NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana Elections Counting: ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి .. తొలి ఫలితం ఎన్ని గంటలకు అంటే..

Telangana Elections Counting: తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. గెలుపుపై ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ధీమా తో ఉండగా, హంగ్ వస్తే స్టీరింగ్ తమ చేతిలో ఉంటుందన్న భావనలో బీజేపీ, ఎంఐఎంలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 2,290 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 119 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49 కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరగనుంది. 500లకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

రేపు (ఆదివారం) ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచటెల భద్రత ఏర్పాట్లు చేశారు. తొలి ఫలితం పది గంటలకు వెలువడే అవకాశం ఉంది. చిన్న నియోజకవర్గాలకు సంబంధించి తొలి ఫలితాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. ఎక్కువ మంది అభ్యర్ధులు బరిలో ఉన్న నియోజకవర్గాల ఫలితం ఆలస్యం కానుంది. ముఖ్యమంత్రి కేసిఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఆలస్యంగా పూర్తవుతుంది. అన్ని నియోజకవర్గాలకన్నా అక్కడే చివరి ఫలితం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది అభ్యర్ధులు రంగంలో ఉండటంతో ఎక్కువ ఈవీఎంలను పరిశీలించాల్సి రావడంతో గజ్వేల్ ఫలితం అలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

కాగా శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాట్లు చేశారు. ఓట్ల కౌంటింగ్ భద్రతపై డీజీపీ అంజన్ కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ సెంటర్ లో ఫలితాలు వస్తున్న సమయంలో, కౌంటింగ్ సెంటర్ బయట కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రౌండ్ల వారీగా వస్తున్న వివరాలను బట్టి కౌంటింగ్ సెంటర్ బయట పోలీసు బందోబస్తును పై అధికారులు సమీక్షించాలని చెప్పారు. అభ్యర్ధుల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు వారి ఆస్తులకు కూడా భద్రత కల్పించాలని చెప్పారు. గెలిచిన అభ్యర్ధులు ర్యాలీ తీసే సమయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు డీజీపీ అంజన్ కుమార్.

KCR: ఎగ్జిట్ పోల్స్ అలా ఉన్నా గులాబీ బాస్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారా..! అందుకే ఈ చర్యలా..?

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!