NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuuvu Nenu Prema: కృష్ణ గురించి నారాయణ కు తెలియనుందా? వస్తాదుల లో చిక్కుకున్న విక్కీ ఎలా బయటపడనున్నాడు?

Nuvvu Nenu Prema Today Episode November 28 2023 Episode 479 Highlights

Nuuvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి ఇంట్లో విక్కీ కష్టాలు పడుతూ ఉంటాడు. పద్మావతి వికీ ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందరిలో పద్మావతిని ఏమీ అనలేక విక్కీ కోపాన్ని ప్రదర్శించకుండా ఉంటాడు. పద్మావతి వికీకి దోమలు కొట్టకుండా ఉండాలని, చేసే ప్రతి ప్రయత్నం కూడా విఫలం అవుతుంది. అరవిందకు కృష్ణ మీద అనుమానం వస్తుంది కృష్ణ ప్రవర్తనను బట్టి అరవింద అర్థం చేసుకుంటుంది. ప్రస్తుతానికైతే కృష్ణ అరవింద నుండి తప్పించుకున్నాడు. అల్లుడికి అసౌకర్యం కలిగినందుకు భక్త, బాధపడతాడు పద్మావతి ఐడియా తో విక్కీకి దోమలు కుట్టకుండా నిద్రపోయే ఏర్పాట్లు చేస్తారు.

Nuvvu Nenu Prema Today Episode November 28 2023 Episode 479 Highlights
Nuvvu Nenu Prema Today Episode November 28 2023 Episode 479 Highlights

ఈరోజు 479 వ ఎపిసోడ్ లో, విక్కీ పద్మావతి తన పక్కన వచ్చి పడుకుంటుందని మధ్యలో అడ్డు పెడతాడు. ఏం చేస్తున్నారు సారు అని అడుగుతుంది పద్మావతి. నా మనసులో నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవని తెలియడానికే ఇలా చేస్తున్నాను అని అంటాడు. నీకు అంత ఇబ్బంది అయితే నువ్వు వేరే చోట పడుకోవచ్చు అని అంటాడు విక్కీ. అక్కర్లేదు లే సారు ఒక మూల అయినా ఇక్కడే పడుకుంటాను అని అంటుంది పద్మావతి. శ్రీనివాస బండరాయి కన్నా కఠినంగా ఉన్న ఈయన మనసు ఎప్పటికీ మారాలి ఎప్పటికి నా వైపు తిరగాలో అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. మన మధ్య అపార్థాల వల్ల ఏర్పడిన ఈ అడ్డు అతి త్వరలో తొలగిపోతుంది సారు అని విక్కీని చూస్తూ, మీరు నేను ఒకటే అని మీకు ఎప్పటికీ తెలుస్తుంది. అని మనసులో అనుకుంటూ పడుకుంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema Today Episode November 28 2023 Episode 479 Highlights
Nuvvu Nenu Prema Today Episode November 28 2023 Episode 479 Highlights

ఇక ఉదయం తొందరగా పని కాని ఆండాలు చెబుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అని వస్తుంది ఏంటమ్మా అప్పుడే పని మొదలు పెట్టారా చెప్తే నేను కూడా హెల్ప్ చేసేదాని కదా అని అంటుంది. నువ్వు కూడా ఏందత్త పెళ్లి కాగానే నేనేమైనా పరాయిదాన్ని అయిపోయానా ఏంది నాతో చెప్పకుండా మీరే పనులు చేసుకుంటున్నారు అంటుంది. మీకు అల్లుళ్లు కొత్త కావచ్చు కూతుర్లు కొత్త కాదు కదా మాతో కూడా చెప్పకుండా మీరే పనులు చేసుకుంటున్నారు అని అంటుంది అను. ఇప్పుడు ఎందుకే అంత ఫీల్ అవుతున్నావు? నువ్వు కూడా ఒక చెయ్యి వచ్చి అని అంటుంది అని కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. వెంటనే చిలకమ్మ వచ్చి, వంటలు పోటీ పెట్టారా ఏంది అందరూ కలిసి వంటింట్లో తెగ పనులు చేస్తున్నారు అని అంటుంది. ఏంటి చిలకమ్మా లేటుగా రావడమే కాకుండా మాటలు కూడా బానే మాట్లాడుతున్నావు అని అంటుంది పార్వతి. ఈ చిలకమ్మ లేటుగా వచ్చినా లేటెస్ట్ గా అన్ని పనులు చేస్తుంది లెండి అని అంటుంది చిలకమ్మా. మీరు ఏదైనా ఒక పని చెప్పండి నేను చిటికలో చేసి చూపిస్తాను అని అంటుంది. పద్మావతి వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు వెళ్లి తీసుకురాపో అని అంటుంది అండాలు. వాళ్లు కొత్తగా పెళ్లయితే వాళ్ళని నిద్ర లేపమంటారు ఏంటమ్మా కాసేపు పడుకోనివ్వండి అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode November 28 2023 Episode 479 Highlights
Nuvvu Nenu Prema Today Episode November 28 2023 Episode 479 Highlights

పద్మావతి మీద విక్కీ ప్రేమ..

ఇక పద్మావతి నిద్రపోతూ ఉంటుంది. విక్కీకి చాలా అసౌకర్యంగా ఉంటుంది. చాలాసార్లు పద్మావతిని లేపాలని ట్రై చేస్తాడు కానీ పద్మావతి బాగా నిద్రలో ఉండడంతో, పద్మావతిని డిస్టర్బ్ చేయకుండా తనే ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక తెల్లవారేసరికి విక్కీకి మెలకువ వచ్చి చూస్తాడు పద్మావతి దగ్గరికి వెళ్లి నవ్వుతూ ఉంటాడు అప్పుడే పద్మావతి కూడా మెలుకువ వస్తుంది విక్కీని చూసి పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి సారు పడుకునేటప్పుడు దూరం దూరం అని నేను లేచే సరికి నా దగ్గరగా ఉన్నారు. నేనంటే మీకు ప్రేమ కలిగిందా అని అంటుంది. అలాంటిదేం లేదు రాత్రంతా నాకు నిద్ర పట్టకుండా నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావు అయినా నీకు చెయ్యి కాలు వేసి అలవాటు ఉందని తెలిస్తే నేను అసలు నా పక్కనే పడుకొని కాదు అని అంటాడు. అవునా సారు ఏరోజైనా మనిద్దరం కలిసి పడుకుంటేనే కదా నా అలవాట్లు ఏంటో మీకు తెలిసేది అని అంటుంది పద్మావతి. అదేదో రాత్రి చెప్పుండొచ్చు కదా అని అంటాడు విక్కీ. మిమ్మల్ని చూస్తూ చెప్పడం మర్చిపోయాను అని అంటుంది పద్మావతి. తెలివితేటలు కాస్త తగ్గించు అని అంటాడు విక్కి. ఒక్కరోజు మీ పక్కన పడుకుంటేనే నాకు ఇన్ని తెలివితేటలు వస్తే రోజు మీ పక్కనే పడుకుంటే నేను ది గ్రేట్ పద్మావతిని అయిపోతానేమో అని అంటుంది. నువ్వు ది గ్రేట్ పద్మావతి బాబు నీ తింగరతనం అంతా నాకు వచ్చి నాకు పిచ్చి పడుతుంది అని అంటాడు విక్కి. అయినా ఇంకొకసారి నేనెందుకు ఒప్పుకుంటానులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సారు ఉండండి నేను కూడా వస్తాను అని అంటే గో టు హెల్ అని అంటాడు. నేను ఎక్కడికి వెళ్తాను సారు మీకు సేవ చేసుకుంటూ ఇక్కడే మీతోనే ఉంటాను అని అంటుంది. చూడు పద్మావతి అని వేల్ చూపిస్తాడు విక్కీ ఏంటో చెప్పండి సార్ అని అంటుంది పద్మావతి ఛీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema Today Episode November 28 2023 Episode 479 Highlights
Nuvvu Nenu Prema Today Episode November 28 2023 Episode 479 Highlights

నారాయణకు దొరికిన కృష్ణ..

ఇక కృష్ణ అరవిందను మాయ చేసి, ఆ సోప్ మీద ఉన్న తాళం ముద్రను అచ్చు వేయించి తాళం తయారు చేయడానికి ఒక రోడ్డు పక్కన నుంచుని ఉంటాడు. అప్పుడే వాకింగ్ కి నారాయణ అటువైపుగా వెళ్తూ కృష్ణ ని చూస్తాడు. అల్లుడుగారు అని అంటాడు వెంటనే కృష్ణ ఈ గొంతు ఏంటి ఎక్కడో విన్నట్టుందే అని తలెత్తి చూసేసరికి ఎదురుగ్గా నారాయణ ఉంటాడు. ఏంటి అల్లుడు గారు కోర్టుకు అని చెప్పి ఇక్కడ ఉన్నారు అని అంటాడు. వామ్మో అడ్డంగా బుక్ అయిపోయాను గా అని అనుకుంటాడు కృష్ణ. ఇప్పుడు ఏం చెప్పాలి అని అనుకుంటాడు. మిమ్మల్ని అల్లుడుగారు ఏమైంది ఎక్కడున్నారు? అంటే మావయ్య కోర్టుకే బయలుదేరాను కానీ అర్జెంటుగా ఒక క్లైంట్ ని కలవాల్సి వచ్చింది అందుకే ఇలా వచ్చాను అని అంటాడు. మరి ట్రైన్ టేడి ట్రైన్ కలవకుండా ఈ డూప్లికేట్ తాళాలు తయారు చేసే వాడి దగ్గర ఉన్నారేంటి డూప్లికేట్ కి ఏమన్నా చేయించుకుంటున్నారా అని అంటాడు. ఇప్పుడు ఈయనకి ఏం చెప్పాలి, అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే నారాయణా ఏం ఆలోచిస్తున్నారు అని అంటాడు. అయినా మీరేంటి ఎక్కడున్నారు అని అంటాడు. నా ఫ్రెండ్ ఒకటి రమ్మంటే వచ్చాను అని అంటాడు నారాయణ. అప్పుడే డూప్లికేట్ కి తయారైపోతుంది.అప్పుడే కి తీసుకొచ్చి ఆ షాప్ వాడు కృష్ణకి ఇస్తాడు కృష్ణ ఒకసారి గా షాక్ అవుతాడు నారాయణ కూడా అంతే కృష్ణ వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చెప్పాలి అని కృష్ణ ఆలోచిస్తూ ఉంటాడు. నారాయణ ఏంటి అల్లుడుగారు ఇందాక డూప్లికేటుకి ఇది కోసం వచ్చారా అంటే ఏం మాట్లాడలేదు ఇప్పుడేమో కి మీకు ఇస్తున్నాడు ఈయన అని అంటాడు. ఇకనుంచి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని అనుకుంటాడు. అంటే ఇది మా కబోర్డుకి ఆఫీసులోది ఆఫీస్ కబోర్డ్ లోని ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. అవి తీయడం కోసమే ఈ డూప్లికేట్ కి తయారు చేయించుకుంటున్నాను అని అంటాడు. వెంటనే ఆ షాప్ వాడు సారు మీరు తెచ్చిన సబ్బు మర్చిపోయారు అని ఇస్తాడు అని అనుకుంటాడు కృష్ణ. వెంటనే ఏం చెప్పాలి ఇప్పుడు అని మనసులో అనుకొని, లోపే, నారాయణ అడుగుతాడు. ఏంటి అల్లుడు గారు సోప్ అంటున్నాడు సోప్ మీద మీరు ఎందుకు అచ్చు వేయించారు అని అంటాడు. అంటే మావయ్య నేను ఆఫీసులో ఎక్కువసార్లు కి పోగొట్టుకుంటూ ఉంటాను అందుకని ఇట్లా అచ్చు వేయించుకొని రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటాను అని అంటాడు. ఎంతైనా మీరు లాయర్ కదా అని అంటాడు నారాయణ హమ్మయ్య తప్పించుకున్నాను అని అనుకుంటాడు కృష్ణ ఇక వెళ్దాం పదండి అని ఇద్దరు కలిసి వెళ్తారు ఆస్తి నా చేతికి వచ్చేదాకా నేను జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటాడు కృష్ణ.

