Animal: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన “యానిమల్” సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఈ సినిమా చూసి రివ్యూలు ఇచ్చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా… సరికొత్తగా.. వెరైటీ జోనర్ లో.. రాస్తున్న హీరో క్యారెక్టర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో రేణు దేశాయ్ యానిమల్ చూసి లవ్లో పడ్డాను అని చాలా బోల్డ్ కామెంట్ పెట్టడం జరిగింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, హరిష్ శంకర్ సైతం పేజీలు పేజీలు.. “యానిమల్” సినిమాకి రివ్యూ ఇచ్చారు. తెలుగు తమిళం మలయాళం హిందీ కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
“యానిమల్” సినిమా హిట్ తో ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ సత్తా చాటడం జరిగింది. ఈ సినిమాకి వచ్చినా రెస్పాన్స్ మరియు కలెక్షన్స్ రణబీర్ కపూర్ కెరియర్ లోని ఆల్ టైం రికార్డులు క్రియేట్ అయ్యాయి. మేటర్ లోకి వెళ్తే యానిమల్ సినిమా ఐదు రోజులలో 500 కోట్లు కలెక్ట్ చేసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. జవాన్, పఠాన్, గద్దర్ 2 సినిమాల తర్వాత ఇప్పుడు “యానిమల్” సినిమా కూడా.. మంచి కలెక్షన్స్ రాబడుతోంది. వీకెండ్ రోజు 100 కోట్లకు పై కలెక్ట్ చేసిన ఈ సినిమా నార్మల్ డేస్ లో రోజుకి 50 కోట్లకు పైగా .. వసూలు రాబడుతుంది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ నటన సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది.
ఫస్టాఫ్ రక్తపాతం సెకండాఫ్ ఎమోషన్ సన్నివేశాలతో ఆకట్టుకోవడం జరిగింది. రణబీర్ కపూర్ నీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చాలా డిఫరెంట్ గా చూపించారు. ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు చూపించండి రీతిలో… “యానిమల్” లో చూపించడం జరిగింది. హీరోయిన్ రష్మిక మందన కూడా ద్వితీయార్థంలో అద్భుతమైన నటనతో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా బాబీ డియోల్ విలన్ గా రణబీర్ కపూర్ నటనకు నువ్వా నేనా అన్నట్టుగా స్క్రీన్ మీద పోటీ ఇచ్చారు. అన్ని రకాలుగా యానిమల్ సినిమా అందరిని ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది.