NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: రేపు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం .. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

Revanth Reddy: హైదరాబాద్ ఎల్బీ నగర్ స్టేడియంలో గురువారం (రేపు) మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందు కోసం స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా ఇతర శాఖల అధికారులు అక్కడి ఏర్పాట్లు పరిశీలించారు. బందోబస్తు తదితర అంశాలపై డీజీపీ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ, ఏర్పాట్లపై స్టేడియంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలతో పోలీసు, సాధారణ పరిపాలనా శాఖ అధికారులు చర్చించారు.

స్టేడియంలో మొత్తం మూడు వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక పైనే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తారు. వేదిక ఎడమ వైపు 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. కుడి వైపు వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదిక ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్ కు ఘన స్వాగతం పలకనున్నారు. అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ, తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ తో పాటు, 30వేల మంది సాధారణ ప్రజలు కుర్చునేలా ఏర్పాట్లు చేశారు. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు.

మరో పక్క సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలతో వాహనాలు దారి మల్లించడం ద్వారా రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ కాంప్లెక్స్, బషీర్ భాగ్, ఎస్బీఐ గన్ ఫౌండ్రి, ఆబిడ్స్ సర్కిల్, లిబర్టీ సర్కిల్, హిమాయత్ నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్ కూడలి వద్ద వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నగరవాసులు ఎల్బీ స్టేడియానికి వచ్చే మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ దారులు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఏదైనా అసౌకకర్యం ఏర్పడితే హెల్ప్ లైన్ నెంబర్ లకు ఫోన్ చేయాలని చెప్పారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

  • పబ్లిక్ గార్డెన్ నుండి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లింపు
  • ఎస్బీఐ గన్ ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు మళ్లింపు
  • సుజాత స్కూల్ నుండి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లింపు
  • బషీర్ భాగ్ నుండి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్ కోఠి వైపు మళ్లింపు

TDP Janasena: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju