Ennenno Janmala Bandham ఆగస్టు 10 ఎపిసోడ్ 474: టెన్షన్ లో తిండి మానేయకండి, తినిపిస్తాను తినండి సరేనా, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను నా చేతి వంట బాగుంటుందని చెప్పారు కదా అందుకని గుర్తొచ్చింది, అందుకే మీకు ఇష్టమైనవన్నీ చేసి తీసుకొచ్చాను. తినండి అని తినిపిస్తుంది వేద. నువ్వు తిన్నావా నువ్వు తినకుండా నాకెలా తృప్తిగా ఉంటుంది వేదా అంటాడు యశ్ నేను తినిపిస్తానని తినిపిస్తాడు యష్. చాలు చాలు నేను తినిపిస్తాను అంటుంది వేద. ఏసీపీ వస్తుంది వాళ్లు తినిపించుకోవడం చూసి ఏంటి రాజుగారు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటుంది మీరు డ్యూటీ లోనే ఉన్నారా లేక లోపల ఉండాల్సిన వాళ్ళు బయటికి వస్తే ఏం జరుగుతుందో మీకు తెలియదా.

స్టేషన్ ని హోటల్ గానూ రెస్టారెంట్ గాను మార్చేసేయండి కుటుంబాలు కుటుంబాలు కలిసొచ్చి ఇక్కడే వండుకొని వడ్డించుకుంటారు రాజుగారు మీకు ప్రేమలు ఎక్కువ అవుతున్నాయి కొంచెం తగ్గించుకోండి అని వెళ్ళిపోతుంది. ఆవిడ గురించి మీకు తెలియదు బయట కఠినం మనసు వెన్న మీరు కానివ్వండి అంటాడు రాజు గారు. బయటకు వచ్చేస్తుంది. అభి కారులో వస్తాడు. జరిగింది విన్న తర్వాత చాలా బాధేసింది మిమ్మల్ని అలా చూస్తుంటే బాధ రెట్టింపు అవుతుంది తెల్ల కోటు మెడలో సెటస్కోప్ కూల్ గా హాస్పటల్ మెట్ల ఎక్కే మీరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతూ దిగుతూ పరాభావంతో తిరుగుతూ అబ్బబ్బ తలుచుకుంటే నాకే ఇంత బాధగా ఉంది

నీకైతే గుండెలు పిండేసినట్టుగా ఉంటుంది సారీ వేదస్విని గారు కొంతమంది బాధని అనుభవించడానికి మాత్రమే పుడతారు అనుకుంటా మీలాగా నేనేమి పర్సనల్ లైఫ్ టచ్ చేయడం లేదు ఇప్పుడు మీ లైఫ్ పబ్లిక్ అయిపోయింది కదా మాళవిక హత్య హత్య చేసిన యష్ మీకు ఒక మాట చెప్పనా మీ కన్నా నాకే ఎక్కువ యశ్ గురించి తెలుసు అనవసరమైన ఆవేశాలకు పోయి గొంతు మీదికి తెచ్చుకుంటాడు సరేలెండి ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ జరగాల్సింది ఏంటో చూడాలి యష్ బయటపడాలి అదే మీ ధ్యేయం నీ లక్ష్యం అని బాగా తెలుసు కానీ బయట పడతాడా అనేదే నా డౌట్ నాకు కూడా చాలా బాధగా ఉంది ఒకటి మాళవిక చనిపోయినందుకు సారీ మాళవిక చంపబడినందుకు ఎంతైనా మీ సవతి యశ్ మొదటి భార్య ఒకప్పటి నా సోల్మెట్ సరే పోయిన వాళ్ళు ఎటు తిరిగి రారు ఉన్నవాళ్లయిన సుఖంగా ఉన్నారా అంటే అదీ లేదు నేనంటున్నానని కాదు గాని మీరు చాలా పొరపాటు చేశారు

మేడం సవతిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవడం ఏంటండీ అమాయకత్వం కాకపోతే మగబుద్ధి మీకు తెలియదు లేండి, నిన్నటి వరకు సాయం చేసిన చేతులు ఇప్పుడు దేహి అంటూ సహాయం అడుగుతున్న చేతులు నా హెల్ప్ అడుగుతున్నారని కాదు నాలా పాట్లు పడుతున్నారంటే, అందుకే వెళ్లిపోయిన మాళవికకి నా ప్రగాఢ సంతాపం కళ్ళముందున్న వేద గారికి నా ప్రగాఢ సానుభూతి,అన్ని నేనే మాట్లాడిస్తున్నాను మీరేం మాట్లాడట్లేదు మాట్లాడే పొజిషన్ కాదు కదా మీది అని అంటాడు అభి.థాంక్యూ వెరీ మచ్ మిస్టర్ అభిమన్యు, అవును అభిమన్యు గారు సతుల కథలు పాత కథలు మీకు లైవ్ లో కనిపిస్తున్నాయి కదా ఏ కథలో అయినా అంతమంగ గెలిచిందెవరు మంచి వాళ్లే కదా మంచి ముగింపు అని వేద వెళ్లిపోతుంది. అభి యశ్ దగ్గరికి వస్తాడు, అయినా ఇలాంటి పని చేసావ్ ఏంటి బ్రో ఏంటి కోపం వస్తుందా దేనికి బ్రో అంటున్నందుకా మరి నువ్వు నాకు బ్రో వే కదా మన మధ్య బ్లడ్ రిలేషన్ లేకపోయినా కానీ నిన్ను వదిలేసి నా దగ్గరికి వచ్చిన మాళవిక నాతో కాపురం చేసింది కదా బ్రో కనుక నీది పెద్దన్న పాత్ర అన్నమాట కానీ నాదొక డౌటు ఇలాంటి చెత్త పని చేశావు ఏంటి బ్రో పోయి పోయి ఒక ఆడదాన్ని చంపావ్ ఏంటి చండాలంగా అని అభి అంటాడు. రేయ్ ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటాడు. జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా ఎందుకు వస్తారు చూసి కాస్తంత ధైర్యం చెప్పి సానుభూతి చూపించి వెళ్దాము అని వస్తారు సన్మానం చేయడానికి వస్తారా అయినా మాళవికని చంపేసేంతవరకు ఎందుకు వెళ్లావు బ్రో.

నేను చంపలేదు ఆ హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని యష్ అంటాడు. ఇప్పుడే లోపలికి వస్తుంటే మీ ఆవిడ వేదస్విని కనిపించింది, తనది నీది ఒకటే మాట పుక్కిటి పురాణాల బాట అవన్నీ ఈ కాలంలో పనిచేయవు, నువ్వేమో జైల్లో జైలు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మీ ఆవిడ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అని శోక సంద్రాలు ఏంటి ఈ కర్మ నీకు, నీకు మాళవికకు పడలేదు అనుకో నా దగ్గరికి పంపిస్తే సరిపోయేది కదా అనవసరంగా చంపడం ఏంటి బ్రో, యశ్ నువ్వేమైనా పులి అనుకుంటున్నావా, ఇదేమైనా నీ ఇళ్లు మీ అత్తారిల్లు అనుకుంటున్నావా నువ్వు నా ఇంటికి వచ్చి నా మీద చేయి చేసుకున్నప్పుడు ఎందుకు సైలెంట్ గా ఊరుకున్నాను ఇలాంటి క్షణం కోసమే, నీ అదృష్టం బాగుంటే ఉరిశిక్షపడి ఈ బాధలన్నీ లేకుండా పోతావ్, పై లోకంలో ఉన్న మాళవిక దగ్గరికి లేదంటే జైల్లోనే మగ్గిపోతావ్, నీ పిల్లలు నీ భార్య నీ ఫ్యామిలీ వాళ్లకి దిక్కెవరో తలుచుకుంటేనే బాధనిపిస్తుంది.

రేయ్ నిన్ను ప్రాణాలతో వదలను రా అని గొంతు పట్టుకుంటాడు యష్. హెల్ప్ హెల్ప్ అని అభి అరుస్తాడు. ఏసీపి వాళ్లు వస్తారు, నువ్వు పోలీస్ కస్టడీలో ఉన్నావని మర్చిపోతే మేము కూడా మా లిమిట్స్ మర్చిపోవాల్సి వస్తుంది, మా ముందే ఇంకో మర్డర్ చేయాలని చూస్తున్నావా.వేద ఇంటికి వచ్చేస్తుంది. అమ్మ వేద ఏదో చెప్పాలనుకున్నాను మర్చిపోయాను అని వాళ్ళ నాన్న అంటాడు. చిన్నపిల్లలు తెలిసో తెలియకో అబద్దాలు చెప్తుంటారు పెద్దవాళ్లు సరిదిద్దుతుంటారు కానీ పెద్దవాళ్ళే అబద్ధాలు చెప్తే అని వేద అంటుంది. మాళవిక హత్య జరిగిన రోజు అల్లుడుగారు కోపంతో బయటికి వెళ్లడం నేను చూశానమ్మా అని వాళ్ళ నాన్న అంటాడు.