NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Janasena: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

TDP Janasena: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఆయనను పరామర్శించి బయటకు వచ్చిన వెంటనే అకస్మాత్తుగా టీడీపీతో పొత్తు ప్రకటన చేశారు. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశాల నిర్వహణకు చర్యలు చేపట్టారు. అయితే పలు ప్రాంతాల్లో రెండు పార్టీల నేతల మధ్య గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటు ఏపీలో టీడీపీలో పొత్తులో ఉన్న జనసేన అటు తెలంగాణలో ఎన్డీఏ పక్షంగా బీజేపీతో కలిసి ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది.

Pawan Kalyan Meets Chandrababu In Hyderabad

టీడీపీ తెలంగాణలో పోటీకి దూరంగా ఉంది. ఇక తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ స్థానాలు మూడు నుండి ఎనిమిదికి పెరగ్గా, జనసేన ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఏపీలో బీజేపీ స్థాండ్ ఏమిటి అనేది ఇంకా వెల్లడి కాలేదు. తెలంగాణలో బొటాబొటి స్థానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ తరుణంలో ఇవేళ హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లి పవన్ కళ్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పై నవంబర్ 4న వీరిద్దరూ భేటీ అయ్యారు. తరచూ సమావేశమై పొత్తు ప్రక్రియ వేగవంతానికి అవసరమైనై చర్యలు తీసుకోవాలని గతంలో ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మరో సారి చంద్రబాబు, పవన్ భేటీ జరిగింది.

చంద్రబాబుతో పవన్ భేటీ వెనుక ప్రత్యేక కారణం ఉందని అనుకుంటున్నారు. ఈ నెలలో ఇద్దరూ కలిసి ఒక బహిరంగ సభలో ప్రసంగించాలని ఇంతకు ముందే నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఎన్నికల్లో జనసేనకు కేటాయించాల్సిన స్థానాలపై త్వరగా స్పష్టత ఇస్తే అక్కడ పార్టీ బలోపేతం చేసుకోవడమే కాకుండా అభ్యర్ధుల ఎంపిక  కూడా తాము పూర్తి చేసుకుంటామని జనసేన నాయకత్వం చెబుతోంది. ఇందు కోసమే పవన్ చంద్రబాబుతో భేటీ అయ్యారా అనే చర్చ జరుగుతోంది. పొత్తులో భాగంగా తమకు కేటాయించే స్థానాలపై స్పష్టత వస్తే అక్కడ ఎక్కువల సార్లు తాను పర్యటించేలా ప్లాన్ చేసుకునేందుకు వీలు ఉంటుందని పవన్ భావిస్తున్నారు. సమన్వయం లేకుండా ఇటు టీడీపీ, అటు జనసేన నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను నియమిస్తుంటే రాబోయే రోజుల్లో ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉన్నందున ముందుగా పార్టీ శ్రేణులను సమన్వయపర్చి అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించాలని అనుకుంటున్నారుట. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Amit Shah: పార్లమెంట్ లో పీఓకే పై సంచలన ప్రకటన చేసిన అమిత్ షా .. రెండు కీలక బిల్లులు ఆమోదం

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju