NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu nenu Prema: పద్మావతి బిజినెస్ ప్రపోజల్.. అభినందించిన కుటుంబ సభ్యులు..విక్కీ ఏం చేయనున్నాడు?

Nuvvu Nenu Prema today episode  09 october 2023 today episode 436  highlights

Nuvvu nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతినీ విక్కీ అప్పుతీసుకున్నందుకు, అవి నువ్వు ఎప్పటికీ తీర్చలేవు అన్నట్టు మాట్లాడతాడు. దాంతో పద్మావతి ఎలాగైనా విక్కీ అప్పు తీర్చేయాలి అనుకుంటుంది. పద్మావతి ఆఫీస్ లో అందరికీ భోజనం తీసుకుని వెళుతుంది. అక్కడి వాళ్ళందరూ పద్మావతిని మెచ్చుకొని భోజనం బావుంది రేపు కూడా మీరే తీసుకురండి అని చెప్తారు దాంతో పద్మావతికి తన బిజినెస్ కి ఒక ఐడియా వచ్చింది అనుకుంటుంది.

Nuvvu Nenu Prema today episode  09 october 2023 today episode 436  highlights
Nuvvu Nenu Prema today episode  09 october 2023 today episode 436  highlights

ఈరోజు 436 వ ఎపిసోడ్ లో, పద్మావతి భోజనం ఆఫీస్ లో అందరూ తింటారు అలానే ఆర్య కూడా పద్మావతి భోజనంతిని విక్కీకి బాక్స్ తీసుకొని వస్తాడు.అప్పటికే బాగా ఆకలిగా ఉన్న విక్కి ఆర్య తీసుకొచ్చిన బాక్స్ ని చూసి భోజనం చేద్దాము అనుకుని కూడా పద్మావతి మీదున్న కోపంతో నాకు అవసరం లేదు అని చెప్తాడు. ఆర్య పద్మావతి భోజనం ఎంత బాగుందో వర్ణించి చెప్తాడు విక్కీకి, అయినా విక్కీ నాకు ఆకలిగా లేదు మీరు తీసుకెళ్లి పో అని అంటాడు లేదు ఇక్కడ పెడుతున్నాను నీకు కావాలంటే తిను లేదంటే పద్మావతి భోజనం నువ్వు మిస్ అయిపోయినట్టే అని బాక్స్ విక్కీ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema:  విక్కీ అప్పు తీర్చడానికి పద్మావతి ఐడియా. పద్మావతి విక్కీ ల గొడవ అరవింద కంట పడనుందా..?

Nuvvu Nenu Prema today episode  09 october 2023 today episode 436  highlights
Nuvvu Nenu Prema today episode  09 october 2023 today episode 436  highlights

భర్తని చూసి మురిసిపోయిన పద్మావతి..

ఇక పద్మావతి నేను ఆర్య బావ గారి చేత బాక్స్ ఇచ్చి, పంపించాను.నా మీద కోపంతో బాక్స్ అసలు ఓపెన్ చేశాడో లేదో అని అనుకుంటూ ఉంటుంది. అందరికీ పెట్టానన్న తృప్తి ఉంది కానీ నేను ఎవరికోసమైతే భోజనం చేశాను వాళ్ళు తినలేదు అని బాధపడుతూ ఉంటుంది పద్మావతి. అయినా ఒకసారి విక్కీ క్యాబిన్ కెళ్ళి చూడాలి అనుకుంటుంది. పద్మావతి విక్కి క్యాబిన్ వైపు వెళుతూ ఉంటుంది ఈ లోగా విక్కీ, బాగా ఆకలిగా ఉంది అని బాక్స్ వైపు చూస్తూ పద్మావతి మీద కోపంతో తినకుండా ఉండాలా లేదంటే తిందామా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు పద్మావతి విక్కి క్యాబిన్ వైపు నడుచుకుంటూ వస్తు ఎలాగైనా విక్కీ భోజనం చేయాలి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు విక్కి ఇక ఆకలి తట్టుకోలేక పద్మావతి ఇచ్చిన బాక్స్ ని ఓపెన్ చేస్తాడు. అందులో మిరపకాయ బజ్జీలతో పాటు స్వీట్స్ కూడా ఉంటాయి. వాడిని చూసి విక్కీ మిరపకాయ బజ్జీలు అన్ని తినేసి అన్నం కూడా తినే స్వీట్ తినబోతూ ఉండగా, అప్పుడే అక్కడికి వచ్చి పద్మావతి నిలబడి విక్కీని చూస్తూ నేనంటే, మీకు కోపం ఉన్న మీ మనసులో మాత్రం నా మీద ప్రేమ అలాగే ఉంది.అందుకే నేను పంపించిన భోజనాన్ని తింటున్నారు అది ఎప్పటికైనా బయట పెడతాను అని అట్లానే విక్కీని చూస్తూ నిలబడి ఉంటుంది ఇక ఎప్పుడైతే వికీ స్వీట్ తింటున్నాడు అప్పుడు ఒకసారిగా సారు అని అరుస్తుంది.విక్కీ దగ్గరికి వెళ్లి ఈ స్వీటు మీరు తినకూడదు ఎందుకంటే మీకు షుగర్ ఉంది కదా అందరితో పాటు మర్చిపోయి మీకు కూడా పెట్టేశాను రేపటి నుంచి స్వీటు మీకు పెట్టను అని అంటుంది. విక్కీ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. పద్మావతి వికీ తినంగా మిగిలిన బాక్స్ లో ఉన్న అన్నము తింటూ భర్త తిన్న అన్నం మిగిలినది భార్య తింటే అబద్ధం జీవితాంతం బలపడుతుంది. మన బంధం కూడాఎప్పుడు ఇలానే ఉండాలి అనుకుంటుంది.

