NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ సభలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

CM YS Jagan: విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్దపడిన యోధుడు పోలీస్ అని కొనియాడారు. ఖాకీ డ్రెస్ అంటే త్యాగనీరతి అని, పోలీస్ ఉద్యోగం అనేది ఓ సవాల్.. బాధ్యత అని అన్నారు. పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం ఎళ్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

గడచిన 64 సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను స్మరించుకుని ప్రజలంతా మన పోలీసులకు మనసులో సెల్యూట్ చేసే రోజు ఇది అని అన్నారు. అమరులైన పోలీసులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్ సోదరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని పేర్కొన్నారు సీఎం జగన్. విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సాంకేతికతకు తగినట్లు అప్ డేట్ అవుతూ శాంతి భద్రతలను పరిరక్షించాలన్నారు సీఎం జగన్. ఇదే సందర్భంలో ఇటీవల జరిగిన పలు సంక్షటనలు ఉదహరిస్తూ ప్రతిపక్షాలపైనా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. నూజివీడులో కానిస్టేబుల్ హత్య ఘటన, అంగళ్లు, పుంగనూరు ఘటనలను పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ పోలీసులపై దాడులు చేయించిందన్నారు. పుంగనూరు ఘటనలో 40 మంది పోలీస్ సిబ్బందికి గాయాలు అయ్యాయనీ, ఒక పోలీస్ కన్ను కోల్పోయారని అన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడి సాక్ష్యాదారాలతో దొరికిన వారికి న్యాయస్థానాల నుండి అనుకూల ఉత్తర్వులు రావడం లేదని చివరకు న్యాయమూర్తులపైనా ట్రోలింగ్ చేస్తున్నారని విమర్శించారు. కాబట్టి ..ఇటువంటి దుష్టశక్తుల విషయంలో పోలీసులు కఠినంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.

ఏపీలో పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం పెట్టపీట వేస్తొందని చెప్పారు. వైద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ .. ఆరోగ్య భద్రత కల్పిస్తొందని తెలిపారు. ఏపీతో పాటు హైదరాబాద్ లో గుర్తించిన 283 ఆసుపత్రుల ద్వారా చికిత్స అందిస్తొందని అన్నారు సీఎం జగన్. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులకు ఎస్ బీ ఐ ద్వారా భీమా సదుపాయం కల్పించే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ శాఖలో తీసుకువచ్చిన సంస్కరణలను వివరించిన సీఎం జగన్ .. పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ కే రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Chandrababu Arrest: చంద్రబాబుకు గుడ్ ఫ్రైడే అవుతుందనుకుంటే బ్యాడ్ ఫ్రైడే అయినట్లుందే.. వరుసగా న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు .. దసరా పండుగ రోజూ కారాగారంలోనే..?

Related posts

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju