NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

KCR: ఎగ్జిట్ పోల్స్ అలా ఉన్నా గులాబీ బాస్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారా..! అందుకే ఈ చర్యలా..?

KCR: తెలంగాణ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపుపై ఇటు అధికార బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ దే గెలుపు అని ప్రకటించాయి. కాంగ్రెస్ కు 80 స్థానాలు ఖాయమని ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా కాన్ఫిడెన్స్ తో ఉంది. ఆ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటి సీఎం డీకే శివకుమార్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ముగ్గురు సీనియర్ నేతలు ఏఐసీసీ పరిశీలకులుగా రేపు ఉదయం రానున్నారు.

CM KCR

రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడికి ముందే కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రత్యేక శిబిరానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికైన ఎమ్మెల్యే దృవీకరణ పత్రాలను పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజంట్ లు తీసుకుంటారని, అందుకు ఆర్ఓలకు సమాచారం ఇవ్వాలని ఆ పార్టీ నేతలు ఈసీకి విజ్ఞప్తి చేశారు. తమ అభ్యర్ధులను ట్రాప్ చేసేందుకు సీఎం కేసిఆర్ ప్రయత్నిస్తున్నారని కూడా డీకే శివకుమార్ ఆరోపించారు. ఆయన స్వయంగా సంప్రదించినట్లుగా తమ పార్టీ అభ్యర్ధులు చెప్పారన్నారు. అధికారంపై కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుండగా, ఎగ్జిట్ పోల్స్ .. ఎగ్జాక్ట్ పోల్స్ కాదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మూడో సారి తామే అధికారంలోకి వస్తున్నామని కేటిఆర్, కవిత, ఇతర బీజేపీ నేతలు చెబుతున్నారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎక్కడా కూడా తగ్గడం లేదు.

అందులో భాగంగా ఎన్నికల ఫలితాలు రాకముందే సోమవారం కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం కేసిఆర్ నిర్ణయం తీసుకోవడం విశేషం. సోమవారం మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉంటుందని సీఎంఓ వర్గాలు పేర్కొన్నాయి.  మరో పక్క సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ కు రంగులు వేసే (పెయింటింగ్) కార్యక్రమం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోను బీఆర్ఎస్ నాయకుడు, టీఎస్ఎండీసీ చైర్మన్ మన్నె క్రిశాంక్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దటీజ్ సీఎం కేసిఆర్ .. కేసిఆర్ మూడవ పర్యాయం కోసం సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ కు రంగులు వేస్తున్నారు అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఫలితాలపై కాన్ఫిడెన్స్ గా ఉండటంతో రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది.

Employees DA: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju