎవడు పడితే వాడు ఈ ఇంటికి అల్లుడు కాలేడమ్మా అర్హత ఉండాలి అని రామా అంటాడు. మా వాడికి ఏం తక్కువ అని అంటాడు వాళ్ళ నాన్న. మానవత్వం అని రామా అంటాడు. నావల్ల ఏం జరిగిందో చెప్తారా అని కిషోర్ అంటాడు. నువ్వు ఒక రోజు ఒక పెద్దయనని గుద్దేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయావు.మానవత్వం ఉన్న ఎవడు అలా చేయడు. నీ స్థానంలో ఎవరు ఉన్నా ఆయనని హాస్పిటల్ తీసుకెళ్లేవారు.

మాట్లాడకు నీలాంటి వాడిని ఇంట్లో కూర్చోబెట్టుకోవడమే ఎక్కువ బయటికి పో అని రామా అంటాడు. ఇతను నీకు తగినవాడు కాదమ్మా ఇతన్ని చేసుకుంటే నువ్వు సుఖపల్లేవు. అమ్మ నాన్న వెంటనే వీళ్ళను వెళ్ళిపోమని చెప్పండి ఆ ప్రమాదం నేను చూశాను కాబట్టి సరిపోయింది వీడి గురించి తెలిసింది ఈ సంబంధం గురించి ఆలోచించాల్సిన పనిలేదు నా చెల్లిని పెళ్లి చేసుకునే వాడు బుద్ధిమంతుడై ఉండాలి ఇలాంటి దగులు బాజీ కాదు వెళ్తారా లేదా అంటాడు రామ. నాన్న పదండి అంటాడు కిషోర్. అదేదో పీటల మీద సంబంధం చెడిపోయినట్టు ఎందుకలా ఏడుస్తుంది గండం గడిచినందుకు సంతోషపడాలి కానీ అని మల్లిక అనుకుంటుంది. కట్ చేస్తే,ఉన్న ఊర్లో సంబంధం ఆడపడుచు లేని సంబంధం అంటూ చంకలు గుద్దుకుంటూ రమ్మన్నారు చూశారుగా చివరికి ఏమైందో అని జ్ఞానంబ అంటుంది. నేను తీసుకొచ్చింది మంచి సంబంధం అని జ్ఞానాంబ వాళ్ళ భర్త అంటాడు. ఎంతైనా రామ చేసింది తప్పే ఇంటికి వచ్చిన వాళ్లతో అలా ప్రవర్తించడం పద్ధతి అదేనా ఏదైనా సమస్య ఉంటే వాళ్లని అడగాలి సమాధానం తెలుసుకోవాలి అప్పటికి నచ్చకపోతే మర్యాదగా చెప్పాలి అంతేకానీ మగ పెళ్లి వాళ్ళ పైకి అలా ఎగబడతారా రేపు మన గురించి బయట చెడుగా ప్రచారం చేస్తే అసలు సంబంధాలే రావు కనీసం నువ్వైనా రామా ని ఆపాల్సింది.

అబ్బాయి బాగుంటే సరిపోదు గుణం బాగుండాలి కదా నా ఓటు రామాకే ఈ సంబంధం గురించి మర్చిపోండి రేపో మాపో నేను మా వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి జ్ఞానాంబ వెళ్లిపోతుంది.కట్ చేస్తే,మనిషన్నాక జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తాడు అంతమాత్రాన ఆ మనిషి దుర్మార్గుడు అయిపోతాడా ఎందుకు పనికిరాని వాడు అయిపోతాడా కిషోర్ చేసింది అంత పెద్ద తప్ప ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏ తప్పు చేయని వాళ్లేనా అందరం కలిసి ఉండడం లేదా ఆ మాటకొస్తే పెద్దన్నయ్య అమ్మకు తెలియకుండా నిన్ను ఐపీఎస్ చదివించాడు అది తప్పు కాదా అమ్మ పెద్దన్నయ్యని క్షమించ లేదా తన దగ్గరికి వచ్చేసరికి ఒక రూల్ నాకు ఒక రూలా ఎందుకు పెద్ద వదిన అన్నయ్యని నువ్వు నిలదీయలేదు అని వెన్నెల అంటుంది. ఏ ముఖం పెట్టుకొని కిషోర్ ని కలవను ఈరోజుతో మా బంధం తెగిపోయినట్టే కదా.

అలా ఎందుకు అనుకుంటున్నావు వెన్నెల అని జానకి అంటుంది. పెద్దన్నయ్య చెప్పాక సిగ్గు లేకుండా కిషోర్ ఎలా కలుస్తాడు.మిమ్మల్ని గౌరవించి పెళ్లి చేసుకోను కానీ జీవితంలో మళ్లీ పెళ్లి మాట ఎత్తను ఇలాగే ఉండిపోతాను, ఈ విషయంలో మాత్రం నేను ఎవరి మాట వినను పెద్దన్నయ్య కి చెప్పు ఇంతలో కిషోర్ కాల్ చేస్తాడు ఏం చేయను అని అడుగుతుంది వెన్నెల. వెన్నెల సారీ నిన్ను బాధ పెట్టాను మీ వదిన నాకు బంగారం లాంటి అవకాశం దొరికేలా చేసింది కానీ నిలబెట్టుకోలేకపోయాను నిన్ను నిరాశపరిచాను ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను అని కిషోర్ అంటాడు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు కిషోర్ పెద్దరికంతో మా వదిన ఏది చెప్తే అది చేద్దాం. సిస్టర్ తప్పంతా నాదే నన్ను క్షమించలేరా అసలు ఆ రోజు ఏం జరిగిందంటే మా నాన్నగారికి సీరియస్ చెస్ట్ పెయిన్ అని ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది దాని గురించి ఆలోచిస్తూ ఫాస్ట్గా వెళ్లాను ఎవరో పెద్దాయనకి డాష్ ఇచ్చాను అని స్పృహలో కూడా నేను లేను నా ఆలోచనలు అన్ని మా నాన్న చుట్టూనే తిరిగాయి ఆరోజు నేను కానీ మధ్యలో ఆగి ఉంటే మా నాన్నని రక్షించుకొని ఉండేవాడిని కాదు అని కిషోర్ అంటాడు.

ఆ మాట ఇంతకుముందు చెప్పలేదు ఏంటి అని జానకి అంటుంది. నాకు రాము గారిని చూస్తే భయమేసింది పరిస్థితి అర్థం కాక వచ్చేసాను మీరు నన్ను వెన్నెలని ఒకటి చేసి పుణ్యం కట్టుకోండి కావాలంటే రామా గారికి సారీ చెప్పమన్నా చెప్తాను దయచేసి నన్ను వెన్నెలను విడదీయొద్దు వెన్నెల లేకపోతే నాకు జీవితమే లేదు జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండిపోతాను అని కిషోర్ అంటాడు.నేను ఇంట్లో వాళ్లకి నచ్చ చెప్పి మళ్ళీ కాల్ చేస్తాను అని జానకి ఫోన్ కట్ చేస్తుంది. ఇంకొకసారి నా ప్రయత్నం నేను చేస్తాను అని జానకి వెళ్ళిపోతుంది