Nuvvu Nenu Prema Today Episode November 28 2023 Episode 479 Highlights
Nuvvu Nenu Prema Today Episode November 28 2023 Episode 479 Highlights

 

విక్కీ పద్మావతి.. వాకింగ్..

ఇక విక్కీ వాకింగ్ చేయడానికి బయటకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే పద్మావతి నేను కూడా వస్తాను అని అంటుంది. ఎక్కడికి అని అంటాడు విక్కీ. మీరు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వస్తాను అని, పద్మావతి అనగానే నీతో ప్రయాణమా అని అంటాడు అవును సార్ మనిద్దరం సరదాగా అలా కారులో షికారికి వెళ్దామా అని అంటుంది నీతో కారులో షికారికి, ఇంపాజిబుల్ అని అంటాడు అయితే కనీసం, ఏదైనా ఊరికైనా తీసుకెళ్లండి నన్ను అని పద్మావతి అంటే సరే అంటాడు వికీ వెంటనే బట్టలు సర్దుకొని రమ్మంటారా అని లోపలికి వెళ్లబోతుంది ఎక్కడికి కాస్త సంధిస్తే చాలు నీ ఇష్టం వచ్చింది ఊహించుకుంటావా అని అంటాడు విక్కీ. నేను జాగింగ్ కి వెళ్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు నాతో పాటు రావద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెంటనే పద్మావతి మరి నేను బతిమిలాడుతుంటే బెట్టి చేస్తారా చెప్తాను మీ సంగతి అని మనసులో అనుకుంటుంది. విక్కీ జాంగింగ్ కి వెళ్తూ ఉంటే దారిలో వస్తాదులందరూ కలిసి, ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు వాళ్ళందరూ చాలా కండలు తిరిగిన వాళ్ళు చాలా బలవంతులుగా ఉంటారు పద్మావతి విక్కీ ని వెతుక్కుంటూ అటువైపుకు వస్తుంది. హనుమాన్ వ్యాయామశాల ముందు అందరూ వస్తాదులు వ్యాయామం చేస్తూ ఉంటారు. విక్కీని చూసి అందులో ఒకడు, చాలా అమాయకంగా ఉన్నాడు వీటితో ఒక ఆట ఆడుకుందామా అని అంటాడు. సరే అని అందరూ అనుకుని విక్కిని పిలుస్తారు. పద్మావతి కూడా విక్కీ వెనకాలే ఉండడంతో విక్కీ వాళ్ళ దగ్గరికి వెళ్లడం చూస్తుంది. టెంపరడు కరెక్ట్ ప్లేస్ కి వెళ్లాడు. ఇప్పుడు చూడు వెన్నెల ఇరికిస్తాను అని కావాలనే పద్మావతి వాళ్ళ దగ్గర విక్కీని బుక్ చేయాలనుకుంటుంది.

వస్తాదుల మధ్యలో చిక్కుకున్న విక్కీ..

