Brahmamudi అక్టోబర్ 7 ఎపిసోడ్ 221: కళ్యాణ్ , అనామిక ని అలా కలిసి ఉండడం చూడలేక అప్పు బయటకి వెళ్లి కూర్చుంటుంది. అందరూ భోజనం చెయ్యడానికి అందాలు అరిటాకు వేసుకొని క్రింద కూర్చోగా అప్పు ఎక్కడ అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. అదే తెలియడం లేదని కనకం బయటకి వెళ్లి చూడగా అప్పు దిగాలుగా కూర్చొని ఉండడం చూసి ఏమైంది అలా ఉన్నావు అని అంటుంది.

కళ్యాణ్ – అనామిక కలిసి ఉండడం చూడలేక ఇంటికి వెళ్లిపోయిన అప్పు :
ఏమి లేదు నాకు బాగా తలనొప్పిగా ఉంది, నువ్వు నాన్న ని తీసుకొని వచ్చేయ్, నేను ఇంటికి వెళ్తున్న అని చెప్పి వెళ్ళిపోతుంది. ఏమైంది దీనికి ఇలా ఉంది అని మనసులో అనుకుంటుంది కనకం. ఇక ఆ తర్వాత లోపలకి వెళ్లగా అప్పు ఎక్కడ అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. తహలానొప్పి అని చెప్పి వెళ్ళిపోయింది అని అంటుంది కనకం. అప్పుడు ధాన్య లక్ష్మి అదేంటి ఇందాకే ఆకలి వేస్తుంది అని చెప్పిందే అని అంటుంది. పండగకి ఇంటికి వచ్చిన వాళ్ళు భోజనం చెయ్యకుండా వెళ్ళకూడదు అని తెలీదా అని అపర్ణ అంటుంది.

కావ్య ని గదిలోకి తీసుకెళ్లి వార్నింగ్ ఇచ్చిన రాజ్ :
అలా భోజనం ప్రారంభం అవ్వగా, అందరికి వడ్డిస్తున్న కావ్య ని తీసుకెళ్లి రాజ్ పక్కన కూర్చోబెడుతుంది ధాన్య లక్ష్మి. ఆ సమయం లో వాళ్లిద్దరూ మాటా మాటా అనుకుంటూ ఉండడం చూసి అందరు మురిసిపోతారు. ఆ తర్వాత కావ్య ని గదిలోకి తీసుకెళ్లి ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ అందరి ముందు, నువ్వు అలా చేస్తే అందరూ మనం కలిసిపోయామని అనుకుంటారు కదా అని అంటాడు. అదేంటి మీరే కదా మారడానికి ట్రై చేస్తున్నాను అన్నారు, ఇప్పుడు ఇలా అంటున్నారేంటి అని అంటుంది కావ్య. అదేదో తాతయ్య కోసం.. అని గబుక్కున నోరు జారుతాడు రాజ్ఏంటి తాతయ్య కోసం అని కావ్య అడగగా, తాతయ్య అలా జంటగా పోటీ చెయ్యమన్నారు కాబట్టి చేశాను. అయినా మారడానికి నాకు కాస్త సమయం కావాలి, వెంటనే ఎవ్వరూ మారిపోరు అని అంటాడు కళ్యాణ్. ఇక కాసేపటి తర్వాత కావ్య రాజ్ వినాయకుడికి రాసిన కోరికల చిట్టా ని దొంగలించి చదువుతుంది.

రాజ్ తనని ఇష్టపడడం లేదు అనే నిజాన్ని తెలుసుకొని ఇల్లు వదిలి వెళ్లిపోయిన కావ్య:
రాజ్ తనతో తాతయ్య కి ఇచ్చిన మాట కోసం మంచిగా ఉన్నట్టుగా నటిస్తున్నాడు అనే చేదు నిజాన్ని తెలుసుకొని కావ్య గుండెలు బద్దలైపోతుంది. ఏడుస్తూ, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మరోపక్క అప్పుడే దుగ్గిరాల కుటుంబం నుండి తమ ఇంటికి వచ్చిన కనకం ని చూసి అప్పు ఆకలి వేస్తుంది వెంటనే అన్నం పెట్టండి అని అంటుంది. అక్కడేమో ఆకలి వెయ్యడం లేదు అని మొహం ముడుచుకొని కూర్చొని, ఇక్కడికి వచ్చి ఆకలి వేస్తుంది అంటావేంటి అని కనకం అనగా, దానికి అప్పు అప్పుడు ఆకలి వెయ్యలేదు,ఇప్పుడు ఆకలి వేస్తుంది ఏమి చేయమంటావ్ అని అంటుంది. కనకం అప్పు ప్రవర్తన చూసి ఈమధ్య ఇది ఏదోలా ప్రవర్తిస్తుంది, నాకు ఎందుకో అనుమానం గా ఉంది అంటూ మూర్తి తో అంటుంది. అన్నపూర్ణ ఇదంతా గమనించి అప్పు తో మాట్లాడడానికి వస్తుంది.

నువ్వు కళ్యాణ్ ని ఇష్టపడుతున్నావ్ అని అర్థం అవుతుంది, కానీ అది కరెక్ట్ కాదు, నీ ఇద్దరి అక్కలు ఎలాంటి పరిస్థితులలో పెళ్లి చేసుకున్నారో నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు కూడా కళ్యాణ్ ని పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరి అక్కలను అక్కడ ఎలా టార్చర్ చేస్తారో ఊహించుకో, దయచేసి ఆ ఆలోచనని పక్కన పెట్టు అని అంటుంది అన్నపూర్ణ. మరోపక్క కావ్య అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, ఇంట్లో అందరూ కావ్య ఎటు పోయిందో తెలియక కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు కనకం నా కూతురు కనిపించకుండా పోయింది అట, ఏమి చేసారు నా కూతుర్ని, ఎక్కడ ఉంది నా కూతురు, వెంటనే తెచిపెట్టండి, నాకు నా కూతురు కావాలి అని దుగ్గిరాల కుటుంబం ని నిలదీస్తుంది కనకం. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపు చూడాలి.