Krishna Mukunda Murari: లడ్డు వేలం పాటలో పోటీ పడ్డ ముకుంద కృష్ణ.. గెలుపెవరిది.!?

Nuvvu Nenu Prema today episode  09 october 2023 today episode 436  highlights
Nuvvu Nenu Prema today episode  09 october 2023 today episode 436  highlights

పద్మావతి ని మెచ్చుకున్న శాంతాదేవి..

ఇక పద్మావతి ఇంటికి వస్తూ ఉంటుంది.అప్పటికే శాంతాదేవి అనుతో ఇంకా పద్మావతి రాలేదేంటి అని అడుగుతుంది నేను తన కోసం ఎదురుచూస్తున్నాను బామ్మ గారు అంటుంది ఇంతలో అరవింద కుచల అక్కడికి వస్తారు. పద్మావతి అందరికీ భోజనం తీసుకెళ్ళింది కదా నానమ్మ అందువల్ల లేట్ అయి ఉంటుంది అని అంటుంది అరవింద. వెంటనే కుచలవీళ్ళే ఫ్రీగా ఇంటికి వచ్చారు మళ్ళీ వీళ్ళు ఫ్రీగా సర్వీస్ చేయడం కూడానా అని అంటుంది. ఇప్పుడు ఏమైంది భోజనం ఏ కదా పెట్టింది అని అంటుంది శాంతాదేవి. మీరు ఇలానే తనని వెనకేసుకు రండి మన ఆస్తంతా కరిగేస్తుంది అని అంటుంది. అప్పుడే అక్కడికి పద్మావతి వస్తుంది. వస్తూనే స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి శాంతాదేవిని అలాగే, అనుకి అందర్నీ సంతోషంతో గిరగిరా తిప్పేస్తూ ఉంటుంది. పద్మావతి ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది శాంతాదేవి. నేను ఈరోజు ఆఫీస్ కి బాక్సులు తీసుకుని వెళ్లాను కదా వాళ్ళకి నా వంట బాగా నచ్చింది రేపు కూడా నన్నే తీసుకు రమ్మన్నారు. ఇక ఆఫీసులో అందరికీ రోజు వంట చేసి పెడదాం అనుకుంటున్నాను వాళ్ళు నాకు డబ్బులు కూడా ఇచ్చారు అని అంటుంది. శాంతాదేవికి ఆ మాటలు చాలా బాగా నచ్చుతాయి తన కాళ్ళ మీద తన నిలబడాలనుకుంటుంది అని మెచ్చుకుంటుంది.. అను అరవింద కూడా సంతోషపడతారు. కానీ కుచల మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. మా విక్కీ పరువు తీయడానికే నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తావు తను ఆఫీసులో ఉండి నువ్వు వంట చేసి తీసుకువెళ్తావా ఇలాంటి పరువు తక్కువ పనులు చేయమాకు అని అంటుంది. శాంతాదేవి తను చేసేది మంచి పని అంతేకానీ తను తక్కువ పని ఏమీ చేయడం లేదు, ఇంకా విక్కీ అంటావా? మంచి పనులు చేస్తే తను ఏ రోజు కాదనడు ఒకవేళ తను ఒప్పుకోకపోయినా నేను ఒప్పిస్తాను పద్మావతి నీ వెనక నేనున్నాను అని శాంతాదేవి భరోసా ఇస్తుంది పద్మావతికి పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.

Brahmamudi అక్టోబర్ 7 ఎపిసోడ్ 221: రాజ్ తనని ఇష్టపడడం లేదు అనే నిజాన్ని తెలుసుకొని ఇల్లు వదిలి వెళ్లిపోయిన కావ్య.. నా కూతురు ఎక్కడ అని రాజ్ ని నిలదీసిన కనకం!

Nuvvu Nenu Prema today episode  09 october 2023 today episode 436  highlights
Nuvvu Nenu Prema today episode  09 october 2023 today episode 436  highlights

పద్మావతి గరుడతో ముచ్చట్లు..

పద్మావతి చాలా సంతోషంగా మిరపకాయ బజ్జీలు వేసుకొని ప్లేట్లో పెట్టుకుని బయటికి వచ్చి గరుడ బండి ముందు కూర్చుని దాంతో మాట్లాడుతూ ఉంటుంది. గరుడ అమ్మి నీ ఆనందం చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది ఇలానే ఉండాలని నువ్వు జీవితాంతం అని అంటాడు. నీ బిజినెస్ సంబంధించిన ప్రపోసలు ఇంట్లో అందరికీ నచ్చింది ఇక నువ్వు విక్కీ సారు అప్పు తీర్చేయడమే కాదు విక్కీకే నువ్వు అప్పు ఇవ్వచ్చు అని అంటాడు గరుడ. పద్మావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి అనుకూడా వస్తుంది. ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు అని అంటే అక్క నేను గరుడ తో మాట్లాడుతున్నాను వాడి హస్తం ఉంది అని అను కి చెప్తుంది అను పద్మావతి బిజినెస్ చేయడం, ఆ బిజినెస్ గురించి పద్మావతి మాట్లాడుతుండడం చూసి మురిసిపోతుంది అను.ఏంటక్కా అలా ఉన్నావు అని అడుగుతుంది పద్మావతి నువ్వు ఇలా ఎదగడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు.

Nuvvu Nenu Prema today episode  09 october 2023 today episode 436  highlights
Nuvvu Nenu Prema today episode  09 october 2023 today episode 436  highlights

తన బిజినెస్ గురించి విక్కీకి చెప్పడం..

విక్కీ ఫోన్లో తనకు సంబంధించిన బిజినెస్ డీలర్స్ తో మాట్లాడుతూ లోపలికి వస్తాడు. ఇంతలో విక్కీకి ఆడిటర్ ఫోన్ చేసి, మీ బావగారు 10 లక్షలు అడుగుతున్నారు అని చెప్తాడు. నన్నడక్కుండా తనకి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు అని విక్కీ తేల్చి చెప్పేస్తాడు.అప్పుడే పద్మావతి కూడా తనకి రేపటికి కావాల్సిన సరుకులని ఒక షాపులో ఇచ్చి కట్టమంటూ ఉంటుంది వాడు తక్కువ ధరకి కట్టలేదని వాడితో నన్ను మోసం చేద్దామనుకుంటున్నారా మా ఆయన బిజినెస్ అంతా నేను వంటి చేత్తో నడుపుతున్నాను. ఇది నాకు చాలా చిన్న బిజినెస్ అని మాట్లాడుతూ ఉండగా విక్కీ వింటాడు.ఏంటి అని అడుగుతాడు పద్మావతిని నేను బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను అని అంటుంది పద్మావతి వాట్ అంటాడు. అవును సారూ మన ఆఫీసులో అందరికీ భోజనం తీసుకుని వచ్చాను కదా అది అందరికీ నచ్చింది. వాళ్ళు రేపు కూడా నన్ను భోజనం తీసుకొని రమ్మన్నారు అందుకనే షాప్ వాళ్లతో మాట్లాడుతున్నాను అని అంటుంది.

Nuvvu Nenu Prema today episode  09 october 2023 today episode 436  highlights
Nuvvu Nenu Prema today episode  09 october 2023 today episode 436  highlights

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి విక్కీ గొడవ పడుతూ ఉంటారు. నువ్వు మా అక్కని మోసం చేసిన విషయం మా అక్కకి తెలియక నిన్ను నమ్ముతుంది. పద్మావతి అది కాదు సారు ఆరోజు మీరు చూసింది నమ్ముతున్నారు కానీ అది నిజం కాదు నేను చెప్పేది ఒకసారి వినండి అని అంటుంది కానీ విక్కీ కోపంగా పూలకుండి పద్మావతి మీదకి విసిరేస్తాడు అది తన చేతికి తగులుతుంది.పద్మావతి నొప్పితో బాధపడుతూ ఉంటుంది.

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N