ఇక విక్కిని పిలిస్తే విక్కీ వాట్ యు వాంట్ అని అంటాడు. అబ్బా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడురో వీడు అని అంటారు వాళ్ళు. ఎక్కడికి బయలుదేరారు అని అంటారు వాళ్ళు విక్కి జాగింగ్ కి అని చెప్తాడు నిక్కర్లేసుకునే పిల్లలు కూడా జాయిన్ చేస్తారు అని అంటారు. మాలాంటి మగాళ్లే ఇలాంటి వ్యాయామాలు చేస్తారు అని అంటారు అక్కడున్న, వస్తాదులు నువ్వు కూడా మగాడివైతే మాతో పాటు వచ్చి మేము చేసిన ఎక్సర్సైజ్ లని నువ్వు కూడా చేయి చూద్దాం అని అంటారు. నీ వల్ల కాదులే అయినా నువ్వు పిల్లగాడివి వెళ్లి జాగింగ్ చేసుకోపో అని అంటారు ఊర్లో జనం అంతా అక్కడ చేరుతారు. అప్పుడే చిలకమ్మ కూడా అక్కడికి వస్తుంది ఏంది పద్మావతమ్మ గారు మీరు ఎక్కడున్నారు అని అంటుంది. మా ఆయనకి పొద్దున్నే జాగింగ్ చేసే అలవాటు ఉంది కానీ ఇలాగా ఎక్సర్సైజులు చేసే అలవాటు లేదు అంత బరువైనవి మా ఆయన ఎత్తలేడు. నాకు టెన్షన్ గా ఉంది చిలకమ్మ అందుకే ఇక్కడ నిలబడి చూస్తున్నాను అని అంటుంది. వెంటనే పద్మావతి తో చిలకమ్మ ఇక్కడ ఉండి టెన్షన్ పడతారంటమ్మా పదండి మనం కూడా దగ్గరికి వెళ్లి చూద్దాం అని అంటుంది ఇద్దరు కలిసి వికీ దగ్గరికి వెళ్తారు. విక్కీ అప్పటికే వాళ్ళందరి మధ్యలో చిక్కుకొని ఉంటాడు. వెంటనే పద్మావతి వాళ్ళ దగ్గరికి వెళ్లి అన్న మా ఆయన్ని వదిలిపెట్టండి మా ఆయన వల్ల కాదు మీరేమో కీబోర్డ్ మీద టిక్కు టిక్కుమని నొక్కుకుంటూ ఉంటారు వాళ్ళు ఏమో పెద్ద పెద్ద బరువులు ఎత్తే చేతులు, మీలాగా సుతిమెత అయిన వాళ్ళకి పెద్ద పెద్ద బరువులు ఎత్తడం చేతకాదు అని అంటున్న అని అంటుంది పద్మావతి. ఒకసారి నువ్వు వదిలిపెట్టు ఆయన ఎత్తుతారేమో బరువులు ఎవరికి తెలుసు అని అంటుంది చిలకమ్మా. వెంటనే పద్మావతి ఆయన ఇంట్లోనే ఒక గ్లాస్ తీసి ఇంకోచోట పెట్టలేరు అలాంటిది వస్తాదులు చేసే ఎక్సర్సైజులు మా ఆయన ఏం చేస్తాడు చిలకమ్మా అని అంటుంది. వెంటనే అందరూ నవ్వుతారు. పద్మావత్ అన్న మాటలకి వాళ్ళందరూ విక్కిని చూసి హేళనగా నవ్వుతూ ఉంటారు విక్కికి చాలా కోపం వస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో కృష్ణ పద్మావతి దగ్గరికి వస్తాడు. విక్కీ నువ్వు ఎంత ట్రై చేసినా నిన్ను భార్యగా మాత్రం ఒప్పుకోడు అని అంటాడు. మీ ఇద్దరిదీ ఒప్పందం పెళ్లి అన్న విషయం మీ నాన్నకి గాని తెలిస్తే ఆయన పరిస్థితి ఏంటి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమిటి? పాపం అసలే మీ నాన్న హార్ట్ పేస్ట్ సెంటు ఇప్పుడు ఈ విషయం కానీ నేను కానీ చెప్పానంటే, ఏం జరుగుతుందో అని పద్మావతిని బెదిరిస్తూ ఉంటాడు.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri