NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo December 07 2023 Episode 229: శిరీషను ఇంటికి తీసుకు రావడంతో టెన్షన్ పడుతున్న ధనంజయ్..

Madhuranagarilo Today Episode December 07 2023 Episode 229 Highlights

Madhuranagarilo December 07 2023 Episode 229: ఏంటి పండు ఏం జరిగింది తలకు కట్టు కట్టుకున్నావు అని రుక్మిణి అడుగుతుంది.ఏమీ లేదు పెద్దమ్మ చిన్న యాక్సిడెంట్ జరిగింది అని పండు చెప్తాడు.యాక్సిడెంట్ దెబ్బలు బాగా తగిలాయన నొప్పిగా ఉందా అని కంగారుగా అడుగుతుంది రుక్మిణి. ఏమీ లేదు పెద్దమ్మ కానీ టాబ్లెట్ వేసుకోవాలంటేనే బాధగా ఉంది అని పండు అంటాడు. అక్క చిన్న యాక్సిడెంట్ అక్క పెద్దగా ఏమీ కాలేదు తగ్గిపోతుంది నువ్వేం టెన్షన్ పడకు అని రాదా అంటుంది. పెద్దమ్మ మా డాడీ వచ్చాడు నువ్వు మమ్మీ తో మాట్లాడు నేను ఉంటాను అని పండు అంటాడు. అక్క ఆయన వచ్చారు నేను తర్వాత ఫోన్ చేస్తాను అని రాధ కూడా ఫోన్ పెట్టేస్తుంది. కట్ చేస్తే, ఏంటండీ పండు కి యాక్సిడెంట్ అయింది అంట ఎలా ఉందో ఏమో అని నాగమణి టెన్షన్ పడుతుంది. తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుందమ్మా ఇంతకుముందు అంటే రాధకి పెళ్లి కాలేదు కాబట్టి పండు రాధ దగ్గర ఉన్న నాకేమీ అనిపించలేదు కానీ ఇప్పుడు రాధకు పెళ్లి అయ్యి అత్తవారింట్లో ఉన్నప్పుడు కూడా పండు తన వెంట ఉంటే నాకెందుకో పండుని తీసుకొచ్చేయాలనిపిస్తుంది రేపే వెళ్లి రాధకి నచ్చచెప్పి పండుని తీసుకొచ్చుకుంటానమ్మ నా కొడుకు నా దగ్గరే ఉంటాడు అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode December 07 2023 Episode 229 Highlights
Madhuranagarilo Today Episode December 07 2023 Episode 229 Highlights

వాడి చిన్న మనసుకి రాధ తల్లి కాదు నువ్వే తల్లి అని చెప్తే వాడు అర్థం చేసుకోలేడమ్మా వాడికి కొన్ని రోజులు నచ్చజెప్పి ఆ తర్వాత నువ్వే అమ్మవని చెప్పు లేదంటే పండు నీ దగ్గర ఉండలేక రాదని వదిలిపెట్టలేక బాధపడతాడు అని మురళి అంటాడు. ఏమో నాన్న నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు నా భర్తతో మనకొక బిడ్డ ఉన్నాడని చెప్పుకోలేను ఆయన రెండో భార్యను వదిలేస్తే కానీ నేను పండుని ఆయనకు పరిచయం చేయలేను ఇదంతా ఎప్పుడు జరుగుతుందో అని రుక్మిణి అంటుంది. దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది లేమ్మా నువ్వు బాధపడకు అని మురళి అంటాడు. అలాగే నాన్న పండుని నేను మన ఇంటికి తీసుకురాను రాదా దగ్గరే ఉంచుతాను అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే, ఏంటండీ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది మధుర. ఏమీ లేదు మధుర తలనొప్పి అని చెప్పాను కదా అని ధనంజయ్ అంటాడు.

Madhuranagarilo Today Episode December 07 2023 Episode 229 Highlights
Madhuranagarilo Today Episode December 07 2023 Episode 229 Highlights

మనకు పెళ్లయి ఇన్ని సంవత్సరాలు అయినా మన మధ్య ఎలాంటి దాపరికాలు లేవు నీకు నిజంగానే తలనొప్పి అయితే పర్వాలేదు కానీ నా దగ్గర ఏదైనా దాస్తున్నారా చెప్పండి పర్వాలేదు నేను అర్థం చేసుకోగలను అని మధుర అంటుంది. తలనొప్పి తప్ప ఇంకేమీ లేదు మధురా నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అని ధనంజయ్ పడుకుంటాడు. మామయ్య గారి మాటల్లో ఏదో బాధ అనిపిస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని రాదా  అనుకుంటుంది. కట్ చేస్తే, ఇంతలో తెల్లవారింది. అమ్మ రాదెక్కడ అని శ్యామ్ అంటాడు. ఇంట్లో సామాన్లు తీసుకురావడానికి బయటకి వెళ్ళింది రా అని మధుర అంటుంది. సామాన్లు తెమ్మని రాదని బయటికి పంపించడమేంటమ్మా లిస్టు రాసిస్తే నేనే తెచ్చే వాడిని కదా అని శ్యామ్ అంటాడు. ఏం పాపం నీ భార్య సామాన్లు తేవడానికి కూడా బజారుకు వెళ్లకూడదా నాయనా అన్ని పనులు మేమే చేయాలా నీ భార్య చేయకూడదా అని మధుర వెటకారంగా అంటుంది.

Madhuranagarilo Today Episode December 07 2023 Episode 229 Highlights
Madhuranagarilo Today Episode December 07 2023 Episode 229 Highlights

అవున్రా రాధా ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఎలా బయటికి వెళ్లాల్లి  అప్పుడే కదా లోకజ్ఞానం తెలిసేది అని ధనంజయ్ అంటాడు. ఇంతలో దాక్షాయని చలపతి అక్కడికి వచ్చి అవును వదిన కోత కోడలు అని నెత్తిన పెట్టుకుంటే పనిమనిషిని చేస్తారు అని దాక్షాయిని అంటుంది. అవును చెల్లెమ్మ ఎంత పని మనుషులను చేస్తారు అంటే ఈ ఇంటికి జీతం లేని పని వాడిలా చూస్తారు అని చలపతి అంటాడు. మేము ముగ్గురము ఏదో టైం పాస్ కు అలా మాట్లాడుకుంటుంటే మీరు నిజంగానే అనుకొని పుల్లలు పెడుతున్నారా అని మధుర అంటుంది. సందు దొరికితే చాలు గొడవలు పెట్టడానికి ట్రై చేస్తారు ఎందుకు మీకు ఇలాంటి బుద్ధులు చక్కగా ఇంట్లో తిని ఉండొచ్చు కదా అని ధనంజయ్ అంటాడు. Madhuranagarilo Today Episode December 07 2023 Episode 229 Highlights

Madhuranagarilo Today Episode December 07 2023 Episode 229 Highlightsఏమోలే వదిన అలవాట్లో పొరపాటుగా నోరు జారము ఇంతకు రాధ ఎక్కడ అని దాక్షాయిని అంటుంది. ఇంతలో స్కూటీ సౌండ్ వినపడగానే అందరూ రోడ్డు వంకాయ చూస్తారు. రాధా స్కూటీ వేసుకుని వచ్చి అక్కడ ఆపి శిరీషను తీసుకొని వస్తుంది. శిరీషను చూసిన ధన0జయ్ షాక్ అవుతాడు. రామ రా వచ్చి కూర్చో అని మధుర అంటుంది.ఏంటి రాధా నీకు ఈ అమ్మాయి ఎక్కడ కలిసింది అని మధుర అడుగుతుంది.ఇదేంటి రాధా శిరీషను ఇంటికి ఎలా తీసుకువచ్చింది ఎందుకు తీసుకువచ్చింది ఏం జరిగింది అని ధనంజయ్ ఆలోచిస్తూ ఉంటాడు.

Madhuranagarilo Today Episode December 07 2023 Episode 229 Highlights
Madhuranagarilo Today Episode December 07 2023 Episode 229 Highlights

ఈ అమ్మాయి ఎవరమ్మా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని దాక్షాయని అడుగుతుంది. అదే పిన్ని గారు మొన్న పండుకు యాక్సిడెంట్ అయినప్పుడు కాపాడింది ఒక అమ్మాయిని చెప్పాను కదా ఆ అమ్మాయి ఈ అమ్మాయి తన పేరు శిరీష అని చెప్తుంది రాదా. అవును రాదా శిరీష నీకు ఎక్కడ కనిపించింది అని మధుర అడుగుతుంది. నేను అనుకోకుండా వస్తూ ఉంటే దారిలో కనిపించింది అత్తయ్య శిరీష కోచింగ్ సెంటర్ నుంచి వస్తూ ఉండగా రౌడీలు ఏడిపిస్తూ ఉంటారు అని రాదా చెప్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Saranya Koduri

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar