NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh: రేపటి నుండి లోకేష్ యువగళం పాదయాత్ర పునః ప్రారంభం .. కీలక అప్ డేట్ ఏమిటంటే..?  

Nara Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో బ్రేక్ పడిన యువగళం పాదయాత్రను నారా లోకేష్ తిరిగి ప్రారంభిస్తున్నారు. సోమవారం ఉదయం 10.19 గంటలకు పాదయాత్రకు లోకేష్ పాదయాత్రను పునఃప్రారంభిస్తున్నారు. విరామం ప్రకటించిన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే పాదయాత్రను కొనసాగించనున్నారు. మధ్యాహ్నం తాటిపాక బహిరంగ సభలో లోకేష్ ప్రసంగిస్తారు. పి గన్నవరంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో లోకేష్ ముఖాముఖి నిర్వహిస్తారు. మామిడికుదురు లో స్థానికులతో భేటీ అవుతారు. సోమవారం 16 కిలో మీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగనుంది. పాదయాత్ర కోసం ఇప్పటికే పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు.

స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ను సెప్టెంబర్ 9న అరెస్టు చేయడంతో .. లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. దాదాపు 60 రోజుల తర్వాత చంద్రబాబుకు బెయిల్ లభించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్ నుండి విడుదల అయ్యారు. ఈ మధ్యలో చంద్రబాబు బెయిల్ ప్రయత్నాల కోసం ఢిల్లీకి వెళ్లారు. మరో పక్క లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారన్న వార్తలు రావడంతో హైకోర్టును ఆశ్రయించారు. అయితే లోకేష్ విషయంలో సీఆర్పీసీ 41 నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలుపడంతో అరెస్టు లేదని తెలిసిపోయింది. రీసెంట్ గా చంద్రబాబుకు పూర్తి స్థాయిలో బెయిల్ లభించడంతో పాదయాత్ర కొనసాగించాలని లోకేష్ నిర్ణయించారు.

Nara Lokesh Padayatra

రాజోలు నియోజకవర్గం పొదలాడ నుండి యువగళం పాదయాత్ర పునః ప్రారంభించి అమలాపురం, ముమ్మడివరం, కాకినాడ పట్టణం, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి జిల్లాలో ప్రవేశిస్తుంది. అనకాపల్లి, విశాఖ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకుని అక్కడ పాదయాత్ర ముగిస్తారు లోకేష్. లోకేష్ పాదయాత్ర ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో ప్రారంభమైంది. తొలుత కుప్పం నుండి ఇచ్చాపురం వరకూ 400 రోజులు 4వేల కిలో మీటర్లు పాదయాత్ర చేయాలని భావించినప్పటికీ చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది.

రెండున్నర నెలల పాటు పాదయాత్రకు విరామం ఇచ్చిన నేపథ్యంలో ఇచ్చాపురం వరకూ పాదయాత్ర లక్ష్యాన్ని కుదించుకుని విశాఖపట్నంలో ముగించనున్నారు. గతంలో చంద్రబాబు చేపట్టిన వస్తున్న మీ కోసం పాదయాత్ర కూడా విశాఖలోనే ముగించారు. ఆ సెంటిమెంట్ కూడూ కలిసి వచ్చేలా లోకేష్ విశాఖలో పాదయాత్ర ముగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తొంది. ఇందుకు తగినట్లుగా రూట్ మ్యాప్ ను ఖరారు చేసినట్లుగా సమాచారం.

MP Raghurama: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈడీ భారీ జరిమానా

Related posts

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?