NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

IND Vs AUS: వరల్డ్ కప్ లో శుభారంభం చేసిన భారత్..ఆస్ట్రిలియాపై విజయం .. హాఫ్ సెంటరీలతో దంచికొట్టిన కోహ్లీ, రాహుల్

IND Vs AUS: వరల్డ్ కప్ 2023 లో భారత్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం చెనైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రిలియా పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత ఫీల్డింగ్ చేసింది. ఈ క్రమంలో జస్ ప్రీత్ బుమ్రా మూడో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ మిచెల్ మార్ష్ ను  డకౌట్ చేసి శుభారంగం అందించుడ. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ డేవిడ్ వార్నర్ (41) వికెట్ తీశాడు. అనంతరం 27.1 ఓవర్లో రవీంద్ర జడేజా స్టివ్ స్మిత్ (46) ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 30వ ఓవర్ రెండో బంతికి మార్నస్ లబుషేన్ ను కూడా పెవిలియన్ కు పంపారు. అదే ఓవర్ లో అలెక్స్ క్యారీ (0) ని ఎల్బీడబ్ల్యూ చేశాడు.

ఇక మరో సారి కుల్దీప్ తన మాయాజాలంతో గ్లెస్ మాక్స్ వెల్ (15) ను బౌల్డ్ చేయగా.. రవిచంద్రన్ అశ్విన్ కామెరాన్ గ్రీన్ (8)పని పట్టాడు. మరో సారి రంగంలోకి దిగిన బుమ్రా..జోరుగా అడుతున్న కమిన్స్ (15) ను పెవిలియన్ కు పంపగా..హార్ధిక్ పాండ్యా అడం జంపా (6) వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 49.3వ ఓవర్లో మహమ్మద్ సిరాజ్ మిచెల్ స్టార్క్ (28) ను అవుట్ చేయడంతో అసీస్ కథ ముగిసింది.

టీమిండియా బౌలర్ల విజృంభణతో ఆస్ట్రేలియా 199 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకు ఆరంభంలోనే వరుస షాక్ లు తగిలాయి. ఓపెనర్లు ఇషాక్ కిషన్, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వరుసగా డకౌట్ అయ్యారు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు క్యూ కట్టారు. ఈ క్రమంలో వన్ డౌన్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ టీమిండియాను ఆదుకున్నారు. వరల్డ్ కప్ చరిత్రలో నాలుగో వికెట్ కు రికార్డు స్థాయిలో 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టిక్కించారు.

సిక్సర్లకు యత్నించకుండానే కేవలం ఫోర్లు బాదుతూ .. అచితూచి ఆడుతూ ఒక్కో పరుగు పొగుచేస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు కోహ్లీ, రాహుల్. ఈ మ్యాచ్ లో మొత్తం 116 బంతులు ఎదుర్కొని 85 పరుగులు సాధించారు. ఇందులో ఆరు బౌండరీలు ఉన్నాయి. కాగా 38వ ఓవర్ నాలుగో బంతికి కోహ్లీ అవుట్ కావడంతో క్రీజులోకి ప్రవేశించిన హార్ధిక్ పాండ్యాతో కలిసి కేఎల్ రాహుల్ సిక్సర్ తో భారత్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

రాహుల్ 115 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్స్ ల సాయంతో 97 పరుగులుతో నాట్ ఔట్ గా నిలవగా, హర్ధిక్ పాండ్యా 8 బంతుల్లో ఒక సిక్సర్ సాయంతో 11 పరుగులు చేశాడు.  దీంతో 41.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఆస్ట్రేలియా పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరల్డ్ కప్ – 2023 లో బోణీ కొట్టింది. ఆద్యంతం అద్భుతంగా ఆడిన రాహుల్ ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.

Chandrababu Arrest: చంద్రబాబు కేసులో రేపు ఏమి జరగబోతోంది ..? న్యాయస్థానాలపై అందరి చూపు..సర్వత్రా ఉత్కంఠ

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju