NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: చంద్రబాబు కేసుల్లో ఇవేళ ఏమి జరగబోతోంది ..? సర్వత్రా టెన్షన్..టెన్షన్..!!

Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ రోజు అత్యంత కీలకం కానుంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో నెల రోజులుగా   చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. ఈ రోజు న్యాయస్థానాల నుండి తీర్పులు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు ఈ రోజు అనుకూల తీర్పు వస్తుందా .. రాదా అనే టెన్షన్ టీడీపీ శ్రేణుల్లో, ఆ పార్టీ అభిమానుల్లో నెలకొంది. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబు తొలి సారిగా జైలు గోడల మధ్య నెల రోజుల పాటు ఉండిపోవడం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

దిగువ కోర్టు నుండి దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ, తీర్పులు ఈ రోజు ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ తన పై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని సుప్రీం కోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై ఇవేళ విచారణ జరగనుంది. చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, అభిషేక్ మను సింగ్వీ, సిద్ధార్థ్ లూథ్రాలు, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్ లు వాదించనున్నారు.

అవినీతి నిరోధక చట్టం 17 ఏ చంద్రబాబు కేసులో వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు, చంద్రబాబుకు వర్తించదని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఇదే క్రమంలో అవినీతి నిరోధక చట్టం 17ఏ (1) రాజ్యాంగ బద్దతను సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 20వ తేదీ విచారణకు రావడంతో దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

chandrababu reaction about CID comments
chandrababu

ఇటు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు తీర్పు వెల్లడికానుంది. అలానే చంద్రబాబును సీఐడీ కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్ పై కూడా ఏసీబీ కోర్టు ఇవేళే ఉత్తర్వులు జారీ చేయనున్నది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం ఏబీసీ కోర్టులో వాదనలు ముగియగా, ఉత్తర్వులను సోమవారం (ఈరోజు) వెల్లడిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.

మరో పక్క చంద్రబాబుకు సంబంధించి మూడు బెయిల్ పిటిషన్ల పై ఏపీ హైకోర్టు ఈరోజు తీర్పులు వెల్లడించనుంది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు ఘటన, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిల్ కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి తీర్పులను రిజర్వు చేశారు. ఈ మూడు పిటిషన్ల పైనా ఇవేళే తీర్పులు రానున్నాయి.

IND Vs AUS: వరల్డ్ కప్ లో శుభారంభం చేసిన భారత్..ఆస్ట్రిలియాపై విజయం .. హాఫ్ సెంటరీలతో దంచికొట్టిన కోహ్లీ, రాహుల్

Related posts

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju